- Home
- Automobile
- Bikes
- Honda NX500: హోండా నుంచి క్రేజీ బైక్.. అసలు ఏంటీ ఈ-క్లచ్ టెక్నాలజీ? దీని ప్రయోజనాలు ఏంటి?
Honda NX500: హోండా నుంచి క్రేజీ బైక్.. అసలు ఏంటీ ఈ-క్లచ్ టెక్నాలజీ? దీని ప్రయోజనాలు ఏంటి?
Honda NX500 : ట్రాఫిక్‌లో క్లచ్ నొక్కే బాధ లేకుండా గేర్లు మార్చుకునే విప్లవాత్మక ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా NX500 అడ్వెంచర్ బైక్ ఇండియాలో లాంచ్ అయింది. NX500 ఫీచర్లు, ధర సహా పూర్తి డిటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం.

ఇక లెఫ్ట్ హ్యాండ్‌కు రెస్ట్.. క్లచ్ లేకపోయినా గేర్ మార్చొచ్చు.. హోండా NX500 మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు
రైడింగ్ అంటే ఇష్టముండే వారికి, అడ్వెంచర్ లవర్స్‌కు హోండా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బైక్ నడిపేటప్పుడు ట్రాఫిక్‌లో పదే పదే క్లచ్ నొక్కి చేతులు నొప్పులు పుడుతున్నాయా? గేర్ మార్చేటప్పుడు క్లచ్, యాక్సిలరేటర్ సింక్ అవ్వక బండి ఆగిపోతోందా? ఇకపై ఆ టెన్షన్స్ పడక్కర్లేదు.
ఎందుకంటే, జపాన్ ఆటోమేకర్ హోండా సరికొత్త విప్లవాత్మక సాంకేతికతతో తన మోస్ట్ పాపులర్ అడ్వెంచర్ టూరర్ బైక్ ‘హోండా NX500’ను సరికొత్త ఈ-క్లచ్ వేరియంట్‌లో ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరి ఏంటి ఈ సరికొత్త టెక్నాలజీ? దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

అసలు ఏంటీ ఈ-క్లచ్ మ్యాజిక్?
చాలామందికి స్కూటర్ లాంటి ఆటోమేటిక్ రైడింగ్ కావాలి, కానీ బైక్ లాంటి గేర్లు మార్చే కిక్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటారు. సరిగ్గా ఇలాంటి వారి కోసమే హోండా ఈ-క్లచ్ టెక్నాలజీని తెచ్చింది. ఇది మ్యాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ క్లచ్‌ల క్రేజీ కాంబినేషన్. ఇందులో ఉండే స్మార్ట్ ఎలక్ట్రానిక్ యాక్చ్యుయేటర్లు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ మీరు గేర్ మార్చేటప్పుడు, బండి స్టార్ట్ చేసేటప్పుడు లేదా సిగ్నల్ దగ్గర పూర్తిగా ఆపినప్పుడు ఆటోమేటిక్‌గా క్లచ్‌ను ఆపరేట్ చేస్తాయి.
అంటే, మీరు ఎడమచేత్తో క్లచ్ లివర్‌ను అసలు తాకాల్సిన అవసరమే లేదు.. కేవలం మీ ఎడమ కాలితో గేర్లు మార్చుకుంటూ దూసుకెళ్లిపోవడమే. ఒకవేళ మీకు పాత పద్ధతిలోనే క్లచ్ నొక్కి డ్రైవ్ చేయాలనిపిస్తే.. ఎప్పుడైనా లివర్‌ను చేతితో వాడవచ్చు, వెంటనే బైక్ మ్యాన్యువల్ మోడ్‌లోకి షిఫ్ట్ అయిపోతుంది.
హోండా NX500 : పవర్ ప్యాక్డ్ ఇంజిన్.. అదిరిపోయే స్పెసిఫికేషన్లు
ఈ సరికొత్త హోండా NX500 బైక్‌లో పవర్‌ఫుల్ 471cc, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ను అమర్చారు. ఇది 8,500 rpm వద్ద 47 Hp గరిష్ఠ పవర్‌ను, అలాగే 6,500 rpm వద్ద 43 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. లాంగ్ రైడ్స్‌లో అల్టిమేట్ కంఫర్ట్ కోసం ముందు వైపు USD ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు.
ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఫ్రంట్‌లో ట్విన్ 296 mm డిస్క్ బ్రేకులు, రేడియల్ మౌంటెడ్ నిస్సిన్ కాలిపర్స్, బ్యాక్ సైడ్ 240 mm సింగిల్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ ఉండనే ఉంది. ఈ స్మార్ట్ ఈ-క్లచ్ సిస్టమ్ వల్ల బైక్ బరువు కేవలం 3 కిలోలు మాత్రమే పెరిగి, మొత్తం 199 కిలోలుగా మారింది.
హోండా NX500 లో ఫీచర్లు నెక్స్ట్ లెవెల్.. కానీ కొన్ని మిస్సయ్యాయి
టెక్ ప్రియుల కోసం ఈ బైక్‌లో 5 అంగుళాల పూర్తి కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్ కోసం హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. నైట్ రైడింగ్ కోసం ఫుల్ LED లైటింగ్ సెటప్‌ను ఇచ్చారు. భద్రతను మరింత పెంచడానికి హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ ఫీచర్ ఉంది. అయితే, ఈ రేంజ్ ప్రీమియం బైక్‌లలో ఆశించే అడ్వాన్స్‌డ్ రైడింగ్ మోడ్స్, రైడ్-బై-వైర్ వంటి ఫీచర్లు ఇందులో లేవు. పాత పద్ధతిలోనే కేబుల్ ఆపరేటెడ్ థ్రోటిల్‌ను ఇందులోనూ ఇచ్చారు.
హోండా NX500 ధర ఎంత? ఎక్కడ బుక్ చేసుకోవాలి?
ఈ సరికొత్త టెక్నాలజీతో వచ్చిన హోండా NX500 ఎక్స్-షోరూమ్ ధరను రూ. 7,43,900 గా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్, పెర్ల్ హోరిజోన్ వైట్ అనే రెండు అట్రాక్టివ్ కలర్స్‌లో లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో దీని బుకింగ్స్ ఇప్పటికే షురూ అయ్యాయి. సిటీ ట్రాఫిక్‌లో అలసటను తగ్గించి, హైవేలపై లాంగ్ రైడ్స్ వెళ్లేటప్పుడు రైడర్‌కు అల్టిమేట్ కంట్రోల్ ఇచ్చే ఈ బైక్.. రైడింగ్ ఇష్టపడే వారికి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. కానీ, ధర మాత్రం ఎక్కువనే చెప్పాలి.

