MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. భారత్‌లో అత్యంత చౌకైన 5 CNG కార్లు ఇవే

తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. భారత్‌లో అత్యంత చౌకైన 5 CNG కార్లు ఇవే

Budget CNG Cars: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది కార్ కొనుగోలుదారులు ఇప్పుడు CNG వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV విభాగాల్లో పలు బడ్జెట్ CNG కార్లు అందుబాటులో ఉన్నాయి.   

2 Min read
Author : Narender Vaitla
Published : May 24 2026, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మారుతి సుజుకి ఎస్‌ ప్రెస్సో సీఎన్‌జీ
Image Credit : Gemini AI

మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సో సీఎన్‌జీ

బడ్జెట్ CNG కార్ల జాబితాలో మొదటి స్థానంలో మారుతి సుజుకి S-Presso CNG ఉంది. ఈ కారు ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.62 లక్షలు. ఇందులో 1.0 లీటర్ ఇంజిన్ ఉండగా, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందించారు. CNG మోడ్‌లో ఈ కారు 57 PS పవర్, 82.1 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం ఇది కిలో CNGకు 32.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. నగర ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు ఇది మంచి ఎంపికగా భావిస్తున్నారు. ఇదే ధర పరిధిలో మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్‌జీ కూడా అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.4.82 లక్షలు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
మారుతి సుజుకి వాగ‌నార్ సీఎన్‌జీ
Image Credit : Maruti cars

మారుతి సుజుకి వాగ‌నార్ సీఎన్‌జీ

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ కార్లలో వాగ‌నార్ ఒక‌టి. వాగ‌నార్ సీఎన్‌జీ వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.89 లక్షలు. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్-CNG ఇంజిన్ ఉంది. ఇది 57 hp పవర్, 82.1 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారు కిలో CNGకు 34.05 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

Related Articles

Related image1
మామిడి పండు తినడానికి సరైన సమయం ఏంటి.? తినే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
Related image2
IVF విధానంలో పుట్టబోయే బిడ్డ లింగాన్ని ముందే తెలుసుకోవచ్చా? నిబంధనలు ఏమంటున్నాయి?
36
టాటా టియాగో CNG
Image Credit : X

టాటా టియాగో CNG

మారుతి కార్లకు ప్రత్యామ్నాయం కోరేవారికి టాటా టియాగో CNG మంచి ఎంపికగా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.49 లక్షలు. టియాగోలో 1.2 లీటర్ పెట్రోల్-CNG ఇంజిన్ అందించారు. CNG మోడ్‌లో ఇది 73 hp పవర్, 95 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా లభిస్తుంది. ఈ విభాగంలో ఇది అరుదుగా కనిపించే ఫీచర్. కంపెనీ ప్రకారం టియాగో CNG మైలేజ్ 26.49 కిమీ/కిలో.

46
మారుతి సుజుకి డిజైర్ CNG
Image Credit : stockPhoto

మారుతి సుజుకి డిజైర్ CNG

హ్యాచ్‌బ్యాక్ కంటే సెడాన్ కారును ఇష్టపడే వారికి మారుతి సుజుకి డిజైర్ CNG మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.8.03 లక్షలు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండగా, CNG మోడ్‌లో 70 PS పవర్, 102 Nm టార్క్ అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారు కిలో CNGకు 33.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. దీంతో దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే సెడాన్ కార్లలో ఇది ఒకటిగా నిలిచింది.

56
టాటా పంచ్ CNG
Image Credit : Tatamotors

టాటా పంచ్ CNG

తక్కువ బడ్జెట్‌లో CNG SUV కొనాలనుకునేవారికి టాటా పంచ్ CNG మంచి ఎంపిక. ఈ SUV ప్రారంభ ధర రూ.6.74 లక్షలు. ఇందులో 1.2 లీటర్ Revotron iCNG ఇంజిన్ ఉంది. CNG మోడ్‌లో ఇది 73.3 hp పవర్, 103 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఎంపికలు రెండూ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు మైలేజ్ సుమారు 26.99 కిమీ/కిలోగా కంపెనీ పేర్కొంది. టాటా పంచ్ CNGలో డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణ. ఈ సాంకేతికత వల్ల CNG సిలిండర్లు అమర్చిన తర్వాత కూడా బూట్ స్పేస్ ఎక్కువ భాగం వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

66
CNG కార్లు ఎందుకు మంచి ఎంపిక?
Image Credit : meta ai

CNG కార్లు ఎందుకు మంచి ఎంపిక?

ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో CNG కార్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణ దూరం అందిస్తున్నాయి. పెట్రోల్ కార్లతో పోలిస్తే రన్నింగ్ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, కుటుంబ వినియోగదారులకు ఇవి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి. తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి మైలేజ్, పర్యావరణానికి తక్కువ కాలుష్యం కలిగించడం వంటి కారణాలతో CNG కార్ల ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Driving Tips: వేస‌విలో బ్రేక్ ఫెయిల్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయా.? కార‌ణం ఏంటి.?
Recommended image2
Best EV in India : తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. టాప్ 5 బెస్ట్ ఈవీ కార్లు ఇవే
Recommended image3
Old Car: మీరు కారు కొని ఎన్నేళ్లయింది.? ఈ ప‌ని చేయ‌క‌పోతే భారీ జరిమానా త‌ప్ప‌దు
Related Stories
Recommended image1
మామిడి పండు తినడానికి సరైన సమయం ఏంటి.? తినే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
Recommended image2
IVF విధానంలో పుట్టబోయే బిడ్డ లింగాన్ని ముందే తెలుసుకోవచ్చా? నిబంధనలు ఏమంటున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved