రూ. 22 వేలకే స్కూటర్.. మహిళలకు ఇది నిజంగా బెస్ట్ డీల్
ప్రస్తుతం బైక్‌లతో సమానంగా స్కూటీలకు ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు, వయసు మళ్లిన వారు స్కూటీలనే ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఒక మంచి సెకండ్ హ్యాండ్ స్కూటీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు మీకోసం.

కొత్త స్కూటీ కొనాలంటే
ఒకప్పుడు స్కూటీలు తక్కువ ధరకు లభించేవి. కానీ ప్రస్తుతం వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కొత్త స్కూటీ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. లక్ష చెల్లించాల్సిందే. అయితే తక్కువ దూరం ప్రయాణించే మహిళలు, చిరు వ్యాపారులు తక్కువ ధరలో స్కూటీ సొంతం చేసుకునేందుకు వీలుగా బైక్‌వాలాలో ఒక మంచి డీల్ ఉంది. అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2010 హీరో ప్లెజర్
తక్కువ బరువు ఉండి మంచి ఫీచర్లు ఉండే స్కూటీల్లో హీరో ప్లెజర్ ఒకటి. ఈ స్కూటీ మహిళలకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ బైక్‌ను బైక్‌వాలాలో రూ. 22 వేలకు లిస్ట్ చేశారు. ఈ స్కూటీ 2010లో మ్యానిఫ్యాక్షర్ అయ్యింది. ఇక ఈ స్కూటీ 47,111 కిలోమీటర్లు తిరిగింది. కాబట్టి రోజు తక్కువ మొత్తంలో ట్రావెల్ చేస్తామనుకునే వారు దీనిని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ స్కూటీ హైదరాబాద్‌లో ఏజీ ఆఫీస్‌లో అందుబాటులో ఉంది. ఈ స్కూటీ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే.?
* ఈ స్కూటీ 102 సీసీ డిస్‌ప్లేస్‌మెంట్‌తో వస్తుంది.
* మ్యాగ్జిమం పవర్ 6.91 bhp @ 7000 rpmగా, మాగ్జిమం టార్క్ 8.1 Nm @ 5000 rpmగా ఉంది.
* ఇక స్కూటీ టాప్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు.
* మైలేజ్ విషయంలో కూడా ఈ స్కూటీ బాగుంటుంది. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 63 కిలోమీటర్లు ఇస్తుంది. అయితే ఇది రోడ్డు కండిషన్, మీరు డ్రైవ్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. కనీసం 50 మాత్రం ఇస్తుందని ఇందులో పేర్కొన్నారు.
* ఈ స్కూటీలో 12 వీ-4 ఏహెచ్ ఎమ్ఎఫ్ బ్యాటరీని అందించారు.
* బీఎస్4 ఎమిషన్ స్టాండర్డ్ ఈ స్కూటీ సొంతం.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?
ఇందులో స్పీడోమీటర్, ఆడోమీటర్, ఫ్యూయల్ గేజ్, స్టాండ్ అలారమ్, లో ఫ్యూయల్ ఇండికేటర్ వంటి ఫీచర్లను అందించారు. ఇద్దరు ఎంచక్కా ఈ స్కూటీపై వెళ్లొచ్చు. కాలేజీకి లేదా ఉద్యోగానికి వెళ్లే మహిళలకు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈ స్కూటీ ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ విషయాలు తప్పక గమనించండి.
సెకండ్ హ్యాండ్ స్కూటీ కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా కొన్ని విషయాలు గమనించాలి. బైక్‌వాలా లాంటి వెబ్‌సైట్స్ సైకండ్ హ్యాండ్ వాహనాలకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వవు. కాబట్టి కొనుగోలు చేసే ముందే క్షుణ్నంగా గమనించాలి. అదే విధంగా నేరుగా స్కూటీని చూసేంత వరకు ఎలాంటి డబ్బులు పంపించకూడదు. వీటితో పాటు సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే ముందు గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.