- Home
- Automobile
- Tata Tiago EV : ఈ కారుపై డిస్కౌంటే రూ.1,65,000 .. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సొంతం చేసుకొండి
Tata Tiago EV : ఈ కారుపై డిస్కౌంటే రూ.1,65,000 .. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సొంతం చేసుకొండి
Tata Tiago EV : మీరు కొత్త కారు కొనాలనుకుంటే ఇదే మంచి సమయం. ఇయర్ ఎండ్ లో కార్లపై భారీ డిస్కౌంట్ ఇస్తుంటాయి కంపెనీలు. ఇలా టాటా టియాగో ఈవీ కారు ప్రస్తుతం భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

టాటా టియాగో ఈవిపై భారీ డిస్కౌంట్...ఎంతో తెలుసా?
Tata Tiago EV : టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ లైనప్‌లో టియాగో ఈవీ అత్యంత చౌకైన కారు. ప్రస్తుతం ఇయర్ ఎండ్ డిస్కౌంట్ కారణంగా డిసెంబర్ 2025 లో ఈ ఎలక్ట్రిక్ కారును ఇంకా తక్కువ ధరకే కొనొచ్చు. టియాగో ఈవీ MR, LR వేరియంట్లను రూ. 1.65 లక్షల వరకు మొత్తం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చు. ఇందులో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, లాయల్టీ స్కీమ్ ఉన్నాయి.
టాటా టియాగో ఈవి ధర?
టాటా టియాగో ఈవీ నాలుగు వేరియంట్ల ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల వరకు ఉన్నాయి. అన్ని వేరియంట్లపై డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అంటే ఈ కారును ఈ నెలలో (డిసెంబర్ 2025) కేవలం రూ. 6.49 లక్షలకే కొనొచ్చు.
టాటా టియాగో మైలేజ్ ఎంత?
ఫాస్ట్ ఛార్జర్‌తో 58 నిమిషాల్లో ఇది పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అదే సమయంలో ఒక్క ఛార్జ్‌తో 275 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. టియాగో ఈవీ XE, XT, XZ+, XZ+ Lux అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. టీల్ బ్లూ, డేటోనా గ్రే, ట్రాపికల్ మిస్ట్, ప్రిస్టైన్ వైట్, మిడ్‌నైట్ ప్లమ్ ఐదు కలర్ ఆప్షన్ల నుంచి కస్టమర్లు ఎంచుకోవచ్చు.
ఈ మోడల్‌లో కంపెనీ కొన్ని అప్‌డేట్‌లు చేసింది. సాధారణ క్రోమ్ టాటా లోగో ఇప్పుడు లేదు. దాని స్థానంలో కొత్త 2D టాటా లోగోను అమర్చారు. ఇది ఫ్రంట్ గ్రిల్, టెయిల్‌గేట్, స్టీరింగ్ వీల్‌పై కూడా కనిపిస్తుంది.
టియాగో ఫీచర్స్ అప్ డేట్స్
2024లో అప్‌డేట్ అయిన టాటా టియాగో ఈవీ ఇప్పుడు ఆటో-డిమ్మింగ్ IRVMను కూడా పొందుతుంది. ఈ ఫీచర్ టాప్-స్పెక్ 'XZ+ టెక్ లక్స్' వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అప్‌డేట్ చేశారు. ఇది ఇప్పుడు XZ+ నుంచి అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
టియాగో ఈవీ ఫీచర్లు
టియాగో ఈవీ అన్ని వేరియంట్లు ఇప్పుడు కొత్త గేర్ సెలెక్టర్ నాబ్‌తో వస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను 15A సాకెట్‌తో కూడా ఛార్జ్ చేయవచ్చు.టియాగో ఎలక్ట్రిక్ కారులో రెండు డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఈవీ 5.7 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
ఇందులో 8-స్పీకర్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఎలక్ట్రిక్ ORVMలు, ఇంకా అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.
టియాగో బ్యాటరీపై 8 ఏళ్ల వ్యారంటీ
టాటా కంపెనీ ప్రకారం… టియాగో ఈవీ భారతదేశంలో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ, మోటార్లపై కస్టమర్లకు ఎనిమిది సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది టాటా. ఈ ఎలక్ట్రిక్ కారు అసలు రేంజ్ 275 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
గమనిక: పైన వివరించిన డిస్కౌంట్లు వివిధ ప్లాట్‌ఫారమ్‌ల సహాయంతో కార్లపై అందుబాటులో ఉన్నవి. పైన చెప్పిన డిస్కౌంట్లు దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు, నగరాలు, డీలర్‌షిప్‌లు, స్టాక్, రంగు, వేరియంట్‌ను బట్టి మారవచ్చు. అంటే ఈ డిస్కౌంట్ మీ నగరంలో లేదా డీలర్‌షిప్‌లో ఎక్కువ లేదా తక్కువగా ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో కారు కొనే ముందు, కచ్చితమైన డిస్కౌంట్ వివరాలు, ఇతర సమాచారం కోసం మీ సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించండి.

