MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • Bike: బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌.. ఇక‌పై ప్ర‌మాదాలు అస్స‌లు జ‌ర‌గ‌వు

Bike: బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌.. ఇక‌పై ప్ర‌మాదాలు అస్స‌లు జ‌ర‌గ‌వు

Bike: ద్విచక్ర వాహనాల ప్రపంచంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే AI ఆధారిత బైక్‌లు, హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలపై పరిశోధనలు చేస్తున్న యమహా ఇప్పుడు మరో వినూత్న టెక్నాలజీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 05 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బైక్‌ల కోసం కొత్త తరహా క్రూయిజ్ కంట్రోల్
Image Credit : Gemini AI

బైక్‌ల కోసం కొత్త తరహా క్రూయిజ్ కంట్రోల్

ప్రస్తుతం కార్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC) సిస్టమ్ సాధారణంగా కనిపిస్తోంది. ముందున్న వాహనానికి అనుగుణంగా కారు వేగాన్ని తగ్గించడం లేదా పెంచడం ఈ సిస్టమ్ పని. అయితే అదే సాంకేతికతను బైక్‌లలో అమలు చేయడం చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే బైక్‌లు రెండు చక్రాలపై మాత్రమే ఆధారపడతాయి. రైడర్ సమతుల్యత కీలకంగా ఉంటుంది. ఈ సవాల్‌ను అధిగమించేందుకు యమహా ప్రత్యేక సాఫ్ట్‌వేర్, సెన్సార్లతో కూడిన కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇది అనుభవజ్ఞుడైన రైడర్‌లా పరిస్థితులను అంచనా వేసి స్పందించేలా రూపొందిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముందున్న వాహనాన్ని గుర్తించి వేగం తగ్గిస్తుంది
Image Credit : Avore Electric Bike

ముందున్న వాహనాన్ని గుర్తించి వేగం తగ్గిస్తుంది

యమహా అభివృద్ధి చేస్తున్న ACC (ఆటోమేటిక్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌) వ్యవస్థలో రాడార్ సెన్సార్ కీలక పాత్ర పోషిస్తుంది. బైక్ ముందు ఉన్న వాహనం వేగం తగ్గించినప్పుడు లేదా ట్రాఫిక్ కారణంగా నెమ్మదిగా కదులుతున్నప్పుడు ఈ రాడార్ వెంటనే గుర్తిస్తుంది. ఆ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU) విశ్లేషించి థ్రాటిల్‌ను ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. దీంతో బైక్ వేగం క్రమంగా తగ్గుతుంది. ఆకస్మికంగా స్పీడ్ తగ్గకపోవడంతో రైడర్‌కు అసౌకర్యం కలగదు.

Related Articles

Related image1
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Related image2
Folk Song: వెండి తెర‌పై యూట్యూబ్ సెన్సేష‌న్‌.. ఫోక్ సాంగ్స్‌తో మెప్పించి, ఇప్పుడు సినిమాల్లో..
35
ఆటోమేటిక్‌గా గేర్‌లు మార్చే సిస్టమ్
Image Credit : Avore Electric Bike

ఆటోమేటిక్‌గా గేర్‌లు మార్చే సిస్టమ్

ఈ టెక్నాలజీలో మరో ముఖ్యమైన అంశం Y-AMT (య‌మ‌హా ఆటోమేటెడ్ మ్యాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌). ముందున్న వాహనం కారణంగా వేగం తగ్గాల్సి వచ్చినప్పుడు ఈ సిస్టమ్ స్వయంగా గేర్‌లను మార్చుతుంది. దీంతో బైక్ ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే తక్కువ వేగంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్ ఆగిపోవడం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటుంది. రైడర్ గేర్ మార్చాల్సిన అవసరం లేకుండా ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

45
అవసరమైతే బైక్ స్వయంగా బ్రేక్ వేస్తుంది
Image Credit : AI Meta

అవసరమైతే బైక్ స్వయంగా బ్రేక్ వేస్తుంది

వేగం తగ్గించడం, గేర్ మార్చడం ద్వారా పరిస్థితి అదుపులోకి రాకపోతే ఈ సిస్టమ్ నేరుగా బ్రేక్‌లను ఉపయోగిస్తుంది. ముందు, వెనుక చక్రాల బ్రేక్‌లను సమన్వయంతో ఉపయోగించి బైక్ వేగాన్ని సురక్షితంగా త‌గ్గిస్తుంది. అంతేకాదు, బ్రేకింగ్ సమయంలో బైక్ ముందుభాగం ఎక్కువగా కిందికి వంగకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ సస్పెన్షన్‌ను కూడా ఆటోమేటిక్‌గా అడ్జెస్ట్‌ చేస్తుంది. దీంతో రైడర్‌కు ఆకస్మిక షాక్‌లు తగలకుండా బైక్ స్థిరత్వం మెరుగుపడుతుంది.

55
రోడ్డు భద్రతలో కొత్త అధ్యాయం
Image Credit : Gemini

రోడ్డు భద్రతలో కొత్త అధ్యాయం

యమహా ప్రకారం ఈ టెక్నాలజీ రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. చాలాసార్లు ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే రైడర్లు గందరగోళానికి గురై తప్పుగా స్పందిస్తారు. అలాంటి సందర్భాల్లో ఈ వ్యవస్థ ముందుగానే స్పందించి బైక్‌ను నియంత్రించగలదు. ప్రస్తుతం కొన్ని ప్రీమియం బైక్‌లైన BMW R 1300 GS, Ducati Multistrada V4 మోడళ్లలో ACC సిస్టమ్ అందుబాటులో ఉంది. అయితే వాటిలో అత్యవసర పరిస్థితుల్లో రైడర్ స్వయంగా బ్రేక్ వేయాల్సి ఉంటుంది. యమహా కొత్త టెక్నాలజీ మాత్రం అవసరమైతే పూర్తిగా ఆటోమేటిక్‌గా బ్రేకింగ్ చేయగలదని చెబుతోంది. ఈ టెక్నాలజీ ఉత్పత్తి దశకు చేరుకుంటే భవిష్యత్తులో బైక్ రైడింగ్ మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
Latest Videos
Related Stories
Recommended image1
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Recommended image2
Folk Song: వెండి తెర‌పై యూట్యూబ్ సెన్సేష‌న్‌.. ఫోక్ సాంగ్స్‌తో మెప్పించి, ఇప్పుడు సినిమాల్లో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved