- Home
- Automobile
- Budget Cars : మీకు రూ.20 వేల శాలరీయే వస్తుందా..? ఏం పర్వాలేదు, ఈ బడ్జెట్‌కు సరిపోయే బెస్ట్ కార్లు ఇవే
Budget Cars : మీకు రూ.20 వేల శాలరీయే వస్తుందా..? ఏం పర్వాలేదు, ఈ బడ్జెట్‌కు సరిపోయే బెస్ట్ కార్లు ఇవే
Best Affordable Maruti Cars : ప్రస్తుతం ఓ నలుగురు కుటుంబసభ్యులుండే సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీకి కూడా కారు కంపల్సరీ అయ్యింది. ఈ క్రమంలో నెలకు రూ.20,000 జీతం వచ్చేవారు కూడా మెయింటెన్ చేయగలిగే మారుతి కార్ల గుర్తించి తెలుసుకుందాం...

మారుతి ఎస్ ప్రెస్సో (Maruti S-Presso)
తక్కువ బడ్జెట్‌లో కొంచెం ఎత్తుగా, SUV లుక్‌తో కారు కావాలనుకుంటే ఎస్-ప్రెస్సో బెస్ట్ ఆప్షన్. దీని గ్రౌండ్ క్లియరెన్స్ బాగుండటంతో పాడైన రోడ్లు, గుంతలను ఈజీగా తట్టుకుంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.3.50 లక్షల నుంచి రూ.5.25 లక్షల మధ్య ఉంటుంది. పెట్రోల్‌పై లీటర్‌కు 21.4 కి.మీ, సీఎన్‌జీపై కిలోకు 32.7 కి.మీ మైలేజ్ ఇస్తుంది. మీరు సుమారు రూ.1 లక్ష డౌన్‌పేమెంట్ చేస్తే, నెలవారీ EMI సుమారు రూ.5,500 నుంచి రూ.6,500 మధ్య ఉంటుంది. దీన్ని రూ.20000 జీతం కలిగినవారు కూడా చాలా తేలికగా మేనేజ్ చేయొచ్చు.

మారుతి ఆల్టో కె-10 (Maruti Alto K-10)
భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కారు ఆల్టో. కొత్త కె10 మోడల్‌లో ఎక్కువ స్పేస్, మంచి లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్ ఉన్నాయి. సిటీ ట్రాఫిక్, ఇరుకైన సందులకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల మధ్య ఉంది. పెట్రోల్‌పై లీటర్‌కు 24.4 కి.మీ, సీఎన్‌జీపై కిలోకు 33.9 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని బేస్ మోడల్ కోసం మీరు నెలకు కేవలం రూ.6,000 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి మీ జేబుపై పెద్దగా భారం పడదు.
మారుతి సెలెరియో (Maruti Celerio)
మీరు రోజూ ఎక్కువగా తిరుగుతూ పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే మారుతి సెలెరియో మంచి ఆప్షన్. ప్రతి పెట్రోల్ చుక్కకు పూర్తి విలువను ఇచ్చే కారు ఇది. దీని క్యాబిన్ చాలా మోడ్రన్‌గా, చూడటానికి స్టైలిష్‌గా ఉంటుంది.
సెలెరియో ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.73 లక్షల మధ్య ఉంది. పెట్రోల్‌పై లీటర్‌కు 25.0 కి.మీ, సీఎన్‌జీపై కిలోకు 34.4 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని బేస్ వేరియంట్‌కు నెలవారి ఈఎంఐ సుమారు రూ.7,500 వరకు ఉండొచ్చు. రూ.20,000 జీతంలో కొంచెం ఖర్చు తగ్గించుకుంటే ఇది ఒక మంచి డీల్ అవుతుంది.
మారుతి వ్యాగనార్ (Maruti WagonR)
మారుతి వ్యాగనార్ ను భారతదేశపు 'టాల్-బాయ్' కారు అని పిలుస్తారు. ఇందులో హెడ్‌రూమ్ (తలపైన ఖాళీ), లెగ్‌రూమ్ (కాళ్ల దగ్గర ఖాళీ) చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే 5 మంది ఉన్న కుటుంబం చాలా సౌకర్యంగా ప్రయాణించవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.84 లక్షల మధ్య ఉంది. పెట్రోల్‌పై లీటర్‌కు 20.5 కి.మీ, సీఎన్‌జీపై కిలోకు 33.5 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
వ్యాగనార్ బేస్ వేరియంట్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ సుమారు రూ.7,800 నుంచి రూ.8,200 మధ్య రావచ్చు. మీ శాలరీ రూ.30 వేల లోపు ఉన్నా లేదంటే ఇంట్లో మరో సైడ్ ఇన్‌కమ్ ఉన్నా ఆలోచించకుండా ఈ కారును ఎంచుకోవచ్చు.
హెచ్చరిక
ఫైనాన్స్ నిపుణుల ప్రకారం మీ నెల జీతంలో సగం కంటే ఎక్కువగా కారు ఈఎంఐ ఉండకూడదు. మీరు 5 లేదా 7 ఏళ్ల లోన్ తీసుకుంటే మీ నెలవారీ ఈఎంఐ రూ.6,000 నుంచి రూ.7,500 మధ్య ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీకు నెలకు రూ.20,000 శాలరీ వచ్చినా కారు ఈఎంఐ పోను మిగిలిన రూ.13,000-రూ.14,000 మీ ఇంటి ఖర్చులు, ఇతర అవసరాలకు సరిపోతాయి. అందుకే కారు ఈఎంఐ మీ జీతంలో 30-40 శాతం మించకుండా చూసుకోవడం ఉత్తమం.
గమనిక…
ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన మారుతి సుజుకి కార్ల ధరలు (ఎక్స్-షోరూమ్), మైలేజ్ వివరాలు కంపెనీ అధికారిక డేటాపై ఆధారపడి ఉంటాయి. ఆన్-రోడ్ ధరలు మీ నగరం, రాష్ట్రం, ఆర్‌టీఓ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం మారవచ్చు. లోన్ నెలవారీ ఈఎంఐ మీరు చెల్లించే డౌన్‌పేమెంట్, బ్యాంకు వడ్డీ రేట్లు, లోన్ కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా తుది నిర్ణయం తీసుకునే ముందు, మీ సమీపంలోని అధీకృత డీలర్‌ను సంప్రదించి, తాజా ధరలు, ఆఫర్లను నిర్ధారించుకోండి.

