- Home
- Automobile
- Cars
- Maruti Suzuki S Presso: నెలకు రూ. 6,500 కడితే చాలు.. రూ. 3.5 లక్షలకే కొత్త కారు మీ సొంతం
Maruti Suzuki S Presso: నెలకు రూ. 6,500 కడితే చాలు.. రూ. 3.5 లక్షలకే కొత్త కారు మీ సొంతం
Maruti Suzuki S Presso: ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గానికే పరిమితమైన కారు కలను ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా సాకారం చేసుకుంటున్నారు. బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు లోన్స్ అందిస్తున్నాయి. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న అలాంటి

బడ్జెట్ సెగ్మెంట్‌లో కొత్త ప్రత్యామ్నాయం
భారత మార్కెట్లో తక్కువ ఖర్చుతో కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఆల్టో K10 ఇప్పటికే తక్కువ ధరతో ప్రజాదరణ పొందింది. అయితే దానికంటే కూడా తక్కువ ధరకు లభిస్తున్న మోడల్ ఎస్-ప్రెస్సో. ప్రారంభ ధర కేవలం రూ.3.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతో ఇది దేశంలో అత్యల్ప ధరలో లభించే 5-సీట్ల కార్లలో ఒకటిగా నిలిచింది.
బడ్జెట్‌కు తగ్గ ఎంపిక
మారుతి ఆల్టో ప్రారంభ ధర రూ.3.69 లక్షలు. అదే సమయంలో ఎస్-ప్రెస్సో ధర రూ.3.49 లక్షలు. అంటే దాదాపు రూ.20,000 తక్కువ. ఈ మోడల్ 7 రంగుల్లో లభిస్తుంది. 49 kW శక్తి ఇచ్చే డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT ఇంజిన్ ఈ కారుకు ప్రత్యేకత. 5-స్పీడ్ మాన్యువల్ లేదా AGS ఆప్షన్ అందుబాటులో ఉంది. టాప్-ఎండ్ మోడల్ ధర రూ.5.25 లక్షలు.
సెక్యూరిటీ ఫీచర్లు
ఎస్-ప్రెస్సోలో ABSతో కూడిన EBD సిస్టమ్ అందుబాటులో ఉంది. ముందు సీటు భాగంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో రక్షణ మరింత మెరుగైంది. హిల్ హోల్డ్ అసిస్ట్ తో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి సౌకర్యాలు నగర ప్రయాణాల్లో సహాయకారిగా ఉంటాయి. AGS టెక్నాలజీతో గేర్ మార్పు సులభంగా జరుగుతుంది. మొత్తం ఎనిమిది వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ కార్లకు మంచి పోటీనిస్తుంది
ఈ సెగ్మెంట్‌లో ప్రధాన పోటీ ఆల్టో K10. రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ధర రూ.4.30 లక్షలు. టాటా టియాగో కొంత ఖరీదైన ఎంపిక అయినా 5 లక్షల బడ్జెట్‌లో మంచి ఫీచర్లు అందిస్తుంది. ఎస్-ప్రెస్సో మాత్రం తక్కువ ధరలో లభించడం వల్ల ఎక్కువ మంది మొదటి కారు కొనుగోలుదారులకు సరిపోయే మోడల్‌గా నిలుస్తోంది.
ఒక లక్ష డౌన్ పేమెంట్‌తో EMI లెక్క
ఈ కారును కొనుగోలు చేయాలంటే చిన్న డౌన్ పేమెంట్‌తోనూ ఈ కారు అందుబాటులోకి వస్తుంది.
డౌన్ పేమెంట్: రూ. 1 లక్ష
మిగతా మొత్తం: ఫైనాన్స్‌లో తీసుకుంటే..
కాలం: 5 సంవత్సరాలు
నెలకు చెల్లించాల్సిన EMI: సుమారు రూ. 6,500

