MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • WhatsApp: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పండగే.. వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు

WhatsApp: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పండగే.. వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు

EPFO WhatsApp Services: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ ద్వారా పీఎఫ్ సేవలు అందిస్తామని వెల్లడించింది. అలాగే, యూపీఐ ద్వారా ఈజీగా డబ్బుల విత్‌డ్రా సదుపాయం తీసుకురానుంది. ఆ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 20 2026, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీఎఫ్ సేవలపై సూపర్ న్యూస్ చెప్పిన కేంద్రం
Image Credit : Gemini

పీఎఫ్ సేవలపై సూపర్ న్యూస్ చెప్పిన కేంద్రం

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను మరింత సులభతరం చేస్తోంది. ఇకపై మీ మొబైల్‌లోని వాట్సాప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అంతేకాదు, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సేవలు కూడా రాబోతున్నాయి.

ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కీలక విషయాలను వెల్లడించారు. ఈ సరికొత్త డిజిటల్ సేవలు ఒక నెల రోజుల్లోనే అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు
Image Credit : Asianet News

వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు

ఈపీఎఫ్ఓ యూజర్ల కోసం వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలని సంస్థ నిర్ణయించింది. దీని ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చూడటం, చివరి ఐదు ట్రాన్సాక్షన్స్ వివరాలు తెలుసుకోవడం, క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవడం వంటి పనులన్నీ ఈజీగా అయిపోతాయి. ఒక నెల రోజుల్లోనే ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.

యూజర్ల భద్రత కోసం ఒక ప్రత్యేక సిస్టమ్ పనిచేస్తుందని అధికారులు చెప్పారు. సభ్యులు ఎవరైనా వాట్సాప్‌లో మెసేజ్ పంపినప్పుడు, ఆ నంబర్ వారి యూనివర్సల్ అకౌంట్ నంబర్ కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబరేనా కాదా అని ఈపీఎఫ్ఓ వెరిఫై చేస్తుంది. అది కరెక్ట్ అయితే, వెంటనే స్థానిక భాషలోనే సింపుల్ మెనూ ఆప్షన్లు కనిపిస్తాయి. చాట్‌బాట్ లేదా ఈపీఎఫ్ఓ డేటాబేస్ ద్వారా ఏఐ సాయంతో మీ ప్రశ్నలకు వెంటనే రిప్లై వస్తుంది.

Related Articles

Related image1
Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!
Related image2
African Lungfish: నీరు లేకుండా ఏకంగా నాలుగేళ్లు బతికేసే వింత చేప ఇది.. ఈ ఆఫ్రికన్ లంగ్‌ఫిష్ కథేంటో తెలుసా?
35
పీఎఫ్ మనీ: యూపీఐ ద్వారా విత్‌డ్రా
Image Credit : Gemini

పీఎఫ్ మనీ: యూపీఐ ద్వారా విత్‌డ్రా

ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవడానికి, వాటిని నేరుగా బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయడానికి త్వరలోనే యూపీఐ పేమెంట్ గేట్‌వేలను అనుమతించనున్నట్లు మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది.

"యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా సభ్యులు ఈపీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునే సదుపాయంపై టెస్టింగ్ పూర్తి చేశాం. విత్‌డ్రా చేసిన అమౌంట్ నేరుగా సభ్యుని బ్యాంక్ ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది" అని మంత్రి వివరించారు. దీనివల్ల పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

45
తగ్గిన కోర్టు కేసులు
Image Credit : Asianet News

తగ్గిన కోర్టు కేసులు

ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన "నిధి ఆప్కే నికట్ (NAN)" లాంటి ప్రత్యేక కార్యక్రమాల వల్ల దేశవ్యాప్తంగా వివిధ వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య భారీగా తగ్గిందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 1, 2024 నాటికి 4,936 గా ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య, మార్చి 31, 2026 నాటికి 2,646 కి తగ్గిపోయింది.

అలాగే, మొత్తం కోర్టు కేసుల పెండెన్సీ ఏప్రిల్ 1, 2025 నాటికి 31,036 కేసులు ఉండగా, ఏప్రిల్ 1, 2026 నాటికి అది 27,639 కి తగ్గింది. అంటే దాదాపు 3,397 కేసులు తగ్గాయి. ఈపీఎఫ్ఓ చరిత్రలోనే కేసుల సంఖ్య ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి అని మంత్రి మాండవీయ సంతోషం వ్యక్తం చేశారు.

55
కొత్త పోర్టళ్లు.. టార్గెటెడ్ సపోర్ట్
Image Credit : Asianet News

కొత్త పోర్టళ్లు.. టార్గెటెడ్ సపోర్ట్

నాలుగు లేబర్ కోడ్‌లకు అనుగుణంగా మే 9న శ్రమ్ సువిధ 2.0 (SSP 2.0), సమాధాన్ 2.0 పోర్టళ్లను అప్‌గ్రేడ్ చేసి లాంచ్ చేసినట్లు మంత్రి చెప్పారు. ఇవి కార్మిక చట్టాల అమలును, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత బలోపేతం చేస్తాయి. వ్యాపారాలను సులభతరం చేయడానికి ఇవి దోహదపడతాయి. మోడరన్, సురక్షితమైన డిజిటల్ ఆర్కిటెక్చర్‌తో వీటిని రూపొందించినట్టు తెలిపారు.

మరోవైపు, ప్రధానమంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద అర్హులైన సభ్యులకు వాట్సాప్ ద్వారా ప్రత్యేక సపోర్ట్ లభిస్తుంది. ఆధార్ అథెంటికేషన్ పూర్తి కాకపోవడం, లేదా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్‌కు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఎనేబుల్ కాకపోవడం వంటి సమస్యలు ఉన్నవారికి వాట్సాప్ ద్వారానే వాటిని పరిష్కరించేలా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea: నెల‌కు ల‌క్ష సంపాదించే అవ‌కాశం.. ట్రెండీ ఐడియా, ప్రైవేట్ థియేట‌ర్ బిజినెస్‌తో సాధ్య‌మే
Recommended image2
Cheap Fuel Countries: లీటర్ పెట్రోల్ రూ. 3 మాత్రమే! ఈ దేశాల్లో నీళ్ల కంటే చౌకగా ఇంధనం.. పూర్తి లిస్ట్ ఇదే
Recommended image3
Gold Price Hike: మళ్లీ పశ్చిమాసియాలో ముసురుతున్న యుద్ధం.. రాకెట్ లా దూసుకెళ్తున్న బంగారం ధరలు
Related Stories
Recommended image1
Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!
Recommended image2
African Lungfish: నీరు లేకుండా ఏకంగా నాలుగేళ్లు బతికేసే వింత చేప ఇది.. ఈ ఆఫ్రికన్ లంగ్‌ఫిష్ కథేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved