MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold: బంగారం ఎలా కొంటే లాభం? గోల్డ్ ETF నుంచి జ్యువెలరీ స్కీమ్స్ వరకు.. అసలు లెక్క ఇదే!

Gold: బంగారం ఎలా కొంటే లాభం? గోల్డ్ ETF నుంచి జ్యువెలరీ స్కీమ్స్ వరకు.. అసలు లెక్క ఇదే!

Gold: బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం కొనాలని అనుకుంటున్నారా? ఏ రూపంలో బంగారం కొంటే… ఎక్కువ లాభం కలుగుతుందో తెలుసా? నగల రూపంలో కొనడం వల్ల నష్టపోతామా? నిపుణుల సలహా ఏంటి?

4 Min read
Author : ramya Sridhar
Published : Nov 18 2026, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బంగారం కొంటున్నారా?
Image Credit : Asianet News

బంగారం కొంటున్నారా?

భారతీయ కుటుంబాల్లో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది మన కష్టార్జితానికి ఒక భరోసా. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్ల ఉంటే, ఆమె పెళ్లి సమయానికి కొంత బంగారం కూడబెట్టాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ, ఎలా కొనాలి, ఎలా కొంటే లాభం అనే విషయం చాలా మందికి తెలీదు. చాలా మంది "బంగారం ధర ఎలాగూ పెరుగుతోంది కదా.. ఏ రూపంలో కొన్నా లాభమే" అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.

మనం బంగారం కొనే విధానాన్ని బట్టి GST, తరుగు (VA), మజూరీ (Making Charges), పన్నుల రూపంలో వేల రూపాయలు ఆదా చేయవచ్చు.. లేదా నష్టపోవచ్చు. ఉదాహరణకు, ఐదేళ్ల తర్వాత మీ కూతురి పెళ్లి కోసం 80 గ్రాముల (8 తులాలు) 22 క్యారెట్ల నగలు కొనాలనుకుంటే, ఏ పద్ధతిలో డబ్బు దాచుకోవడం ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1. బంగారు నాణేలు, బిస్కెట్లు
Image Credit : stockPhoto

1. బంగారు నాణేలు, బిస్కెట్లు

చాలామంది చేసే పని ఇది. డబ్బున్నప్పుడల్లా గోల్డ్ కాయిన్స్ కొని ఇంట్లో లేదా బ్యాంక్ లాకర్‌లో దాచుకుంటారు.

ప్లస్ పాయింట్స్: బంగారం నేరుగా మన కళ్లముందే ఉంటుంది. ఎలాంటి టెక్నికల్ ఖాతాలు అవసరం లేదు.

మైనస్ పాయింట్స్: నాణేలు కొనేటప్పుడే 3% GST కట్టాలి. పైగా వాటి తయారీ ఛార్జీలు అదనం. ఐదేళ్ల తర్వాత ఆ నాణేలను ఇచ్చి నగలు చేయించుకునేటప్పుడు, షాపు వాళ్లు పాత బంగారం కింద తక్కువ రేటుకు తీసుకుంటారు. కొత్త నగలపై మళ్లీ తరుగు, మజూరీ, GST కట్టాలి. అంటే రెండుసార్లు నష్టపోతామన్నమాట.

2. డిజిటల్ గోల్డ్ 

యాప్స్ ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్స్‌లో రూపాయి నుంచి కూడా డిజిటల్ గోల్డ్ కొనే సదుపాయం ఉంది.

ప్లస్ పాయింట్స్: చేతిలో ఉన్న చిల్లర డబ్బుతో కూడా ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోవచ్చు.

మైనస్ పాయింట్స్: ఇందులో కొనే రేటుకు, అమ్మే రేటుకు మధ్య చాలా తేడా (Spread) ఉంటుంది. 3% GST కూడా పడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, వీటికి ప్రభుత్వ నియంత్రణ సంస్థ SEBI రక్షణ లేదు. 2025 నవంబర్‌లో SEBI కూడా దీనిపై ప్రజలను అప్రమత్తం చేసింది. కాబట్టి పెద్ద మొత్తంలో, దీర్ఘకాలం దాచుకోవడానికి ఇది అంత సేఫ్ కాదు.

33
3. గోల్డ్ ETF
Image Credit : Getty

3. గోల్డ్ ETF

షేర్ మార్కెట్‌లో షేర్లు కొన్నట్లే బంగారాన్ని యూనిట్ల రూపంలో కొనుక్కోవడమే గోల్డ్ ETF. దీనికి డీమ్యాట్ (Demat) ఖాతా ఉండాలి.

ప్లస్ పాయింట్స్: దొంగల భయం లేదు, లాకర్ ఛార్జీలు లేవు. నాణేల మాదిరిగా 3% GST భారం ఉండదు. కేవలం ₹20 - ₹50 నుంచి కూడా ఎప్పుడు డబ్బుంటే అప్పుడు కొనుక్కోవచ్చు. బంగారం రేటు పెరిగినప్పుడల్లా మన పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. (ఉదాహరణకు Zerodha Gold ETF, Nippon Gold BeES వంటివి చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి).

మైనస్ పాయింట్స్: ఇది కేవలం స్క్రీన్ మీద కనిపించే పెట్టుబడి మాత్రమే. నేరుగా నగలుగా మార్చుకోలేం. అవసరమైనప్పుడు యూనిట్లను అమ్మి, ఆ డబ్బుతో నగలు కొనుక్కోవాలి.

4. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్

డీమ్యాట్ ఖాతా లేని వారికి, ప్రతి నెలా జీతం రాగానే ఆటోమేటిక్‌గా కొంత డబ్బు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్.

ప్లస్ పాయింట్స్: నెలకు ₹500 లేదా ₹1,000 చొప్పున SIP (సిప్) పెట్టుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు.

మైనస్ పాయింట్స్: గోల్డ్ ETF తో పోలిస్తే వీటిలో ఫండ్ నిర్వహణ ఛార్జీలు (Expense Ratio) కొంచెం ఎక్కువగా ఉంటాయి.

5. సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 

ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఈ బాండ్లపై బంగారం ధర పెరుగుదలతో పాటు ఏటా 2.5% అదనపు వడ్డీ కూడా వచ్చేది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం కొత్త బాండ్లను విడుదల చేయడం లేదు. పాత బాండ్లు స్టాక్ మార్కెట్‌లో దొరికినా వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఇది అందుబాటులో లేని ఆప్షన్.

6. జ్యువెలరీ షాపుల నెలవారీ స్కీమ్స్

ప్రముఖ నగల దుకాణాల్లో 11 నెలల పాటు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం కడితే, 12వ నెలలో నగలు కొనుక్కునే స్కీమ్స్ ఉంటాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి: డబ్బు జమ అయ్యే పద్ధతి (Value-based), బంగారం బరువు జమ అయ్యే పద్ధతి (Weight-based).

ప్లస్ పాయింట్స్: ప్రతి నెలా ఆ రోజు ఉన్న రేటు ప్రకారం మన ఖాతాలో బంగారం గ్రాములు జమ అవుతాయి . 11 నెలల తర్వాత నగలు కొనేటప్పుడు తరుగు (VA) పై భారీ తగ్గింపు లభిస్తుంది.

మైనస్ పాయింట్స్: మధ్యలో డబ్బులు అవసరమైతే నగదు వెనక్కి ఇవ్వరు, కచ్చితంగా ఆ షాపులోనే నగలు కొనాలి. నగలు తీసుకునేటప్పుడు 3% GST కట్టాల్సిందే.

అసలైన మాస్టర్ ప్లాన్: Gold ETF + జ్యువెలరీ స్కీమ్.. 

ఐదేళ్ల తర్వాత మీ కూతురి పెళ్లికి 80 గ్రాముల నగలు కొనాలంటే, ఈ రెండింటినీ కలిపి వాడటం అన్నింటికంటే తెలివైన పని! ఎలాగంటే:

మొదటి 4 ఏళ్లు (49 నెలలు): ప్రతి నెలా మీకు తోచినంత (ఉదాహరణకు ₹5,000 లేదా అంతకంటే ఎక్కువ) Gold ETF లో పెట్టుబడి పెట్టండి. దీనివల్ల నాలుగేళ్లలో బంగారం ధర ఎంత పెరిగినా, మీ డబ్బు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. GST, తరుగు వంటి నష్టాలు ఉండవు.

చివరి 1 ఏడాది (11 నెలలు): పెళ్లికి సరిగ్గా ఏడాది ముందు, మీ దగ్గర ఉన్న Gold ETF యూనిట్లను కొద్దికొద్దిగా అమ్ముతూ.. ఆ డబ్బును ఒక మంచి జ్యువెలరీ షాపులో స్కీమ్‌లో ప్రతి నెలా కట్టండి.

ఫలితం: 11 నెలలు పూర్తయ్యాక, ఆ షాపులో మీకు తరుగు (VA) లేకుండా లేదా భారీ డిస్కౌంట్‌తో నగలు వస్తాయి! అటు 4 ఏళ్ల బంగారం ధర పెరుగుదల లాభం, ఇటు షాపులో తరుగు ఆదా.. రెండూ మీకే దక్కుతాయి!

నగలు కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్స్:

గ్రాము రేటు చూసి మోసపోకండి: ఒక షాపులో బంగారం రేటు తక్కువగా ఉందని సంబరపడకండి. వాళ్లు వేసే తరుగు (VA), మజూరీ (Making Charges) ఎంత ఉందో చూడండి.

ముగ్గురి దగ్గర బిల్లు అడగండి: మీరు కొనాలనుకున్న డిజైన్, బరువు చెప్పి కనీసం 3 వేర్వేరు షాపుల్లో "ఫైనల్ బిల్లు (GST తో కలిపి) ఎంత అవుతుంది?" అని అడిగి పోల్చుకోండి.

చివరి మాట: బంగారం కొనేటప్పుడు "ఈరోజు రేటు ఎంత?" అని కాదు.. "అన్నీ పోను చివరికి నా చేతికి వచ్చే నగల కోసం నేను ఎంత కడుతున్నాను?" అనేదే అసలైన లెక్క!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బంగారం
 
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
325
SLSL
(16.4 ov) 98 & 57/3
Day 2 - Session 3
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
1980 త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే.. వెండి ఇంత‌లా ప‌త‌న‌మ‌వ్వ‌డానికి కార‌ణాలేంటో తెలుసా.?
Recommended image2
Gold: మనం నగలు కోసం.. మరి బ్యాంకులు బంగారం ఎందుకు కొంటాయో తెలుసా?
Recommended image3
Gold Silver Price Crash: తులం బంగారం రూ.లక్ష, పాతాళానికి పతనమైన పసిడి, కూప్పకులుతున్న వెండి
Related Stories
Recommended image1
Smallest River: భారతదేశంలో అతి చిన్న నది ఇది, 60 ఏళ్లు ఎండిపోయి.. మళ్లీ ప్రాణం పోసుకున్న నది..!
Recommended image2
Beautiful Village: మన దేశంలో అందమైన గ్రామం.. నది, సరస్సు, సముద్రం కలిసే ఏకైక గ్రామం ఇది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved