- Home
- Business
- Business Ideas : పెద్ద చదువులు, భారీ పెట్టుబడులతో పనిలేదు.. ఐటీ ఉద్యోగుల స్థాయిలో సంపాదించే సింపుల్ బిజినెస్‌లు ఇవే
Business Ideas : పెద్ద చదువులు, భారీ పెట్టుబడులతో పనిలేదు.. ఐటీ ఉద్యోగుల స్థాయిలో సంపాదించే సింపుల్ బిజినెస్‌లు ఇవే
బిజినెస్ అంటే కొత్త టెక్నాలజీ లేదా స్టార్టప్ అనుకుంటారు చాలామంది. కానీ ప్రజలకు రోజూ అవసరమయ్యే కొన్ని సింపుల్ సర్వీసులతో కూడిన 'బోరింగ్ బిజినెస్'లే తక్కువ రిస్క్‌తో స్థిరమైన ఆదాయాన్ని, ఎక్కువ లాభాలను ఇస్తాయి. అలాంటివాటి గురింంచి ఇక్కడ తెలుసుకుందాం..

చిన్నచిన్న వ్యాపారాలతో లక్షలు సంపాదించొచ్చు..
Business Ideas : ''ఎప్పుడు వచ్చామన్నది కాదు... బుల్లెట్ దిగిందా లేదా..!'' ఇది ఓ తెలుగు సినిమాలో డైలాగ్. ''ఏం బిజినెస్ చేస్తున్నామన్నది కాదు... మంచి లాభాలు వస్తున్నాయా లేవా'' అన్నది నేటి బిజినెస్ కు సరిపోయే డైలాగ్. మనం ఏ పని చేసినా 100 శాతం ఎఫర్ట్ పెడితే పక్కా సక్సెస్ అవుతాం... అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా. బిజినెస్ చిన్నది, పెద్దది అని కాదు... శ్రద్దగా చేసుకుంటే తగిన లాభాలు పొందవచ్చు. కార్లు కడిగేందుకు లక్షలు తీసుకునే పాల్ డాల్టన్ లాంటివారే నేటి యువతకు ఆదర్శం కావాలి... చదువు లేకపోయినా పనిలో నైపుణ్యం ఉంటే లక్షలు సంపాదించవచ్చని ఇతడు నిరూపించాడు.
మీరు బోరింగ్ అనుకునే బిజినెస్ లదే ఇప్పుడు హవా..
అయితే బిజినెస్ అనగానే చాలామందికి కొత్త టెక్నాలజీ, స్టార్టప్ ఐడియాలు, క్రియేటివిటీతో కూడిన పనులే గుర్తొస్తాయి. కానీ నిజానికి ఎక్కువ లాభం, స్థిరమైన ఆదాయం ఇచ్చేవి 'బోరింగ్ బిజినెస్' గా పిలిచే సాధారణ వ్యాపారాలే. ప్రజల రోజువారీ జీవితంలో తప్పనిసరి అయిన సేవలు అందించే ఈ వ్యాపారాలు, తక్కువ రిస్క్‌తో నిలకడగా డబ్బు సంపాదించి పెడతాయి.
అసలు ఏమిటీ బోరింగ్ బిజినెస్..?
అసలు ‘బోరింగ్ బిజినెస్’ అంటే ఏంటో ముందు చూద్దాం. రోజూ ఒకేలాంటి పనులు జరిగే, పెద్దగా కొత్తదనం లేదా ఆలోచన అవసరం లేని వ్యాపారాలే ఈ కోవలోకి వస్తాయి. కానీ ఇవి సమాజానికి ఎప్పుడూ అవసరమైన సేవలు కాబట్టి, కస్టమర్లు కచ్చితంగా ఉంటారు. అందుకే చాలామంది దీన్ని 'తక్కువ రిస్క్, ఎక్కువ లాభం' కలిగిన బిజినెస్ లు అంటారు.
సింపుల్ బిజినెస్ ఐడియాస్..
ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్, డిజిటల్ కంటెంట్, స్టార్టప్ లాంటి క్లిష్టమైన రంగాల్లోకి దిగుతున్నారు. కానీ ఈ రంగాల్లో తీవ్రమైన పోటీ, నిరంతరం వచ్చే అప్‌డేట్లు, పాలసీ మార్పులు లాంటి సవాళ్లు చాలా ఎక్కువ. నిజానికి ఈ రంగాల్లోకి అడుగుపెట్టే 80% మందికి స్థిరమైన విజయం దొరకదనేది వాస్తవం.
అయితే కొన్ని సింపుల్ బిజినెస్ ఐడియాలు మంచి ఆదాయాన్ని అందిస్తాయి. ఉదాహరణకు నగరాల్లో లాండ్రీ సర్వీస్ ఇప్పుడు చాలా అవసరం. చిన్న పెట్టుబడితోనే దీన్ని మొదలుపెట్టొచ్చు. అలాగే రోడ్డు పక్కన ఉండే టీ కొట్లకు ఎప్పుడూ కస్టమర్లు ఉంటారు, రోజంతా ఆదాయం వస్తుంది.
లో రిస్క్, హై ప్రాఫిట్ బిజినెస్ లే ఉత్తమం..
అంతేకాదు వాహనాల సంఖ్య పెరగడంతో కార్ వాషింగ్, పార్కింగ్ సేవలు మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. నగరాల్లో ఇళ్ల మార్పిడి ఎక్కువగా ఉండటంతో ప్యాకర్స్ & మూవర్స్, వేర్‌హౌస్ సేవలకు కూడా మంచి డిమాండ్ ఉంది. మంచి లొకేషన్‌లో స్థలం ఉంటే, ఏటీఎం మెషీన్లకు అద్దెకు ఇచ్చి నెలవారీ ఆదాయం పొందవచ్చు.
బిజినెస్ అనేది గొప్ప కోసం కాదు, స్థిరమైన ఆదాయం కోసం ఉండాలి. సింపుల్‌గా ఉన్నా సరే, నిరంతరం డబ్బు తెచ్చిపెట్టే ఈ 'బోరింగ్ బిజినెస్' మోడల్స్, తక్కువ ఒత్తిడితో ప్రశాంతమైన జీవితం కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.

