- Home
- Business
- Car Tips: కారు వేగంగా ఉన్నప్పుడు బ్రేక్ పడకపోతే ఏం చేయాలో తెలుసా.? అస్సలు టెన్షన్ పడకండి
Car Tips: కారు వేగంగా ఉన్నప్పుడు బ్రేక్ పడకపోతే ఏం చేయాలో తెలుసా.? అస్సలు టెన్షన్ పడకండి
Car Tips: రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ ఉండగా బ్రేక్‌లు ఒక్కసారిగా పనిచేయకపోతే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కానీ అలాంటి సమయంలో భయపడకుండా, సరైన నిర్ణయాలు తీసుకుంటే పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.

ముందే వచ్చే సంకేతాలు గుర్తించండి
బ్రేక్ ఫెయిల్ ఒక్కసారిగా జరగదు. దానికి ముందే కొన్ని హెచ్చరికలు ఉంటాయి. వీటిని గుర్తిస్తే ప్రమాదం నుంచి ముందుగానే బయటపడొచ్చు. సాధారణంగా బ్రేక్ ఫెయిల్ అయ్యే ముందు బ్రేక్ పెడల్ లూజ్‌గా అనిపించడం, వాహనం ఆగడానికి ఎక్కువ సమయం పట్టడం, బ్రేక్ వేస్తే విచిత్రమైన శబ్దాలు రావడం, డ్రైవింగ్‌లో అసహజంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మెకానిక్ దగ్గర చెక్ చేయించాలి.
మొదట ప్రశాంతంగా ఉండండి
డ్రైవింగ్ సమయంలో బ్రేక్ ఫెయిల్ అయితే చాలా మంది భయపడిపోతారు. కానీ అప్పుడు శాంతంగా ఉండటం చాలా ముఖ్యం. స్టీరింగ్‌పై గట్టిగా కంట్రోల్ పెట్టాలి. వాహనాన్ని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. బ్రేక్ పెడల్‌ను మళ్లీ మళ్లీ నొక్కితే కొంత ప్రెజర్ వచ్చి కొద్దిగా పని చేసే అవకాశం ఉంటుంది.
గేర్‌ల సహాయం తీసుకోండి
వాహనం స్పీడ్ తగ్గించడానికి గేర్‌లను సరిగ్గా ఉపయోగించడం చాలా ఉపయోగపడుతుంది. మాన్యువల్ కారు అయితే లోయర్ గేర్‌కి మార్చేందుకు ప్రయత్నించాలి. ఆటోమేటిక్ కార్ అయితే “లో గేర్ మోడ్” వాడాలి. ఇలా చేస్తే ఇంజిన్ సహజంగా స్పీడ్ తగ్గిస్తుంది.
హ్యాండ్ బ్రేక్ జాగ్రత్తగా ఉపయోగించాలి
హ్యాండ్ బ్రేక్‌ను కూడా ఉపయోగించవచ్చు కానీ ఒక్కసారిగా బలంగా లాగకూడదు. దీంతో కారు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నెమ్మదిగా, కంట్రోల్‌తో వాడాలి. సగం సగం వేస్తూ కారు వేగాన్ని నెమ్మదిగా స్లో చేయాలి.
రోడ్డును వాడుకోవచ్చు
పరిస్థితిని బట్టి రోడ్డును కూడా ఉపయోగించవచ్చు. తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశం వైపు వాహనాన్ని మళ్లించండి. కారు వేగం తగ్గుతుంది. గడ్డి లేదా సాఫ్ట్ సర్ఫేస్ ఉన్న ప్రదేశం వైపు తీసుకెళ్లండి, టనే హాజర్డ్ లైట్స్ ఆన్ చేయాలి. అవసరమైతే హారన్ కొట్టి ఇతరులను అలర్ట్ చేయాలి.

