Honda Activa : ఒక్క నెలలో 262689 అమ్మకాలా..! ఆ స్కూటర్ ఏదో తెలుసా?
గత నెలలో (నవంబర్ 2025) ఓ స్కూటర్ అమ్మకాలు అత్యధికంగా జరిగాయి. ఏకంగా 2,62,689 యూనిట్లు అమ్ముడై భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా రికార్డు సృష్టించింది. అదేదో తెలుసా?

ఈ స్కూటర్ అదుర్స్
Honda Activa : భారత స్కూటర్ మార్కెట్‌లో హోండా యాక్టివాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సంవత్సరాలు గడిచినా దాని పాపులారిటీ తగ్గకుండా కొనసాగుతోంది. దీనికి తాజా ఉదాహరణగా 2025 నవంబర్ నెల అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి. ఆ నెలలో మాత్రమే 2,62,689 యూనిట్లు అమ్ముడై, దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా యాక్టివా మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఇదే సమయంలో 2,06,844 యూనిట్లు అమ్ముడవగా ఈ ఏడాది 27 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.
2025 లో ఈ స్కూటర్ దే రికార్డు...
ఈ అమ్మకాల రికార్డుతో టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి పోటీ స్కూటర్లను హోండా యాక్టివా వెనక్కి నెట్టింది. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా యాక్టివాపై ఉన్న నమ్మకం ఈ అమ్మకాల వృద్ధికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది. తక్కువ నిర్వహణ ఖర్చు, దీర్ఘకాలిక విశ్వసనీయత దీని బలాలుగా ఉన్నాయి.
హోండా యాక్టివా ఫీచర్లు
పవర్‌ట్రెయిన్ ఫీచర్లను చూస్తే హోండా యాక్టివాలో 109.51 సీసీ సామర్థ్యం గల సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ మంచి మైలేజీని, సున్నితమైన పనితీరును అందిస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఇంజిన్ స్టాప్-స్టార్ట్ ఫీచర్ వంటివి నగర ట్రాఫిక్‌లో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.
అదిరిపోయే డిజైన్
డిజైన్ పరంగా యాక్టివా ఒక సింపుల్ కానీ ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ముందువైపు క్రోమ్ అలంకరణ, సిగ్నేచర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త బాడీ గ్రాఫిక్స్ దీని రూపాన్ని ఆకర్షణీయంగా మారుస్తాయి. వెడల్పైన ఫ్లోర్‌బోర్డ్, సౌకర్యవంతమైన సీటు, పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ రోజువారీ వినియోగానికి చాలా సహాయపడతాయి. కొత్త వేరియంట్లలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
హోండా యాక్టివా ధర ఎంత?
ధర వివరాల్లోకి వెళ్తే హోండా యాక్టివా భారత మార్కెట్లో ఒక విలువైన స్కూటర్‌గా నిలుస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹76,000 నుండి ₹82,000 వరకు ఉంటుంది. బలమైన బ్రాండ్ విలువ, తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి రీసేల్ విలువ వంటి కారణాల వల్ల, హోండా యాక్టివా భారతీయుల నమ్మకమైన స్కూటర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

