MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు

రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు

SCSS Scheme: వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం రావాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన సేవింగ్ స్కీమ్స్‌లో సీనియ‌ర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒకటి. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 17 2026, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
SCSS స్కీమ్ అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

SCSS స్కీమ్ అంటే ఏమిటి?

సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన చిన్న పొదుపు పథకం ఇది. ప్రభుత్వ హామీ ఉండటంతో ఇది అత్యంత సురక్షిత పెట్టుబడి ఎంపికగా భావిస్తారు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. రిటైర్ అయిన తర్వాత స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ప్రస్తుతం ఎంత వడ్డీ లభిస్తోంది?
Image Credit : Asianet News

ప్రస్తుతం ఎంత వడ్డీ లభిస్తోంది?

ఏప్రిల్-జూన్ 2026 త్రైమాసికానికి SCSSపై ప్రభుత్వం 8.2% వార్షిక వడ్డీ కొనసాగిస్తోంది. ఇటీవల జరిగిన సమీక్షలో చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ స్కీమ్ గడువు 5 సంవత్సరాలు ఉంటుంది. అవసరమైతే మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.

Related Articles

Related image1
AC Water: అసలు ఏసీలో నుంచి నీళ్లు ఎందుకొస్తాయి.. ఆ నీటిని తాగొచ్చా.?
Related image2
పాత పెయింట్ బ‌కెట్ల‌ను బాత్‌రూమ్‌కే ప‌రిమితం చేస్తున్నారా.? ఇలా చేస్తే మీ ఇంటికి కొత్త లుక్ ఖాయం
35
రూ.30 లక్షలు పెట్టుబడిపై ఎంత ఆదాయం వస్తుంది?
Image Credit : AI

రూ.30 లక్షలు పెట్టుబడిపై ఎంత ఆదాయం వస్తుంది?

ఒక సీనియర్ సిటిజన్ SCSSలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే 8.2% వడ్డీ ప్రకారం ప్రతి మూడు నెలలకు రూ.61,500 వడ్డీ వస్తుంది. పెట్టుబడి మొత్తం రూ.30 లక్షలు, వడ్డీ రేటు 8.2% అయితే.. ప్రతి మూడు నెలలకు వడ్డీ రూ.61,500 వ‌స్తుంది. సంవత్సరానికి మొత్తం వడ్డీ రూ.2,46,000 పొందొచ్చు. ఈ మొత్తాన్ని ఏడాదిలో నాలుగు సార్లు పొందవచ్చు. అకౌంట్‌ను పొడిగించకుండా కూడా 5 సంవత్సరాల పాటు ఈ ఆదాయం కొనసాగుతుంది.

45
SCSSలో ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు?
Image Credit : Gemini AI

SCSSలో ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు?

ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ అర్హులైతే విడివిడిగా లేదా జాయింట్ అకౌంట్ రూపంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అలా ఇద్దరూ తమ తమ అకౌంట్లలో రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే నిర్ణయించిన పరిమితిని మించి డబ్బు జమ చేస్తే అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

55
ట్యాక్స్ బెనిఫిట్స్, అకౌంట్ పొడిగింపు
Image Credit : Getty

ట్యాక్స్ బెనిఫిట్స్, అకౌంట్ పొడిగింపు

SCSS ద్వారా వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని 80TTB సెక్షన్ ప్రకారం సీనియర్ సిటిజన్లు రూ.50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ అకౌంట్‌ను 5 సంవత్సరాల తర్వాత మూసివేయవచ్చు. లేదంటే మెచ్యూరిటీ తర్వాత మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకోసం మెచ్యూరిటీ తేదీ నుంచి ఏడాది లోపు దరఖాస్తు చేయాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Recommended image2
90 శాతం మందికి ఇది తెలియ‌దు.. CNG కొట్టిచ్చేప్పుడు ప్ర‌యాణికుల‌ను ఎందుకు దిగ‌మంటారు.?
Recommended image3
Amazon Now: అమెజాన్ బంపర్ ఆఫర్.. సగం ధరకే సరుకులు, ఆఫర్ అవ్వకముందే ఇప్పుడే కొనేయండి
Related Stories
Recommended image1
AC Water: అసలు ఏసీలో నుంచి నీళ్లు ఎందుకొస్తాయి.. ఆ నీటిని తాగొచ్చా.?
Recommended image2
పాత పెయింట్ బ‌కెట్ల‌ను బాత్‌రూమ్‌కే ప‌రిమితం చేస్తున్నారా.? ఇలా చేస్తే మీ ఇంటికి కొత్త లుక్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved