- Home
- Automobile
- Bikes
- Bikes: ఈ బైక్స్ కొంటే పక్కా పైసా వసూల్.. దేశంలో ఎక్కువ రీసేల్ వాల్యూ ఉన్న బైక్స ఇవే
Bikes: ఈ బైక్స్ కొంటే పక్కా పైసా వసూల్.. దేశంలో ఎక్కువ రీసేల్ వాల్యూ ఉన్న బైక్స ఇవే
Bikes: భారతీయులు కొత్త బైక్ కొనే సమయంలో ధర, మైలేజ్‌తో పాటు రీసేల్ విలువ కూడా చూస్తారు. భవిష్యత్తులో కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకున్నా పాత బండికి ఎక్కువ ధర రావాలని కోరుకుంటారు. మరీ ఎక్కువ రీసేల్ విలువ ఉన్న బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం

రీసేల్ విలువ ఎందుకు ముఖ్యమైంది?
టూ-వీలర్ కొనేటప్పుడు చాలామంది మొదట ధర, మైలేజ్ చూస్తారు. కానీ కొన్నేళ్ల తర్వాత అమ్మాలనుకుంటే ఎంత ధర వస్తుందో కూడా ముఖ్యమే. మంచి రీసేల్ విలువ ఉన్న బైక్ లేదా స్కూటర్ కొనడం వల్ల భవిష్యత్తులో మీకు మంచి రిటర్న్ వస్తుంది. ముఖ్యంగా ఎక్కువకాలం నమ్మకంగా పనిచేసే వాహనాలకు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
హీరో స్ల్పెండర్, హోండా యాక్టివా
హీరో స్ల్పెండర్ భారత్‌లో అత్యంత నమ్మకమైన బైక్‌లలో ఒకటి. దీని ఇంజిన్ సింపుల్‌గా ఉండటం వల్ల ఎక్కువ ఖర్చు లేకుండా సంవత్సరాల పాటు పనిచేస్తుంది. అందుకే 2–3 సంవత్సరాల తర్వాత కూడా దీనికి మంచి ధర లభిస్తుంది.
హోండా యాక్టివా స్కూటర్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. దీని స్మూత్ రైడింగ్, సులభ వినియోగం వల్ల అన్ని వయసుల వాళ్లకు ఇది నచ్చుతుంది. నగరాల్లో సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది.
హోండా షైన్, పల్సర్ 150
కొంచెం ఎక్కువ పవర్, ఫీచర్స్ కావాలనుకునేవారికి హోండా షైన్ మంచి ఎంపిక. ఇది 125cc సెగ్మెంట్‌లో బలమైన పనితీరు, స్మూత్ రైడింగ్ కోసం ప్రసిద్ధి చెందింది. దీర్ఘకాలం ఉపయోగించిన తర్వాత కూడా మంచి రీసేల్ విలువ ఇస్తుంది.
బజాజ్ పల్సర్ 150 యువతలో చాలా ఫేమస్. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్ వల్ల ఇది సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే దీని విలువ త్వరగా తగ్గదు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఒక సాధారణ బైక్ కాదు, చాలా మందికి ఇది ఒక ఫీలింగ్. దీని రెట్రో డిజైన్, ప్రత్యేకమైన సౌండ్ దీనికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. దీని ధర ఎక్కువగా ఉన్నా, వాడిన తర్వాత కూడా దీని విలువ త్వరగా పడిపోదు. కొన్ని సందర్భాల్లో పాత మోడల్స్‌కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది.
ఏ టూ-వీలర్ కొనడం మంచిది?
తక్కువ బడ్జెట్‌లో కొనుగోలు చేసి, తర్వాత అమ్మేటప్పుడు ఎక్కువ నష్టం కాకుండా ఉండాలంటే హీరో స్ల్పెండర్, హోండా యాక్టివా సేఫ్ ఆప్షన్స్. మంచి పనితీరు, విలువ రెండూ కావాలనుకుంటే హోండా షైన్, పల్సర్ 150 మంచి ఎంపికలు. ప్రత్యేక అనుభవం, ప్రీమియం ఫీలింగ్ కావాలంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సరైన ఎంపికగా ఉంటుంది.

