MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • Gold Prices: యుద్ధ భయాలతో మళ్లీ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు..బిగ్ షాక్ లో పసిడి ప్రియులు

Gold Prices: యుద్ధ భయాలతో మళ్లీ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు..బిగ్ షాక్ లో పసిడి ప్రియులు

Gold Prices: గోల్డ్ మార్కెట్ బిగ్ షాకిచ్చింది. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు...ఇవాళ మళ్లీ రాకెట్ లా దూసుకొచ్చింది. వెండి కూడా పసిడి బాటలోనే పెరిగిపోయింది. హైదరాబాద్‍లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే.. 

1 Min read
Author : Nandini Arava
Published : May 29 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఊగిసలాడుతున్న బంగారం, వెండి
Image Credit : Getty

ఊగిసలాడుతున్న బంగారం, వెండి

మళ్లీ కొన్ని నెలల తర్వాత బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతూ పసిడి ప్రియులు, కొనుగోలుదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలెప్పుడు కొనాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో మార్కెట్లలో కొంత గందరగోళం నెలకొంది. ఒకరోజు తగ్గుతూ ఊరట ఇచ్చి మరోసటి రోజే షాకిస్తున్నాయి. వ్యాపారులు అమ్మకాలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. అందువల్ల జ్యూవెలరీ షాపులు వెలవెలబోతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
షాక్‍లో కొనుగోలుదారులు
Image Credit : Getty

షాక్‍లో కొనుగోలుదారులు

మూడు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ ఒక్కసారిగా ఎగబాకడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకుంటున్నవారికి ఇది పెద్ద సమస్యగా మారింది.

ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,580 పెరిగి రూ.1,57,640 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల ధరపై రూ.1,450 పెరిగి ప్రస్తుతం రూ.1,44,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 

35
బంగారం బాటలోనే వెండి
Image Credit : iSTOCK

బంగారం బాటలోనే వెండి

ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధరపై రూ.5 వేల ఎగబాకి రూ.2 లక్షల 80 వేల మార్క్‌కు చేరుకుంది. దీంతో గోల్డ్ మాత్రమే కాదు, సిల్వర్ కొనుగోలు కూడా మరింత భారంగా మారింది.

45
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన రేట్లు
Image Credit : Getty

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన రేట్లు

హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన బులియన్ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వ్యాపారులు చెబుతున్న వివరాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రేట్లు ఒక్కసారిగా పెరిగాయని అంటున్నారు. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యుద్ధ భయాలు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వైపు పరుగులు తీస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగి, దాని ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై కూడా పడుతోంది.

55
మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే..
Image Credit : Getty/freepik AI

మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే..

ఇక రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే.. బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు మార్కెట్‌ను జాగ్రత్తగా గమనించాలని సూచిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
Gold Prices : అమెరికా దెబ్బకు పడిపోయిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్లు చూస్తే ఎగిరి గంతేస్తారు !
Recommended image2
Gold Price Fall: పసిడి ప్రియులకు ఈరోజు బిగ్ సర్ ప్రైజ్..ట్రంప్ నిర్ణయంతో బంగారం, వెండి కుదేలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved