MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Automobile
  • EV Scooters : ఇక పెట్రోల్ టెన్షన్ వద్దు.. లక్ష లోపు ధరలో దొరికే టాప్ 7 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

EV Scooters : ఇక పెట్రోల్ టెన్షన్ వద్దు.. లక్ష లోపు ధరలో దొరికే టాప్ 7 ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా, బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో ఉన్నాయి.  

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 27 2026, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
లక్ష లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..
Image Credit : Meta AI

లక్ష లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే వంటగ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కొరత అంటూ ప్రచారం జరుగుతోంది… పెట్రోల్ బంకులవద్ద నోస్టాక్ బోర్డులు, వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లను మంచి ఆప్షన్‌గా భావిస్తున్నారు… వాటికి అమాంతం గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో సామాన్యుల బడ్జెట్ లో అంటే లక్ష రూపాయల లోపు ధరలో లభించే కొన్ని సూపర్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
1. ఓలా S1 X (Ola S1 X)
Image Credit : OLA

1. ఓలా S1 X (Ola S1 X)

ఓలా కంపెనీ నుంచి వచ్చిన అత్యంత చవకైన మోడల్ ఇది. తక్కువ ధరలో ఎక్కువ వేగం, ఆధునిక ఫీచర్లు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. బ్యాటరీ కెపాసిటీని బట్టి దీని ధర రూ.70,000 నుంచి రూ.95,000 వరకు ఉంటుంది. గంటకు గరిష్ఠంగా 90 నుంచి 101 కి.మీ వేగంతో వెళ్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కి.మీ నుంచి 190 కి.మీ (IDC) వరకు ప్రయాణిస్తుంది. ఇందులో 4.3-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, మొబైల్ యాప్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

38
2. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube - Base Variant)
Image Credit : TVS

2. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube - Base Variant)

టీవీఎస్ ఐక్యూబ్ నమ్మకమైన, ఫ్యామిలీతో కలిసి ఉపయోగించడానికి అనువైన స్కూటర్. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ.96,000 నుంచి మొదలవుతుంది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 5-అంగుళాల TFT స్క్రీన్, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ, మంచి ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ దీని సొంతం. ఇది ఆరు వేరియంట్లు, 12 రంగుల్లో లభిస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 212 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ స్కూటర్‌లో 4.4kW పవర్‌ఫుల్ మోటార్, బెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

48
3. హీరో విడా V1/VX2 (Hero Vida)
Image Credit : www.vidaworld.com

3. హీరో విడా V1/VX2 (Hero Vida)

హీరో కంపెనీకి చెందిన ఈ స్కూటర్లలో రిమూవబుల్ బ్యాటరీ (తీసి మార్చుకునే బ్యాటరీ) సదుపాయం ఉంది. అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మోడల్‌ను బట్టి దీని ధర సుమారు రూ.96,000 వరకు ఉంటుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. పోర్టబుల్ బ్యాటరీ, క్రూయిజ్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి దీని ప్రత్యేకతలు.

58
4. ఏథర్ రిజ్తా (Ather Rizta)
Image Credit : Ather Energy

4. ఏథర్ రిజ్తా (Ather Rizta)

ఏథర్ కంపెనీ నుంచి వచ్చిన మొదటి ఫ్యామిలీ స్కూటర్ ఇది. దీని రేంజ్ 159 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పెద్ద సీటు, స్మార్ట్ నావిగేషన్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, స్మూత్ సస్పెన్షన్ దీని ప్రత్యేకతలు. రోజూ ఆఫీసుకు వెళ్లేవారికి ఇది బాగా సూట్ అవుతుంది. స్కిడ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, కింద పడితే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే ఫీచర్, ఆటో హోల్డ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.

68
5. యూలూ విన్ (Yulu Wynn)
Image Credit : Yulu Website

5. యూలూ విన్ (Yulu Wynn)

యూలూ విన్ తక్కువ దూర ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్. దీని రేంజ్ 68 కిలోమీటర్లు. బరువు తక్కువగా ఉండటంతో పాటు, బ్యాటరీని తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంది. విద్యార్థులకు, డెలివరీ సిబ్బందికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

78
6. యాంపియర్ మ్యాగ్నస్ EX (Ampere Magnus EX)
Image Credit : stockPhoto

6. యాంపియర్ మ్యాగ్నస్ EX (Ampere Magnus EX)

తక్కువ మెయింటెనెన్స్, సింపుల్ వాడకాన్ని ఇష్టపడేవారికి యాంపియర్ మ్యాగ్నస్ మంచి ఎంపిక. దీని ధర సుమారు రూ.85,000 నుంచి రూ.96,000 మధ్య ఉంటుంది. దీని రేంజ్ సుమారు 80 నుంచి 100 కిలోమీటర్లు. విశాలమైన సీటు, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, సింపుల్ డిజైన్ దీని ప్రత్యేకతలు.

88
7. బజాజ్ చేతక్ 2901 (Bajaj Chetak 2901)
Image Credit : stockPhoto

7. బజాజ్ చేతక్ 2901 (Bajaj Chetak 2901)

బజాజ్ చేతక్ 2901 సాంప్రదాయ మెటల్ బాడీ, స్టైలిష్ లుక్‌తో వస్తుంది. ఈ స్కూటర్ ఇప్పుడు బడ్జెట్ ధరలోనూ అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.96,000 నుంచి రూ.99,000 వరకు ఉంటుంది. గంటకు 63 కిలోమీటర్ల వేగంతో, 123 కిలోమీటర్ల రేంజ్‌తో పనిచేస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, దృఢమైన మెటల్ బాడీ దీని ప్రత్యేకతలు.

గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. మీ నగరంలోని రోడ్ ట్యాక్స్ (RTO), ఇన్సూరెన్స్‌ను బట్టి ఆన్-రోడ్ ధరలో మార్పులు ఉండవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
భారత దేశం
హైదరాబాద్
విశాఖపట్నం
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Best Selling Scooters : ఇండియాలో టాప్ 5 స్కూటర్లు ఇవే.. అత్యధిక సేల్స్ రికార్డు మాత్రం దీనిదే
Recommended image3
హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి.. టాప్ కార్ల తయారీ కంపెనీల పేర్ల అర్థమేంటో తెలుసా?
Related Stories
Recommended image1
EV Scooter: కారులో ఉండే ఫీచర్లు స్కూటీలో ఉన్నాయేంటీ భయ్యా.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు
Recommended image2
Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved