Telugu

Ginger Tea: పక్కా కొలతలతో బెస్ట్ అల్లం టీ..చివరి గుటక వరకు అదే రుచి

Telugu

వానాకాలంలో ఒక్క కప్పు అల్లం టీ

ఎముందిలే అల్లం టీ. ఎవరైనా చేసేయోచ్చు అని అనుకుంటున్నారా? కాదండి. పక్కా కొలతలతో, అసలైన ప్రాసెస్‍తో ఇలా చేయండి. మైండ్ ఎంత ఫ్రెష్‍గా ఉంటుందో.

Image credits: Vismai Food/ youtube
Telugu

రెండు ఇలాచీ, ముదిరిన అల్లం

రెండంటే రెండే ఇలాచీ, బాగా ముదిరిన ఇంచు అల్లం ముక్కను దంచుకోవాలి. అంటే పీచు కట్టిన అల్లం. దాంట్లో మంచి ఘాటు ఉండటం వల్ల టీకి ఫ్లేవర్‍ను అందిస్తుంది.

Image credits: Vismai Food/ youtube
Telugu

2 నిమిషాలు మరిగించాలి

ఇప్పుడు పొయ్యిమీద టీ జార్ పెట్టి దాంట్లో 250 m.l నీళ్లు పోయండి. ఇందులో దంచుకున్న అల్లం, ఇలాచీ వేసి 2 నిమిషాలు మరిగించాలి.

Image credits: Vismai Food/youtube
Telugu

అప్పుడే పంచదార వేయాలి

అప్పుడు 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి మరో 3 నిమిషాలు మరగనివ్వాలి. పంచదార పాకం అల్లం ఘాటును బ్యాలెన్స్ చేస్తుంది. కచ్చితంగా పంచదార..అల్లంతోనే మరిగించాలి.

Image credits: Vismai Food/ youtube
Telugu

డికాక్షన్ ఎక్కువ మరగకూడదు

ఆ తర్వాత మీరు వాడే ఒకటిన్నర టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకోండి. డికాక్షన్ ఎక్కువ మరగకూడదు. ఒక నిమిషం మరిగితే చాలు. తర్వాత 250 m.l పాలు పోసి మరో 3 నిమిషాలు మరిగించాలి.

Image credits: Vismai Food/ youtube
Telugu

వానాకాలానికి బెస్ట్ మూమెంట్

పాలు పోసి అలానే వదిలేయకుండా అలా గరిటెతో కలపాలి. అప్పుడే అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అంతే బెస్ట్ అల్లం టీ రెడీ. ఈ వానాకాలంలో దీని కంటే ఎంజాయ్ మూమెంట్ మరొకటి ఉంటుందా?

Image credits: Vismai Food/ youtube

Jio vs Airtel : రెండిట్లోనూ రూ.199 రీచార్జ్ ప్లాన్.. ఏది బెస్ట్?

Business Idea : రూ.10తో రూ.500 సంపాదన..! లక్ కలిసొచ్చి క్లిక్ అయ్యిందో

iPhone 17: పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర తెలిస్తే షాకవుతారు

లోన్ కోసం సిబిల్ స్కోర్ ఇలా పెంచుకోండి