MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • న‌మ్ముతున్నార‌ని మోసం చేస్తే మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు.. జీవితాన్ని మార్చే గాడిద‌-ఉప్పు క‌థ‌

న‌మ్ముతున్నార‌ని మోసం చేస్తే మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు.. జీవితాన్ని మార్చే గాడిద‌-ఉప్పు క‌థ‌

Motivational story: మ‌న లాభం కోసం ఇత‌రుల‌ను మోసం చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే మ‌న‌ల్ని న‌మ్ముతున్న వారిని ప‌దే ప‌దే మోసం చేస్తే జీవితంలో భారీ మూల్యం చెల్లించ‌క‌త‌ప్ప‌దు. ఈ స‌త్యాన్ని చాటిచెప్పే ఒక క‌థ గురించి ఈరోజు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 23 2026, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉప్పు వ్యాపారి రాజు జీవితం
Image Credit : Gemini AI

ఉప్పు వ్యాపారి రాజు జీవితం

అనగనగా ఒక చిన్న గ్రామంలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఉప్పు వ్యాపారం చేసేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పైనే ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ఉప్పు బస్తాలను వేసి తీసుకెళ్లేవాడు. రోజూ కష్టపడి పని చేస్తూ ఇద్దరూ జీవనం సాగించేవారు.

25
గాడిదపై పెరిగిన నమ్మకం
Image Credit : Gemini AI

గాడిదపై పెరిగిన నమ్మకం

కొన్ని రోజుల తర్వాత రాజుకు గాడిదపై పూర్తి నమ్మకం వచ్చింది. ఒక రోజు నుంచి గాడిదనే ఒంటరిగా ఉప్పు బస్తాలతో పంపించడం ప్రారంభించాడు. గాడిద కూడా పని చేసి తిరిగి వచ్చేది. రాజు దానికి తిండి పెట్టి బాగా చూసుకునేవాడు. ఇలా రెండు మూడు రోజులు సాఫీగా సాగింది.

Related Articles

Related image1
Post office: రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ నెల రూ. 20 వేలు
35
గాడిద చేసిన కన్నింగ్ ప్లాన్
Image Credit : Gemini AI

గాడిద చేసిన కన్నింగ్ ప్లాన్

ఒక రోజు గాడిద ఒక ప్లాన్ వేసింది. ఉప్పు బస్తా మోసుకుని నది దాటే సమయంలో నీటిలో మునిగింది. నీటిలో మునిగిన వెంటనే ఉప్పు కరిగిపోయింది. బస్తా ఖాళీగా మారింది. తిరిగి యజమాని దగ్గరకు వచ్చి, “వాగులో నీరు ఎక్కువగా ఉండడంతో ఉప్పు కరిగిపోయింది” అని చెప్పింది. రాజు నమ్మి పట్టించుకోలేదు.

45
మోసం కొనసాగించిన గాడిద
Image Credit : Gemini AI

మోసం కొనసాగించిన గాడిద

ఇలా ఒక్కసారి కాదు, మరోసారి కూడా అదే పద్ధతి కొనసాగించింది. “వర్షం పడింది కాబట్టి ఉప్పు కరిగిపోయింది” అని మళ్లీ అబద్ధం చెప్పింది. పని చేయకుండా తప్పించుకోవడం గాడిదకు అలవాటైపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ గాడిద మోసం పెరుగుతూనే ఉంది. కానీ రాజుకు మాత్రం అనుమానం మొదలైంది.

55
యజమాని ప్లాన్… గాడిదకు బుద్ధి
Image Credit : Gemini AI

యజమాని ప్లాన్… గాడిదకు బుద్ధి

ఒక రోజు రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి ఉప్పుకు బదులుగా బస్తాలో పత్తి నింపి గాడిదపై వేసి పంపించాడు. గాడిద మళ్లీ తన పాత ప్లాన్ ప్రకారం నదిలోకి దిగింది. నీటిలో మునిగింది. కానీ ఈసారి పత్తి తడిసిన వెంటనే బరువు పెరిగింది. గాడిదకు నడవడం కష్టమైంది. అప్పుడే తన తప్పు అర్థమైంది. కష్టంగా యజమాని దగ్గరకు వచ్చి చేసిన తప్పుకు క్షమించమని అడిగింది.

సందేశం: మోసం ఎప్పటికీ దాగదు. ఒక రోజు నిజం బయటపడుతుంది. నిజాయితీగా పని చేయడం మాత్రమే మనల్ని కాపాడుతుందనే గొప్ప సందేశాన్ని ఈ క‌థ అందిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kedarnath Trip : కేవలం రూ.5000 బడ్జెట్‌లో కేదార్‌నాథ్ యాత్ర...
Recommended image2
AC: ఏసీ పేలిపోకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరి! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు..
Recommended image3
Snake : ఈ 5 సంకేతాలు కనిపించాయో.. మీ ఇంట్లో పాములు ఉన్నట్లే.. తస్మాత్ జాగ్రత్త..!
Related Stories
Recommended image1
Post office: రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ నెల రూ. 20 వేలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved