Maruti Suzuki ఇయర్ ఎండ్ డిస్కౌంట్.. ఈ కార్లపై ఇంత తగ్గింపా..! తెలిస్తే మీరూ కొంటారు
Maruti Suzuki : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మాారుతి సుజుకి ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ ప్రకటించింది. దీంతో ఈ డిసెంబర్ లో ఈ కార్ల ధరలు భారీగా తగ్గాయి… కాబట్టి మీరు కొత్తకారు కొనాలనుకుంటే ఇదే మంచి సమయం.

కొత్త కారు కొనేందుకు ఇదే సరైన సమయం
మారుతి సుజుకి తన అరీనా షోరూమ్ మోడళ్లపై డిసెంబర్ 2025 ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. ఇయర్ ఎండ్ సందర్భంగా వివిధ రూపాల్లో ఈ ఆఫర్లను అమలుచేస్తోంది. కాబట్టి కొత్త కారు కొనడానికి లేదా పాతది మార్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఆఫర్లు నగరాలు, స్టాక్‌ను బట్టి మారవచ్చు.
మారుతి సుజుకి డిస్కౌంట్
మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్‌పై డిసెంబర్‌లో గరిష్ఠంగా రూ.58,100 వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్/స్క్రాప్ బోనస్, అదనపు ఆఫర్లు ఉన్నాయి..
మారుతి స్విప్ట్ ధర
మారుతి స్విఫ్ట్ పెట్రోల్, ఇతర మోడళ్లపై రూ.55,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో ఎంట్రీ-లెవల్ మోడళ్లపై రూ.52,500 వరకు ప్రయోజనం పొందవచ్చు. తక్కువ ధరతో ఇవి అందుబాటులో ఉన్నాయి.
మారుతి సెలేరియో, ఈకో ధర
ఈకో, సెలెరియో మోడళ్లపై డిసెంబర్‌లో రూ.52,500 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ప్రముఖ చిన్న SUV బ్రెజ్జాపై రూ.40,000 వరకు తగ్గింపు ప్రకటించారు. ఇందులో నగదు తగ్గింపు, స్క్రాప్ బోనస్ కూడా ఉన్నాయి.
మారుతి డిజైర్
అత్యధికంగా అమ్ముడయ్యే సెడాన్ డిజైర్‌పై రూ.12,500 వరకు డీలర్ లెవల్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇటీవల ఈ మోడల్ ఇండియన్ NCAP టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. మారుతి ఎర్టిగాపై రూ.10,000 వరకు నగదు తగ్గింపు ఉంది.

