MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Business
  • Cheap Gold: బంగారం ఇక్కడ డెడ్ చీప్...తరుగు, మేకింగ్ ఛార్జీలు కూడా తక్కువే, ఇప్పుడే వెళ్లి కొనేయండి

Cheap Gold: బంగారం ఇక్కడ డెడ్ చీప్...తరుగు, మేకింగ్ ఛార్జీలు కూడా తక్కువే, ఇప్పుడే వెళ్లి కొనేయండి

Cheap Gold: బంగారమంటే భారతీయులకు అమితమైన మోజు. కొంటూనే ఉంటారు. కానీ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధర తక్కువని దుబాయ్, సింగపూర్ నుంచి తెప్పించుకుంటున్నారు. అయితే మనదగ్గర కూడా కొన్ని చోట్ల పసిడి చాలా చీప్‍గా దొరికేస్తుంది. మరి అదెక్కడో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
Published : Jul 30 2026, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బంగారం చీప్‍గా దొరికే ప్లేస్
Image Credit : Gemini

బంగారం చీప్‍గా దొరికే ప్లేస్

బంగారమంటే భారతీయులకు అమితమైన మోజు. ఎంతున్నా సరిపోదు. కొంటూనే ఉంటారు. కానీ ధరలు పెరిగిపోతున్నాయి. బంగారం ధర ఎంత పెరిగినా, కొనడం మాత్రం ఆపరు. చాలామంది ఇప్పుడు బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్నారు. అందుకే డిమాండ్ తగ్గట్లేదు. అయితే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇతరు చోట్ల కన్నా తక్కువ ధరకే బంగారం దొరుకుతుంది. ఆ నగరాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఆర్థిక రాజధానిలో గోల్డ్ చవక
Image Credit : Gemini

ఆర్థిక రాజధానిలో గోల్డ్ చవక

ముంబైలోని జవేరి బజార్, భారతదేశంలోనే అతిపెద్ద బంగారు వ్యాపార కేంద్రం. దేశంలో జరిగే చాలా బంగారం, వెండి వ్యాపారం ఇక్కడి నుంచే నడుస్తుంది. పెళ్లి నగల నుంచి రోజువారీ డిజైన్ల వరకు అన్నీ ఇక్కడ హోల్‌సేల్ ధరలకే లభిస్తాయి.

Related Articles

Related image1
Today Gold Rate: మిడిల్ ఈస్ట్ లో భగ్గుమన్న యుద్ధ సెగలు....కానీ ఈసారి బంగారం ధరలు యూటర్న్
Related image2
Gold Price Hike: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు...పరుగులు పెడుతున్న బంగారం
37
ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా
Image Credit : Gemini

ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా

ఢిల్లీ చాందినీ చౌక్‌లోని 'కూచా మహాజని' …ఉత్తర భారతదేశంలో అతిపెద్ద గోల్డ్ మార్కెట్. ఇక్కడ గ్రాండ్ బ్రైడల్ జ్యువెలరీ, కుందన్ వర్క్ నగలు దొరుకుతాయి. కోల్‌కతాలోని 'బో బజార్', 'బుర్రా బజార్' బెంగాలీ ఫిలిగ్రీ వర్క్‌కు ఫేమస్. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న 'జోహరి బజార్' సాంప్రదాయ కుందన్, మీనాకారి ఆభరణాలకు ప్రసిద్ధి.

47
చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూరు
Image Credit : Gemini

చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూరు

దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాలకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే. చెన్నైలోని జార్జ్ టౌన్, సాంప్రదాయ టెంపుల్, యాంటిక్ నగలకి పెట్టింది పేరు. హైదరాబాద్‌లోని 'పాట్ మార్కెట్', 'బేగం బజార్' ప్రాంతాల్లో కూడా బంగారం ధర తక్కువ. తమిళనాడులోని కోయంబత్తూరు, మెషిన్ చైన్లు, తేలికపాటి నగల తయారీకి ముఖ్య కేంద్రం.
57
త్రిశూర్, అహ్మదాబాద్
Image Credit : stockPhoto

త్రిశూర్, అహ్మదాబాద్

కేరళలోని త్రిశూర్, దక్షిణ భారతదేశానికి పెద్ద మొత్తంలో ఆభరణాలను సరఫరా చేస్తుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న 'మానెక్ చౌక్' దేశంలోని మరో పెద్ద బంగారు హోల్‌సేల్ కేంద్రం. ముఖ్యంగా గోల్డ్ బార్స్/కాయిన్స్, హాల్‌మార్క్ చేసిన స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లను పెద్దమొత్తంలో కొనడానికి ఇది చాలా ఫేమస్.
67
మేకింగ్ ఛార్జీలు, తరుగు తక్కువ
Image Credit : Asianet News

మేకింగ్ ఛార్జీలు, తరుగు తక్కువ

హోల్‌సేల్ మార్కెట్లలో బంగారం బులియన్ రేట్ దేశమంతటా దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ, ఇక్కడ నగల తయారీ ఛార్జీలు, తరుగు.. రిటైల్ షోరూమ్‌లతో పోలిస్తే 30% నుంచి 50% వరకు తక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ నగలు చౌకగా దొరుకుతాయి.

77
IBJA కీలక పాత్ర
Image Credit : X

IBJA కీలక పాత్ర

భారత్‌లో రోజువారీ బంగారం హోల్‌సేల్ ధరను నిర్ణయించడంలో ముంబై జవేరి బజార్‌లోని IBJA - ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలోని చాలా నగల దుకాణాలు IBJA నిర్ణయించిన ధర ఆధారంగానే తమ రోజువారీ అమ్మకం రేటును ఫిక్స్ చేస్తాయి. హోల్‌సేల్ మార్కెట్లే కాకుండా, రిటైల్ వ్యాపారులు పెద్దమొత్తంలో బంగారం కొనడానికి IIJS -ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో వంటి భారీ B2B ప్రదర్శనలు ఏటా ముంబై, మన బెంగళూరులో జరుగుతాయి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరికొత్త డిజైన్లను హోల్‌సేల్ ధరలకు పరిచయం చేస్తారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !
Recommended image2
Cheapest Gold : ఇండియాలో అత్యంత చౌకగా బంగారం దొరికే సిటీ ఏది? ఇక్కడ ఎందుకంత తక్కువ ధర?
Recommended image3
Gold Price Crash: మళ్లీ పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం..పాతాళానికి పడిపోతున్న పసిడి, సిల్వర్
Related Stories
Recommended image1
Today Gold Rate: మిడిల్ ఈస్ట్ లో భగ్గుమన్న యుద్ధ సెగలు....కానీ ఈసారి బంగారం ధరలు యూటర్న్
Recommended image2
Gold Price Hike: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు...పరుగులు పెడుతున్న బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved