MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డెడ్ లైన్ ఫిక్స్.. జీతాల పెంపు ఎంతంటే?

8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డెడ్ లైన్ ఫిక్స్.. జీతాల పెంపు ఎంతంటే?

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ధృవీకరించింది. 18 నెలల్లో రిపోర్టు అందజేయనున్న ఈ కమిషన్, 2026 నుంచి వేతన సవరణ అమలుపై కీలక అప్‌డేట్స్ ఇచ్చింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 26 2026, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
8వ వేతన సంఘంపై పార్లమెంట్‌లో కేంద్రం ఏం చెప్పింది?
Image Credit : Social Media

8వ వేతన సంఘంపై పార్లమెంట్‌లో కేంద్రం ఏం చెప్పింది?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Central Pay Commission) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ కమిషన్ విధివిధానాలు, కాలపరిమితి, ప్రస్తుత స్థితిగతులపై ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. ఈ నిర్ణయం సుమారు 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లపై నేరుగా ప్రభావం చూపనుంది.

26
8వ వేతన సంఘం పై పార్లమెంట్‌లో కేంద్రం మంత్రి పంకజ్ చౌదరీ కామెంట్స్
Image Credit : ChatGPT

8వ వేతన సంఘం పై పార్లమెంట్‌లో కేంద్రం మంత్రి పంకజ్ చౌదరీ కామెంట్స్

లోక్‌సభలో ఎంపీ ఏ రాజా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2025 నవంబర్ 3వ తేదీనే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీర్మానం జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్‌ను ఛైర్‌పర్సన్‌గా నియమించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణాలు, అలవెన్సులు, పెన్షన్ విధానాలను సమీక్షించే బాధ్యతను ఈ కమిషన్‌కు అప్పగించారు.

Related Articles

Related image1
Bank Holidays : వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు సెలవు అంటే?
Related image2
Samsung నుంచి అదిరిపోయే 2 కొత్త ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
36
8th Central Pay Commission : రిపోర్టు సబ్మిట్ కు 18 నెలల గడువు
Image Credit : Google

8th Central Pay Commission : రిపోర్టు సబ్మిట్ కు 18 నెలల గడువు

కమిషన్ తన సిఫార్సులను సమర్పించడానికి ప్రభుత్వం 18 నెలల కాలపరిమితిని నిర్ణయించింది. అంటే, కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి ఏడాదిన్నర లోపు తన తుది రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ కాలవ్యవధిలో కమిషన్ వివిధ శాఖల నుంచి డేటాను సేకరించి, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి రిపోర్టును సిద్ధం చేస్తుంది. అయితే, ఈ సిఫార్సుల వల్ల ప్రభుత్వంపై పడే ఖచ్చితమైన ఆర్థిక భారం రిపోర్టు అందిన తర్వాతే తెలుస్తుందని మంత్రి వివరించారు.

46
స్టేక్‌హోల్డర్ల నుంచి అభిప్రాయ సేకరణ
Image Credit : Getty

స్టేక్‌హోల్డర్ల నుంచి అభిప్రాయ సేకరణ

8వ వేతన సంఘం తన కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ప్రభుత్వం మైగవ్ (MyGov) పోర్టల్‌లో 18 కీలక ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని అందుబాటులో ఉంచింది. వివిధ మంత్రిత్వ శాఖలు, ఉద్యోగ సంఘాలు, వ్యక్తిగత ఉద్యోగులు కూడా తమ సలహాలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు. ఈ ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వడానికి 2026 మార్చి 31 వరకు గడువు పొడిగించారు. పారదర్శకమైన వేతన సవరణ కోసం ఈ ప్రక్రియ అత్యంత కీలకమని భావిస్తున్నారు.

56
8th Pay Commission : జీతాల పెంపు.. బకాయిల లెక్క ఇదే
Image Credit : X

8th Pay Commission : జీతాల పెంపు.. బకాయిల లెక్క ఇదే

నిబంధనల ప్రకారం, 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రావాలి. అయితే, రిపోర్టు సమర్పణలో ఆలస్యం జరిగితే, పెరిగిన జీతాలు ఉద్యోగుల చేతికి అందడానికి 2026 ద్వితీయార్థం లేదా 2027 వరకు సమయం పట్టవచ్చు. అయినప్పటికీ, అమలు తేదీని 2026 జనవరి 1 నుంచే పరిగణనలోకి తీసుకుని, అప్పటి నుంచి పెరిగిన మొత్తాన్ని బకాయిల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

66
8th Pay Commission : ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.. జీతం ఎంత పెరుగుతుంది?
Image Credit : Gemini

8th Pay Commission : ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.. జీతం ఎంత పెరుగుతుంది?

జీతాలు ఎంత మేర పెరుగుతాయనే దానిపై ప్రస్తుతం స్పష్టమైన అధికారిక సమాచారం లేకపోయినా, ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. గత వేతన సంఘాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.4 నుండి 3.0 మధ్య నిర్ణయించే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగుల ప్రాథమిక వేతనం పై 20% నుంచి 35% వరకు పెరుగుదల ఉండవచ్చని భావిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనిష్ఠ వేతనాన్ని కూడా భారీగా సవరించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
వ్యాపారం
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas : పెద్ద చదువులు, భారీ పెట్టుబడులతో పనిలేదు.. ఐటీ ఉద్యోగుల స్థాయిలో సంపాదించే సింపుల్ బిజినెస్‌లు ఇవే
Recommended image2
Gas Connections Cut: దేశ ప్రజలకు పెద్ద షాకిచ్చిన ప్రభుత్వం, వారందరికీ గ్యాస్ సిలిండర్లు త్వరలో కట్
Recommended image3
Monthly interest: నెలకి 50 వేల రూపాయలు వడ్డీగా కావాలనుకుంటే బ్యాంకులో ఎంత డిపాజిట్ చేయాలి?
Related Stories
Recommended image1
Bank Holidays : వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు సెలవు అంటే?
Recommended image2
Samsung నుంచి అదిరిపోయే 2 కొత్త ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved