MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

Gold Price Hike: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ నిర్ణయంతో బంగారం మార్కెట్‌లో ఒడిదొడుకులు నెలకొన్నాయి. ఇరాన్‌పై యుద్ధం వాయిదా అంటూ ట్రంప్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లు షాక్‌కు గురయ్యాయి. దీంతో బంగారం పరుగులు పెడుతోంది. 

2 Min read
Author : Nandini Arava
Published : May 19 2026, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్లోబల్ మార్కెట్లను కుదిపేసిన ట్రంప్ నిర్ణయం
Image Credit : Asianet News

గ్లోబల్ మార్కెట్లను కుదిపేసిన ట్రంప్ నిర్ణయం

అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ఎంతటి ప్రభావం చూపిస్తాయో మరోసారి స్పష్టమైంది. అమెరికా అధ్యక్షుడు Trump ఇరాన్‌పై ప్రతిపాదిత సైనిక చర్యలను తాత్కాలికంగా వాయిదా వేయడంతో పాటు, ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగుపడ్డాయని చేసిన వ్యాఖ్యలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేశాయి. ఈ ప్రకటనలతో అంతర్జాతీయంగా చమురు, బంగారం, వెండి మార్కెట్లలో భారీ మార్పులు కనిపించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెరిగిన ఆయిల్ ధరలు
Image Credit : iSTOCK

పెరిగిన ఆయిల్ ధరలు

మధ్యప్రాచ్యంలో  అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగాయి. గత కొన్ని రోజులుగా యుద్ధ భయాలతో పెరుగుతున్న ఆయిల్ ధరలు పెరిగాయి. సాధారణంగా ప్రపంచంలో యుద్ధ వాతావరణం లేదా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం వంటి సురక్షిత పెట్టుబడులవైపు పరుగులు తీస్తారు. కానీ తాజా పరిణామాలతో మార్కెట్లో అనిశ్చితి కొంత తగ్గినప్పటికీ, బంగారంపై డిమాండ్ మాత్రం బలంగానే కొనసాగుతోంది. 

35
కొనుగోలుదారుల్లో ఆందోళన
Image Credit : AI

కొనుగోలుదారుల్లో ఆందోళన

అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో వచ్చిన ఈ మార్పుల ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా పడింది. ముఖ్యంగా హైదరాబాద్ బంగారం మార్కెట్లో ధరలు మరోసారి పైకి ఎగిశాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేసే వారు ఇప్పుడు కొత్త రేట్లు చూసి షాక్ అవుతున్నారు. రోజురోజుకూ ధరలు మారిపోతుండటంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. 

45
రూ.1,57,040 కు చేరిన బంగారం
Image Credit : chatgpt

రూ.1,57,040 కు చేరిన బంగారం

హైదరాబాద్ నగరంలో నేటి బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.820 పెరిగి రూ.1,57,040 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,43,950కు చేరింది. ఇక మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.610 పెరిగి రూ.1,17,780గా నమోదైంది.

55
మార్కెట్లో గందరగోళం
Image Credit : iSTOCK

మార్కెట్లో గందరగోళం

వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ కదలికలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, మధ్యప్రాచ్య పరిణామాలు వంటి అంశాలు వచ్చే రోజుల్లో బంగారం, వెండి ధరలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పూర్తిగా తగ్గకపోవడంతో బంగారం ధరలు ఇంకా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Gold Price Fall: బంగారం మళ్లీ డౌన్ ఫాల్.. వెండి కొండెక్కింది. హైదరాబాద్‌లో ఇవాళ్టి రేట్లు ఇవే!
Recommended image2
Gold Care Tips: పాత నగలకు కొత్త మెరుపు.. ఈ ట్రిక్ తో మీ జ్యూవెలరీ తళతళా మెరవడం ఖాయం.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved