MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Credit Score : మీ సిబిల్ స్కోరు 730 కంటే తక్కువుందా? అయితే మీకు ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ తెలియాల్సిందే

Credit Score : మీ సిబిల్ స్కోరు 730 కంటే తక్కువుందా? అయితే మీకు ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ తెలియాల్సిందే

ఆర్‌బీఐ తీసుకురాబోతున్న కొత్త నిబంధనలతో లోన్ తీసుకునే ప్రక్రియ పూర్తిగా మారనుంది. ఇప్పటిదాకా డిఫాల్ట్ అయ్యాకే చర్యలు తీసుకునే బ్యాంకులు, ఇకపై ముందే ప్రమాదాన్ని అంచనా వేయనున్నాయి.  

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 12 2026, 09:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తస్మాత్ జాగ్రత్త..
Image Credit : Getty

తస్మాత్ జాగ్రత్త..

బ్యాంకుల నుండి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న కోట్లాది మంది భారతీయులకు ఇది ముఖ్యమైన అప్‌డేట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకురాబోతున్న 'ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్' (ECL) ఫ్రేమ్‌వర్క్, బ్యాంకులు లోన్లు ఇచ్చే పద్ధతినే మార్చేయనుంది. ఏప్రిల్ 1, 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలు, ముఖ్యంగా తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారిపై నేరుగా ప్రభావం చూపొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాంక్ లోన్ రూల్స్ చేంజ్..
Image Credit : Asianet News

బ్యాంక్ లోన్ రూల్స్ చేంజ్..

ప్రస్తుత పద్ధతిలో కస్టమర్ లోన్ వాయిదాలు కట్టడంలో సమస్య వచ్చిన తర్వాతే బ్యాంకులు రిస్క్‌ను అంచనా వేస్తున్నాయి. కానీ కొత్త ECL విధానం, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయడానికి బ్యాంకులకు సహాయపడుతుంది. ఈఎంఐ ఆలస్యం కావడం, ఆదాయంలో స్థిరత్వం లేకపోవడం, క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడటం వంటి అంశాలు మీ లోన్ అర్హతను నిర్ణయిస్తాయి.

Related Articles

Related image1
RBI : సైబర్ దొంగతనాలకు 'కిల్ స్విచ్' తో చెక్.. అంటే ఏమిటో తెలుసా..?
Related image2
RBI Rules : ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటే రూ.10,000 ఫైన్..?
35
730 లోపు సిబిల్ ఉంటే ఏం జరుగుతుంది?
Image Credit : Getty

730 లోపు సిబిల్ ఉంటే ఏం జరుగుతుంది?

బ్యాంకింగ్ రంగ నిపుణుల అంచనాల ప్రకారం… 730 కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి లోన్ పొందడం ఒక సవాల్‌గా మారొచ్చు. వీరికి బ్యాంకులు అధిక వడ్డీ రేటు విధించడం, అదనపు డాక్యుమెంట్లు అడగటం, లేదా ఆస్తిని తనకా పెట్టమనడం వంటి షరతులు కోరవచ్చు. కొన్నిసార్లు లోన్ అప్లికేషన్లను నేరుగా తిరస్కరించే అవకాశం కూడా ఉంది.

45
మంచి క్రెడిట్ స్కోర్‌కు అదనపు ప్రయోజనాలు
Image Credit : ANI

మంచి క్రెడిట్ స్కోర్‌కు అదనపు ప్రయోజనాలు

730 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లు అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగినవారు అని అర్థం… వీరిని అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఏ బ్యాంకులు వదులుకోవు. వారిని తమ కస్టమర్లుగా చేసుకునేందుకు బ్యాంకులు పోటీపడతాయి. వీరికి తక్కువ వడ్డీ రేట్లు, ప్రత్యేక ఆఫర్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు సులభంగా లభిస్తాయి.

55
ఇప్పుడేం చేయాలి..?
Image Credit : Getty

ఇప్పుడేం చేయాలి..?

లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న వాళ్లు, తమ సిబిల్ స్కోర్‌ను మంచిగా మెయిన్‌టెయిన్ చేయడం చాలా అవసరం. ఈఎంఐలను సరైన టైమ్‌కి కట్టడం, అనవసరమైన లోన్ అప్లికేషన్లు పెట్టకపోవడం, క్రెడిట్ కార్డ్ వాడకాన్ని అదుపులో ఉంచుకోవడం వంటివి మీ భవిష్యత్ లోన్ అవకాశాలను కాపాడతాయి. ఈ కొత్త రూల్స్ ఇంకా అమల్లోకి రాకపోయినా, ఇప్పటి నుంచే మంచి క్రెడిట్ అలవాట్లను అలవర్చుకోవడం తెలివైన పని.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Railway: రైలులో బైక్ పార్శిల్ చేయడానికి ఎంత ఖ‌ర్చ‌వుతుంది.? ప్రాసెస్ ఏంటో తెలుసా.?
Recommended image2
Gold Rate Hike: మళ్లీ యూటర్న్ తీసుకున్న బంగారం..సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పడుతున్న భారం
Recommended image3
SGB: ఆరోజు రూ. 1 లక్ష పెట్టుబ‌డి పెడితే.. ఈరోజు రూ. 5 ల‌క్ష‌లు అయ్యేవి..
Related Stories
Recommended image1
RBI : సైబర్ దొంగతనాలకు 'కిల్ స్విచ్' తో చెక్.. అంటే ఏమిటో తెలుసా..?
Recommended image2
RBI Rules : ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటే రూ.10,000 ఫైన్..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved