MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Automobile
  • Bikes
  • TVS iQube: ఓలా, ఏథ‌ర్‌ బ‌లాదూర్‌.. 10 ల‌క్ష‌ల మంది కొన్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు

TVS iQube: ఓలా, ఏథ‌ర్‌ బ‌లాదూర్‌.. 10 ల‌క్ష‌ల మంది కొన్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు

TVS iQube: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ మోటార్ కంపెనీ భారీ రికార్డు సృష్టించింది. దేశంలో మొత్తం 10 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు సాధించి కొత్త మైలురాయిని చేరుకుంది. 

3 Min read
Author : Narender Vaitla
Published : Jun 14 2026, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
TVS iQubeతో ప్రారంభమైన ప్రయాణం
Image Credit : TVS

TVS iQubeతో ప్రారంభమైన ప్రయాణం

టీవీఎస్ మోటార్ 2020 జనవరిలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రారంభంలో ఈ స్కూటర్ కొద్ది నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండటంతో అమ్మకాలు పెద్దగా జరగలేదు. అయితే క్రమంగా దేశవ్యాప్తంగా విక్రయాలను విస్తరించడంతో వినియోగదారుల స్పందన పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అడుగుపెట్టినప్పుడు టీవీఎస్ మార్కెట్ వాటా కేవలం 1 శాతం మాత్రమే ఉండేది. మొదటి లక్ష ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చేరుకోవడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. కానీ ఆ తర్వాత అమ్మకాల వేగం గణనీయంగా పెరిగింది. తదుపరి లక్ష యూనిట్లు కేవలం 10 నెలల్లోనే అమ్ముడుపోయాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వినియోగదారుల నమ్మకమే విజయానికి కారణం
Image Credit : x

వినియోగదారుల నమ్మకమే విజయానికి కారణం

2023, 2024 సంవత్సరాల్లో సరఫరా వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వృద్ధి కొంత మందగించింది. అయినప్పటికీ టీవీఎస్ తన ప్రగతిని ఆపలేదు. 2025 ఏప్రిల్ నాటికి కంపెనీ 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల మైలురాయిని దాటింది. కంపెనీపై వినియోగదారుల విశ్వాసం పెరగడం, దేశవ్యాప్తంగా డీలర్ నెట్‌వర్క్ విస్తరించడం వల్ల అమ్మకాలు వేగంగా పెరిగాయి. సేవల నాణ్యత, విశ్వసనీయత కూడా వినియోగదారులను ఆకర్షించాయి.

36
మూడు నెలల్లోనే లక్షల అమ్మకాలు
Image Credit : Google

మూడు నెలల్లోనే లక్షల అమ్మకాలు

2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో టీవీఎస్ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. కేవలం మూడు నెలల్లోనే 7 లక్షల నుంచి 8 లక్షల యూనిట్ల అమ్మకాల స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్‌ఫామ్‌ను, కొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది. దీంతో మార్కెట్లో డిమాండ్ మరింత పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో టీవీఎస్ కీలక ప్లేయ‌ర్‌గా మారింది.

46
ఒకే నెలలో 51 వేలకుపైగా స్కూటర్ల విక్రయం
Image Credit : Google

ఒకే నెలలో 51 వేలకుపైగా స్కూటర్ల విక్రయం

2026లో టీవీఎస్ మరో చరిత్ర సృష్టించింది. మొత్తం 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పూర్తి చేసింది. 2026 మే నెలలో ఒక్క నెలలోనే 51,605 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డు. అలాగే భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో నమోదైన రెండో అతిపెద్ద నెలవారీ విక్రయాలుగా నిలిచింది. 2020లో కేవలం 1 శాతం మార్కెట్ వాటా ఉన్న టీవీఎస్, 2023 నాటికి 20 శాతానికి పైగా మార్కెట్ వాటాను సాధించింది. 2025లో 3.15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి దేశంలోనే అతిపెద్ద ఈవీ తయారీ సంస్థగా అవతరించింది. ప్రస్తుతం బజాజ్, ఏథర్, ఓలా వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది.

56
2026లో మరో భారీ రికార్డు సాధించే అవకాశం
Image Credit : TVS website

2026లో మరో భారీ రికార్డు సాధించే అవకాశం

2026లో ఇప్పటివరకు టీవీఎస్ 2.19 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇదే వేగం కొనసాగితే, ముఖ్యంగా పండుగల సీజన్‌లో డిమాండ్ పెరిగితే ఈ ఏడాది ఒక్కటే 5 లక్షల ఈవీ అమ్మకాల రికార్డు సాధించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో మొత్తం ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల వాటా సుమారు 10 శాతం మాత్రమే ఉంది. అంటే ఈ రంగంలో ఇంకా భారీ వృద్ధి అవకాశాలు ఉన్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన వ్యయాలపై ఆందోళనలు ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లిస్తున్నాయి. దీర్ఘకాలంలో తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

66
అదిరిపోయే ఫీచర్లు
Image Credit : Google

అదిరిపోయే ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 4.4 kW BLDC హబ్ మోటార్, 33 Nm మోటార్ టార్క్, 140 Nm వీల్ టార్క్ ఉన్నాయి. గంటకు గరిష్ఠంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 94 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 0-80 శాతం ఛార్జింగ్‌కు కేవలం 2 గంటల 50 నిమిషాలు పడుతుంది. పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, రివర్స్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, ఈకో-పవర్ రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

5 ఇంచెస్ TFT డిజిటల్ డిస్‌ప్లే, బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్-ఎస్‌ఎంఎస్ అలర్ట్స్, OTA అప్‌డేట్స్, టెలిమాటిక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. LED హెడ్‌లైట్, DRLs, USB ఛార్జింగ్ పోర్ట్, మొబైల్ యాప్ సపోర్ట్, వెహికల్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, ఫాల్ అలర్ట్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. 30 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ రియర్ సస్పెన్షన్, 220 మి.మీ డిస్క్ ఫ్రంట్ బ్రేక్, ట్యూబ్‌లెస్ టైర్లు, 157 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్, 110 కిలోల కర్బ్ వెయిట్‌తో ఈ స్కూటర్ రోజువారీ ప్రయాణాలకు అనువుగా రూపొందించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image2
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Recommended image3
రివ‌ర్స్ మోడ్‌, ఈజీ పార్క్‌.. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ఓలా నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ స్కూటీ
Related Stories
Recommended image1
Raincoat: వర్షంలో బయటకు వెళ్తుంటారా.? ఈ బాల్ ఉంటే చాలు అస్స‌లు త‌డ‌వ‌రు
Recommended image2
దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved