MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి పండ‌గే.. పెన్ష‌న్‌ను రూ. 3 వేల‌కి పెంచ‌నున్న కేంద్రం.?

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి పండ‌గే.. పెన్ష‌న్‌ను రూ. 3 వేల‌కి పెంచ‌నున్న కేంద్రం.?

EPFO: ప్రతి నెల పీఎఫ్‌ కట్ అవుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఈపీఎఫ్ఓ ప్ర‌స్తుతం ఇస్తున్న కనీస పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.3000కు పెంచే అంశంపై కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 19 2026, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ జీతం పొందిన ఉద్యోగులకు భారీ ఊరట
Image Credit : Gemini AI

తక్కువ జీతం పొందిన ఉద్యోగులకు భారీ ఊరట

ప్రస్తుతం EPS-95 స్కీమ్ కింద ఉద్యోగులకు కనీసంగా నెలకు రూ.1000 పెన్షన్ అందుతోంది. అయితే పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం కారణంగా ఈ మొత్తం సరిపోవడం లేదని చాలా కాలంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారు ప్రస్తుతం వచ్చే పెన్షన్‌తో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రూ.3000కు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తక్కువ జీతాలతో పనిచేసిన ఉద్యోగులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
EPF పెన్షన్ లెక్కింపు ఎలా జరుగుతుంది?
Image Credit : X

EPF పెన్షన్ లెక్కింపు ఎలా జరుగుతుంది?

EPF పెన్షన్ ఉద్యోగి పనిచేసిన సంవత్సరాలు, సగటు జీతం ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగి చివరి 60 నెలల సగటు జీతాన్ని పరిగణలోకి తీసుకుని పెన్షన్‌ను నిర్ణయిస్తారు. ఎక్కువ కాలం ఉద్యోగం చేసిన వారికి ఎక్కువ ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాలకు పైగా సేవలు అందించిన ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం రూ.3000 కనీస పెన్షన్‌పై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కార్మిక శాఖ, EPFO అధికారులు ఈ అంశంపై చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
కుక్క‌ర్ హ్యాండిల్ ప‌దే ప‌దే లూజ్ అవుతోందా.? నెయిల్ పెయింట్‌తో ఇలా చేస్తే మ‌ళ్లీ స‌మ‌స్య రాదు
Related image2
Tirupati: రూ. 1000 లోపే హైదరాబాద్ టు తిరుపతి టూర్‌ ప్లాన్.. అవును ఇలా చేస్తే సాధ్య‌మే
35
EPFO 3.0తో పూర్తిగా డిజిటల్ సేవలు
Image Credit : X

EPFO 3.0తో పూర్తిగా డిజిటల్ సేవలు

ప్రభుత్వం EPFO వ్యవస్థను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు “EPFO 3.0”ను తీసుకురాబోతోంది. ఇప్పటివరకు PF క్లెయిమ్ లేదా ఇతర సేవల కోసం ఉద్యోగులు ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చేది. కొత్త వ్యవస్థలో ఈ ప్రక్రియలను వేగంగా, సులభంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఆటోమేటిక్‌గా జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. దీని వల్ల PF డబ్బుల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే ఉద్యోగులు తమ KYC, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను ఆన్‌లైన్‌లోనే సులభంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా పెన్షన్ స్టేటస్ కూడా వెంటనే తెలుసుకోవచ్చు.

45
ఏటీఎమ్ కార్డుతో పీఎఫ్ డబ్బులు ఉపసంహరణ
Image Credit : Asianet News

ఏటీఎమ్ కార్డుతో పీఎఫ్ డబ్బులు ఉపసంహరణ

EPFO 3.0లో భాగంగా సభ్యులకు ATM లేదా డెబిట్ కార్డ్ తరహా సౌకర్యాన్ని అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ PF డబ్బులను ATM ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు PF డబ్బుల కోసం క్లెయిమ్ పెట్టి ఆమోదం వచ్చే వరకు వేచి చూడాల్సి వచ్చేది. కానీ కొత్త విధానంతో అత్యవసర సమయంలో కూడా వెంటనే డబ్బులు తీసుకునే వీలు ఉంటుంది.

55
AI టెక్నాలజీతో వేగవంతమైన సేవలు
Image Credit : Asianet News

AI టెక్నాలజీతో వేగవంతమైన సేవలు

కొత్త EPFO 3.0లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని కూడా ఉపయోగించనున్నారు. దీని ద్వారా ఫేక్ క్లెయిమ్స్‌ను గుర్తించడం సులభమవుతుంది. మోసాలను తగ్గించడంతో పాటు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయవచ్చు. ఉద్యోగులు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే విధానం మరింత సులభం కానుంది. మొత్తానికి EPFOలో తీసుకురాబోతున్న ఈ మార్పులు ఉద్యోగులకు పెద్ద ఊరటనివ్వనున్నాయి. ముఖ్యంగా కనీస పెన్షన్ పెంపు అమల్లోకి వస్తే లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా మంచి సహాయం లభించే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
India Debt: భారత్ పై 200 లక్షల కోట్ల అప్పు.. ఎవరి దగ్గర తీసుకుంది? వడ్డీ భారం ఎంతో తెలుసా?
Recommended image2
Post Office: రోజుకు రూ. 400 ప‌క్క‌న‌పెడితే చాలు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 6 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Recommended image3
Gold Price Crash: రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్...భారీగా కుప్పకూలిపోయిన పసిడి, వెండి
Related Stories
Recommended image1
కుక్క‌ర్ హ్యాండిల్ ప‌దే ప‌దే లూజ్ అవుతోందా.? నెయిల్ పెయింట్‌తో ఇలా చేస్తే మ‌ళ్లీ స‌మ‌స్య రాదు
Recommended image2
Tirupati: రూ. 1000 లోపే హైదరాబాద్ టు తిరుపతి టూర్‌ ప్లాన్.. అవును ఇలా చేస్తే సాధ్య‌మే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved