MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EPFO : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. మీరు నమ్ముతున్న ఈ 5 విషయాలు పచ్చి అబద్ధాలు !

EPFO : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. మీరు నమ్ముతున్న ఈ 5 విషయాలు పచ్చి అబద్ధాలు !

EPFO Myths and Facts: ఈపీఎఫ్ ఖాతాదారులకు షాకింగ్ నిజాలు. రిటైర్మెంట్ వయస్సు, వడ్డీ, పెన్షన్ గురించి మీరు నమ్మే 5 అబద్ధాలు.. వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 01 2026, 09:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మీ పీఎఫ్ డబ్బుపై వడ్డీ ఆగిపోతుందా? ఈ 5 అపోహలు నమ్మితే మీకే నష్టం!
Image Credit : Asianet News

మీ పీఎఫ్ డబ్బుపై వడ్డీ ఆగిపోతుందా? ఈ 5 అపోహలు నమ్మితే మీకే నష్టం!

ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ప్రధాన పొదుపు సాధనం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF). పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇది ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి వేతనం నుంచి కొంత భాగం, అలాగే కంపెనీ తరపున కొంత భాగం ఈ ఖాతాలో జమవుతూ వస్తాయి. దీనిపై వచ్చే చక్రవడ్డీ మీ పొదుపును కాలక్రమేణా భారీ నిధిగా మారుస్తుంది.

అయితే, ఈపీఎఫ్ నిబంధనల పట్ల చాలా మంది ఉద్యోగులలో అనేక అపోహలు ఉన్నాయి. ఈ అబద్ధాలను నిజమని నమ్మి చాలా మంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ నష్టపోతున్నారు. అందుకే, పీఎఫ్ ఖాతాకు సంబంధించి ప్రచారంలో ఉన్న 5 ప్రధాన అపోహలు.. వాటి వెనుక ఉన్న వాస్తవాలను గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లు అనుకుంటున్నారా?
Image Credit : Gemini

1. రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లు అనుకుంటున్నారా?

చాలా మంది ఉద్యోగులు పీఎఫ్ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లు అని భావిస్తారు. కానీ వాస్తవానికి, ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం అధికారిక రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్లు మాత్రమే. మీరు ఒకవేళ 58 ఏళ్ల తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగినప్పటికీ, పీఎఫ్ ఖాతాకు చేసే కొత్త జమలు నిలిచిపోతాయి. 58 ఏళ్లను కట్ ఆఫ్ వయస్సుగా పరిగణిస్తారు. పెన్షన్ ప్రయోజనాల కోసం కూడా ఇదే ప్రామాణికం.

36
2. రిటైర్మెంట్ తర్వాత వడ్డీ రాదా?
Image Credit : our own

2. రిటైర్మెంట్ తర్వాత వడ్డీ రాదా?

ఉద్యోగం నుంచి విరమణ పొందిన వెంటనే పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుపై వడ్డీ రావడం ఆగిపోతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. ఒకవేళ మీరు 58 ఏళ్ల వయస్సులో రిటైర్ అయితే, మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌పై మరో మూడేళ్ల వరకు (అంటే 61 ఏళ్ల వయస్సు వరకు) వడ్డీ లభిస్తుంది. పదవీ విరమణ తర్వాత కూడా పరిమిత కాలం పాటు మీ పొదుపుపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి వెంటనే డబ్బు విత్ డ్రా చేయలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

46
3. ముందస్తు రిటైర్మెంట్ తీసుకుంటే వడ్డీ పరిస్థితి ఏమిటి?
Image Credit : Asianet News

3. ముందస్తు రిటైర్మెంట్ తీసుకుంటే వడ్డీ పరిస్థితి ఏమిటి?

మీరు ఏ వయస్సులో రిటైర్ అయినా మూడేళ్ల పాటు వడ్డీ వస్తుందని అనుకోవడం పొరపాటు. ఒకవేళ మీరు 58 ఏళ్ల కంటే ముందే ఉద్యోగం మానేస్తే, వడ్డీ లభించే కాలపరిమితి మారుతుంది. ఉదాహరణకు, మీరు 45 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటే, మీకు 58 ఏళ్లు వచ్చే వరకు వడ్డీ లభిస్తూనే ఉంటుంది. అదే 57 ఏళ్లకు రిటైర్ అయితే, 60 ఏళ్ల వరకు వడ్డీ వస్తుంది. అంటే, తక్కువ వయస్సులో రిటైర్ అయిన వారికి వడ్డీ లభించే కాలం ఎక్కువగా ఉంటుంది.

56
4. ఉద్యోగం మారితే ఖాతా క్లోజ్ అవుతుందా?
Image Credit : our own

4. ఉద్యోగం మారితే ఖాతా క్లోజ్ అవుతుందా?

ఉద్యోగం మారినప్పుడు లేదా మధ్యలో ఖాళీ ఏర్పడినప్పుడు పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుందని చాలా మంది భయపడతారు. వరుసగా మూడేళ్ల పాటు ఎటువంటి జమలు జరగని పక్షంలో ఆ ఖాతా ఇన్ ఆపరేటివ్ గా మారుతుంది తప్ప, క్లోజ్ అవ్వదు. అటువంటి ఖాతా నుంచి కూడా మీరు నిధులను బదిలీ చేసుకోవచ్చు లేదా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, ఉద్యోగం మారినప్పుడు జాయినింగ్ డేట్, ఎగ్జిట్ డేట్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కాంట్రిబ్యూషన్ లేని కాలాన్ని పెన్షన్ సర్వీస్‌గా పరిగణించరు.

66
5. పెన్షన్ కేవలం రిటైర్మెంట్ తర్వాతేనా?
Image Credit : Gemini AI

5. పెన్షన్ కేవలం రిటైర్మెంట్ తర్వాతేనా?

పూర్తిగా ఉద్యోగం మానేసిన తర్వాతే పెన్షన్ వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) ప్రకారం, మీకు 58 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్ ప్రారంభమవుతుంది. మీరు ఆ వయస్సు తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగుతున్నా సరే, పెన్షన్ పొందవచ్చు. పెన్షన్ మొత్తాన్ని లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములా ఉంది..

పెన్షన్ = (పెన్షనబుల్ శాలరీ × పెన్షనబుల్ సర్వీస్) ÷ 70

ప్రస్తుతం కనీస నెలవారీ పెన్షన్ ₹1,000 గా ఉంది.. దీనిని ₹7,500 కి పెంచాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

మంచి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఈ నియమాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ పీఎఫ్ పాస్‌బుక్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇలా సరైన సమాచారంతో మీ భవిష్యత్తును భద్రపరుచుకోండని సూచిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
ప్రభుత్వ పథకాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image2
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image3
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Related Stories
Recommended image1
April 1 Rule Changes: రైల్వే టికెట్ నుండి ఏటీఎం వరకు.. ఏప్రిల్ 1 నుండి ఏం మారబోతున్నాయి?
Recommended image2
Govt Jobs : టెన్త్ పాస్ అయితే చాలు.. ఆర్మీ, నేవీలో భారీ ఉద్యోగాల జాతర! వెంటనే అప్లై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved