తక్కువ ధర, ఎక్కువ మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లతో చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారు
తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, మంచి ఫీచర్లతో కారు తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మారుతి సుజుకి బాలెనో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. విశాలమైన క్యాబిన్, 6 ఎయిర్ బ్యాగ్ లు, అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్న ఈ కారు గురించి మరిన్ని వివరాలు మీకోసం…

మారుతి బాలెనో 2025
మారుతి సుజుకి బాలెనో 2025 అద్భుతమైన ఫ్యామిలీ కారు అని చెప్పొచ్చు. విశాలమైన క్యాబిన్, అద్భుతమైన మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. చిన్న కుటుంబం కోసం తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కారు తీసుకోవాలి అనుకునే వారికి మారుతి సుజుకి బాలెనో 2025 ఉత్తమ ఎంపిక అని చెప్పొచ్చు. ఈ కారులో ఐదుగురు సౌకర్యంగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు.
ధర ఎంతంటే..
మారుతి బాలెనో ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి మొదలవుతుంది. జీఎస్టీ ప్రయోజనాల వల్ల ఈ కారు ధర తగ్గింది. సీఎన్‌జీ వేరియంట్ అన్ని హ్యాచ్‌బ్యాక్‌లలో ఉత్తమమైంది. సేఫ్టీ, కంఫర్ట్ తో కస్టమర్లను ఆకట్టుకునేలా రూపొందిన ఈ కారు మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
మైలేజ్ ఎంతంటే?
మారుతి సుజుకి బాలెనో 2025.. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 22.35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. CNG వేరియంట్ 30.61 కిమీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారును యువత, చిన్న కుటుంబాలు, రోజూవారి ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా డిజైన్ చేశారు.
భద్రతా ఫీచర్లు
బాలెనో 2025 భద్రతా ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, 360° కెమెరా, 9 అంగుళాల టచ్‌స్క్రీన్, HUD వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
మారుతి సుజుకి బాలెనో 9 వేరియంట్లలో వస్తుంది. సిగ్మా, డెల్టా, డెల్టా AMT, డెల్టా CNG, జీటా, జీటా AMT, జీటా CNG, ఆల్ఫా, ఆల్ఫా AMT. వీటిలో కొన్ని పెట్రోల్ ఇంజిన్‌తో, మరికొన్ని CNG కిట్‌తో అందుబాటులో ఉన్నాయి. వేరియంట్ ని బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.

