MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్‌ పడిపోతుందా?

విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్‌ పడిపోతుందా?

Divorce Affect Credit Score: విడాకులు తీసుకోవడం అనేది ఎవరి జీవితంలోనైనా పెద్ద మార్పే. ఇది ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది. చాలా మంది విడాకుల తరువాత వారి క్రెడిట్ స్కోర్ తగ్గుతుందని, దీని వల్ల బ్యాంకుల నుంచి వచ్చే ప్రయోజనాలు సరిగ్గా అందవని అనుకుంటారు. ఇది ఎంత వరకు నిజమో? ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 14 2025, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా విడాకులు అభిప్రాయాలు కలవక తీసుకుంటారు. ఆలోచనలు, ఐడియాలజీ ఒకేలా ఉండకపోవడం, సర్దుకుపోకపోవడం లాంటి చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటారు. వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకునే వారు వివాహ బంధంలో ఎక్కువ కాలం కొనసాగలేరు. అందుకే ఇటీవల ఎక్కువ మంది సెలబ్రిటీలు, ధనవంతులు భారీ స్థాయిలో పెళ్లిళ్లు చేసుకొని, సింపుల్ గా విడాకులు తీసుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు, పెద్దల పోషణ వంటి ముఖ్యమైన విషయాలను కూడా పంచుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

క్రెడిట్ స్కోర్ పై ప్రభావం డైరెక్ట్ గా ఉండదు..

అయితే చాలా మంది అనుకునే విషయం ఏంటంటే విడాకులు తీసుకున్న తర్వాత క్రెడిట్ స్కోర్ తగ్గుతుందని, దీని వల్ల బ్యాంకుల నుంచి ప్రయోజనాలు సరిగ్గా అందవని అనుకుంటారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత క్రెడిట్ స్కోర్ నేరుగా తగ్గదు.

కానీ విడాకుల తరువాత వచ్చే ఆర్థిక మార్పుల వల్ల క్రెడిట్ స్కోర్ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు భార్యభర్తల్లో ఒకరికి చెందిన క్రెడిట్ కార్డు లేదా లోన్ అకౌంట్ ఇద్దరి పేరిట ఉందనుకోండి. విడాకుల తరువాత దానికి సంబంధించిన చెల్లింపులు సమయానికి జరగకపోతే ఇద్దరి క్రెడిట్ స్కోర్‌ మీద ప్రభావం పడుతుంది.
 

35

సామాన్యంగా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపే అంశాలు ఇవే

జాయింట్ అకౌంట్ లోక్ చెల్లింపుల్లో ఆలస్యం అవుతుంది. ఆస్తుల పంపకాల్లో జరిగిన చట్టపరమైన వివాదాల కారణంగా క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవుతుంది. కోర్టు ద్వారా జరిగిన ఆర్థిక బాధ్యతల పంచకంలో ఏదైనా సమయానికి చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. విడాకుల తర్వాత వచ్చే ఆర్థిక ఒత్తిడిలో కొత్త రుణాలు తీసుకోవడం వల్ల, అవి సకాలంలో చెల్లించకపోవడం వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. 
 

45

విడాకుల తరువాత క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఉండేందుకు కొన్ని సూచనలు

జాయింట్ అకౌంట్స్ అన్నింటినీ సమీక్షించండి. మీ పేరు మీద ఉన్న లోన్స్ ఈఎంఐలు సమయానికి చేయండి. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఆర్థిక బాధ్యతలు సక్రమంగా నిర్వహించండి. క్రెడిట్ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. 

55

నిపుణుల సలహాలు తీసుకోండి

క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవడం ఒక వ్యక్తి భవిష్యత్ ఆర్థిక అవకాశాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి విడాకుల సమయంలో ఫైనాన్షియల్ అంశాలపై స్పష్టత అవసరం. ముందస్తు ప్రణాళిక, భవిష్యత్తు లక్ష్యం కూడా ఇప్పుడే నిర్ణయించుకోవాలి. విడాకులు తప్పదని మీరు డిసైడ్ అయితే తర్వాత మీ క్రెడిట్ స్కోర్ పడిపోకుండా ఫైనాన్షియల్ అడ్వైజర్ సహకారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Related Stories
Recommended image1
మే 31 లోపు మీ అకౌంట్‌లో రూ.436 లేకపోతే ఈ పాలసీ క్యాన్సిల్ అవుతుంది
Recommended image2
ఈ బ్యాంకులో రుణం తీసుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved