MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • EPFO 3.0 : బ్యాంక్ లాగే మారనున్న ఈపీఎఫ్ఓ.. కొత్త రూల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !

EPFO 3.0 : బ్యాంక్ లాగే మారనున్న ఈపీఎఫ్ఓ.. కొత్త రూల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే !

EPFO 3.0 : ఈపీఎఫ్ఓ ద్వారా పీఎఫ్ మనీ విత్ డ్రా చేసుకోవడం మరింత ఈజీ కానుంది. యూపీఐ, ఏటీఎం ద్వారా నగదు తీసుకునే వెసులుబాటుతో పాటు కొత్త నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 09 2026, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు ఇకపై చాలా ఈజీ !
Image Credit : Asianet News

పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు ఇకపై చాలా ఈజీ !

దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ఈపీఎఫ్ఓ 3.0 (EPFO 3.0)ను తీసుకువస్తోంది. దీని ద్వారా పీఎఫ్ ఖాతాదారులు తమ మనీ డ్రా చేసుకోవడం మరింత ఈజీ కానుంది. బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు తీయడం ఎంత సులువో, ఇకపై పీఎఫ్ ఖాతా నుండి కూడా అంతే సులభంగా మనీని పొందేలా మార్పులు చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా
Image Credit : Gemini

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా

ఈపీఎఫ్ఓ 3.0 లో అతిపెద్ద మార్పు ఏమిటంటే, ఇకపై మీరు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. గతంలో పీఎఫ్ డబ్బులు కావాలంటే దరఖాస్తు చేసుకుని, అది ఆమోదం పొందే వరకు వేచి చూడాల్సి వచ్చేది. కానీ కొత్త విధానంలో పేపర్ వర్క్ చాలా తక్కువ. అతి తక్కువ సమయంలోనే నగదు చేతికి అందుతుంది. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో సుమారు 50 శాతం వరకు తక్షణమే విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.

Related Articles

Related image1
YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
Related image2
Unhappiest Countries: ఈ దేశాల్లోని ప్రజలకు సంతోషమంటేనే తెలియదు, ఇక్కడ పుట్టడమే శాపం
36
కోర్ బ్యాంకింగ్ తరహాలో ఈపీఎఫ్ఓ కొత్త వ్యవస్థ
Image Credit : Asianet News

కోర్ బ్యాంకింగ్ తరహాలో ఈపీఎఫ్ఓ కొత్త వ్యవస్థ

ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్ఓ సాంకేతిక వ్యవస్థ పాతది కావడం వల్ల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉండటం, వెరిఫికేషన్‌లో ఆలస్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని అధిగమించడానికి 'కోర్ బ్యాంకింగ్ మోడల్'ను ప్రవేశపెడుతున్నారు. కమర్షియల్ బ్యాంకులు ఏ విధంగా అయితే రియల్ టైమ్‌లో లక్షలాది లావాదేవీలను నిర్వహిస్తాయో, ఈపీఎఫ్ఓ కూడా అదే వేగంతో పనిచేస్తుంది. దీనివల్ల దేశంలో ఏ ఈపీఎఫ్ఓ కార్యాలయంలోనైనా మీ ఫిర్యాదులను పరిష్కరించుకోవచ్చు. అంటే మీ ఖాతా ఎక్కడ ఓపెన్ చేసినా, మీరు ఎక్కడి నుండైనా సేవలు పొందవచ్చు.

46
మారిన పీఎఫ్ విత్ డ్రా కేటగిరీలు
Image Credit : freepik

మారిన పీఎఫ్ విత్ డ్రా కేటగిరీలు

పాత నిబంధనల ప్రకారం పీఎఫ్ పాక్షిక విత్ డ్రా కోసం 13 వేర్వేరు రకాల కేటగిరీలు ఉండేవి. ఇది సామాన్యులకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. EPFO 3.0లో వీటిని కేవలం 3 సరళమైన కేటగిరీలుగా మార్చారు..

1. అత్యవసర అవసరాలు

2. నివాస అవసరాలు

3. ప్రత్యేక పరిస్థితులు

ఈ మార్పు వల్ల ఉద్యోగులకు క్లెయిమ్ చేయడం చాలా సులభం అవుతుంది.

56
పెరిగిన పీఎఫ్ విత్ డ్రా పరిమితి.. తగ్గిన వెయిటింగ్ పీరియడ్
Image Credit : Twitter

పెరిగిన పీఎఫ్ విత్ డ్రా పరిమితి.. తగ్గిన వెయిటింగ్ పీరియడ్

కొత్త రూల్స్ ప్రకారం, సర్వీస్ పీరియడ్‌లో కూడా భారీ మార్పులు చేశారు. గతంలో విత్ డ్రా కోసం గరిష్ఠంగా 7 ఏళ్ల వరకు వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని కేటగిరీలకు కనిష్ఠ సర్వీస్ కాలాన్ని కేవలం 12 నెలలకు తగ్గించారు. అంతేకాకుండా, గతంలో కేవలం ఉద్యోగి వాటా మాత్రమే వచ్చేది, కానీ ఇప్పుడు యజమాని వాటా + వడ్డీతో కలిపి 75 శాతం వరకు నగదును ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే విత్ డ్రా చేసుకోవచ్చు. నిరుద్యోగిత ఎదురైనప్పుడు కూడా 75 శాతం బ్యాలెన్స్‌ను వెంటనే తీసుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని 12 నెలల తర్వాత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

66
రిటైర్మెంట్ భద్రత.. పెన్షన్ రూల్స్ ఇవే
Image Credit : our own

రిటైర్మెంట్ భద్రత.. పెన్షన్ రూల్స్ ఇవే

ఈపీఎఫ్ఓ 3.0 కేవలం నగదు విత్ డ్రా మాత్రమే కాకుండా, ఉద్యోగి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుంది. అందుకే 25 శాతం నిధిని ఖాతాలోనే ఉంచడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పెన్షన్ విత్ డ్రా విషయానికి వస్తే, గతంలో 2 నెలల తర్వాత తీసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు దానిని 36 నెలలకు పెంచారు. రిటైర్మెంట్ (55 ఏళ్లు), అంగవైకల్యం లేదా శాశ్వతంగా విదేశాలకు వెళ్లే సందర్భాల్లో పూర్తి విత్ డ్రాకు ఎప్పటిలాగే అనుమతి ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Related Stories
Recommended image1
YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
Recommended image2
Unhappiest Countries: ఈ దేశాల్లోని ప్రజలకు సంతోషమంటేనే తెలియదు, ఇక్కడ పుట్టడమే శాపం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved