పిల్లలకు పేర్లు పెట్టి కోట్లు సంపాదించిన మహిళ.. ఒక పేరుకు 27 లక్షలా..!
business Nov 14 2026
Author: Arun Kumar P Image Credits:Getty
Telugu
వెరైటీ బిజినెస్ ఐడియా
అమెరికాకు చెందిన టేలర్ హంఫ్రీ సరికొత్త వ్యాపారం చేస్తున్నారు. ఆమె పిల్లలకు ప్రొఫెషనల్‌గా పేర్లను సూచిస్తారు. ఆమె సర్వీస్ కోసం సంపన్నులు వేల డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు.
Image credits: Freepik
Telugu
ఇప్పుడు ఫీజు ₹27 లక్షల వరకు
టేలర్ ఒక్కో క్లయింట్ నుంచి $30,000 (సుమారు ₹27 లక్షలు) వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫీజు నామకరణం లోతు, వ్యక్తుల అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
Image credits: Getty
Telugu
2020లో ₹1.33 కోట్ల ఆదాయం
కేవలం ఒకే ఏడాదిలో (2020) ఆమె 100 మందికి పైగా పిల్లలకు పేర్లు పెట్టడంలో సహాయం చేశారట. దీంతో $150,000 (సుమారు ₹1.33 కోట్లు) సంపాదించారట.
Image credits: Getty
Telugu
పేరు సూచించే ప్రక్రియ
పేరును సూచించే ముందు, తల్లిదండ్రుల వ్యక్తిత్వం, ఇష్టాయిష్టాలు, కుటుంబ నేపథ్యం మొదలైన వాటిని అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేక ప్రశ్నపత్రాన్ని నింపాల్సి ఉంటుంది.