Cooler: క్లౌడ్ టెక్నాలజీతో పనిచేసే కూలర్.. అసలేంటీ టెక్నాలజీ, దీంతో జరిగేదేంటీ.?
Cooler: ఎండాకాలంలో చల్లని గాలి కోసం ఫ్యాన్‌లు, కూలర్‌లు వాడటం సాధారణమే. అయితే సింగర్ క్లౌడ్ఎక్స్ పేరుతో ఒక కొత్త రకం కూలర్ అందుబాటులో ఉంది. క్లౌడ్ టెక్నాలజీతో పనిచేసే ఈ కూలర్‌లో ఎన్నో విశేషాలు ఉన్నాయి.

క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏమిటి?
SINGER CloudX Fanలో అడ్వాన్స్‌డ్ క్లౌడ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది ట్యాంక్‌లోని నీటిని నానో స్థాయి సూక్ష్మ కణాలుగా మార్చి గాలిలో కలుపుతుంది. దీంతో సహజమైన చల్లని గాలి అనుభూతి లభిస్తుంది. సాధారణ ఫ్యాన్‌తో పోలిస్తే మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించడంలో ఇది సహాయపడుతుంది. ధర విషయానికొస్తే ఈ కూలర్ అసలు ధర రూ. 15,490 కాగా అమెజాన్‌లో ఏకంగా 52 శాతం డిస్కౌంట్‌తో రూ. 7499కి లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఇక ఈఎమ్ఐ ఆప్షన్ ద్వారా ఈ ఫోన్‌ను నెలకు రూ. 2500 చెల్లించి, 3 నెలల్లో కొనుగోలు చేయొచ్చు.
5 లీటర్ల వాటర్ ట్యాంక్ ప్రత్యేకత
ఈ ఫ్యాన్‌లో 5 లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంక్ ఉంటుంది. ఒకసారి నీరు నింపితే సుమారు 8 గంటల వరకు నాన్ స్టాప్ క్లౌడ్ ఇన్ఫ్యూజ్డ్ గాలిని అందిస్తుంది. అవసరమైతే నీటిలో పర్ఫ్యూమ్స్ లేదా దోమలను దూరం చేసే లిక్విడ్లను కూడా కలపవచ్చు.
తక్కువ శబ్దంతో పనిచేసే ఫ్యాన్
CloudX Fan తక్కువ శబ్దంతో పనిచేసేలా రూపొందించారు. దీంతో నిద్రపోతున్నప్పుడు, కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు లేదా ప్రశాంతమైన వాతావరణం అవసరమైన సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రత్యేకంగా "క్వైట్ మోడ్" ఆప్షన్ ఉండటం వల్ల సౌండ్ ఎక్కువగా వినిపించదు.
రిమోట్ కంట్రోల్, మూడు స్పీడ్ మోడ్‌లు
ఈ ఫ్యాన్‌తో "పాయింట్ ఎనీవేర్" రిమోట్ కంట్రోల్ అందిస్తారు. గదిలో ఎక్కడి నుంచైనా ఫ్యాన్‌ను నియంత్రించవచ్చు. అలాగే లో, మీడియం, హై అనే మూడు స్పీడ్ మోడ్‌లు ఉంటాయి. అవసరాన్ని బట్టి గాలి వేగాన్ని సులభంగా మార్చుకోవచ్చు.
యాంటీ మైక్రోబియల్ ఫిల్టర్, పోర్టబుల్ డిజైన్
ఫ్యాన్‌లో సిల్వర్ కోటెడ్ మెష్ ఫిల్టర్ ఉంటుంది. ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. గాలిలో ఉండే దుమ్ము, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు వంటి పెద్ద కణాలను ఫిల్టర్ చేస్తుంది. ఈ ఫిల్టర్‌ను తీసి శుభ్రం చేయడం కూడా చాలా సులభం. అదనంగా కాస్టర్స్ (చక్రాలు) ఉండటంతో ఇంట్లో ఒక గది నుంచి మరో గదికి సులభంగా తరలించవచ్చు. కేవలం 11 కిలోల బరువుతో ఉండే ఈ ఫ్యాన్‌కు SINGER సంస్థ 2 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తోంది.

