- Home
- Automobile
- Honda bikes price drop : యాక్టివా స్కూటర్ నుండి షైన్ బైక్ వరకు... రూ.18,000 వరకు ధర తగ్గే టూవీలర్స్ ఇవే
Honda bikes price drop : యాక్టివా స్కూటర్ నుండి షైన్ బైక్ వరకు... రూ.18,000 వరకు ధర తగ్గే టూవీలర్స్ ఇవే
Honda bikes price drop : జిఎస్టి మార్పులు ఆటోమొబైల్ రంగంలో ముందుగానే పండగను తీసుకువచ్చింది. ముఖ్యంగా సామాన్య మద్యతరగతి ప్రజలు ఉపయోగించే ద్విచక్రవాహనాల ధరలు అమాంతం తగ్గుతున్నాయి. ఇలా హోండా కంపెనీకి చెందిన వాహనాల ధరలు ఎంతలా తగ్గుతున్నాయో తెలుసా?

తగ్గిన టూవీలర్ ధరలు
Honda bikes price drop : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన జిఎస్టి (వస్తు, సేవల పన్ను) మార్పులు అనేక రంగాలపై ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని రంగాలపై పాజిటివ్, మరికొన్ని రంగాలపై నెగెటివ్ ప్రభావం చూపించింది... అయితే ఏరంగం పరిస్థితి ఎలా ఉన్నా ఇండియన్ ఆటోమొబైల్ రంగానికి మాత్రం ఈ జిఎస్టి మార్పులు ముందే పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. జిఎస్టి శ్లాబుల్లో మార్పులతో కొన్ని వాహనాల ధరలు అమాంతం దిగివచ్చాయి.
GST ఎఫెక్ట్... హోండా టూవీలర్ ధరలు దిగివచ్చాయి
సాధారణంగా దసరా, దీపావళి సమయంలో వాహనాల ధరలు భారీగా తగ్గుతాయి... వినియోగదారులు ఈ సమయంలోనే వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు కాబట్టి కంపెనీలు కూడా ఆఫర్లు పెడతాయి. కానీ ఇప్పుడు జిఎస్టి పుణ్యమా అని ఆఫర్లతో పనిలేకుండానే వాహనాల ధరలు తగ్గుతున్నాయి... ఇలా కాస్త ముందుగానే పండగ వాతావరణం నెలకొంది. జిఎస్టి మార్పులతో హోండా కంపెనీకి చెందిన ప్రముఖ బైక్స్, స్కూటర్ల ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. ఇలా ఏ వెహికిల్ ధర ఎంత తగ్గుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
హోండా టూవీలర్స్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
ఇటీవల జీఎస్టి కౌన్సిల్ సమావేశంలో 350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలపై పన్నులు తగ్గించారు. గతంలో ఇలాంటి వాహనాలపై 28 శాతం జిఎస్టి ఉండగా దాన్ని 18 శాతానికి తగ్గించారు. దీంతో ఈ కేటగిరీలోని బైక్స్, స్కూటర్ ధరలు బాగా తగ్గాయి. ఈ జపనీస్ కంపెనీ జిఎస్టి తగ్గింపు ప్రయోజనాలను నేరుగా తమ వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది... దీంతో ఈ కంపెనీకి చెందిన ప్రముఖ మోడల్స్ ధరలు గరిష్టంగా రూ.18,887 వరకు తగ్గాయి. ఇలా ధరలు తగ్గిన వాహనాల్లో హోండా షైన్ 125, యాక్టివా, యూనికార్న్ వంటి ప్రముఖ వాహనాలున్నాయి.
హోండా కంపెనీ మోడల్స్ వారిగా ధరల తగ్గింపు
1. హోండా యాక్టివా 110 (Honda Activa 110) :
ఈ స్కూటర్ కు భారతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. జిఎస్టి తగ్గింపుతో యాక్టివా స్కూటీ ధర కూడా తగ్గింది... ఎక్స్ షోరూం డిల్లీలో దీని ధర రూ.7,874 తగ్గింది.
2. హోండా షైన్ 125 ( Honda Shine 125) :
ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో హోండా షైన్ ఓ సంచలనం అని చెప్పాలి. స్ప్లెండర్, పల్సర్ వంటి బైక్స్ కి ఇది గట్టిపోటీ ఇస్తోంది. దీని ధర కూడా జిఎస్టి మార్పుల తర్వాత దాదాపు రూ.7443 తగ్గుతోంది.
3. హోండా డియో 110 (Honda Dio 110) :
హోండా డియో 110 కూడా బారతీయులకు బాగా చేరువయ్యింది. ఈ స్కూటీ ధర కూడా రూ.7,157 తగ్గింది.
4. హోండా యాక్టివా 125 (Honda Activa 125)
హోండా కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ యాక్టివా.. దీని ధర కూడా తగ్గింది. హోండా యాక్టివా 125 రూ.8,259 వరకు తగ్గింపు ధరలతో లభించే అవకాశాలున్నాయి.
5. హోండా డియో 125 (Honda Dio 125)
హోండా డియో 125 ధర రూ. 8,042 వరకు తగ్గింది.
6. హోండా షైన్ 100 (Honda Shine 100) : రూ.5,672 వరకు తగ్గింపు
7. హోండా షైన్ 100 DX (Honda Shine 100 DX) : రూ. 6,256 వరకు తగ్గింపు
7. హోండా లివ్ 110 (Honda Livo 110) : రూ.7,165 వరకు తగ్గింపు
8. హోండా ఎస్పి125 (Honda SP125) : రూ.8,447 వరకు తగ్గింపు
9. హోండా సిబి125 హార్నెట్ (Honda CB125 Hornet) : రూ.9,229 వరకు తగ్గింపు
10. హోండా యూనికార్న్ (Honda Unicorn) : రూ.9,948 వరకు తగ్గింపు
11. హోండా ఎస్పి160 (Honda SP160) : రూ.10,6365 వరకు తగ్గింపు
12. హోండా హార్నెట్ 2.0 (Honda Hornet 2.0) : రూ.13,026 వరకు తగ్గింపు
13. హోండా ఎన్ఎక్స్200 (Honda NX200) : రూ.13,978 వరకు తగ్గింపు
14. హోండా సిబి 350ఆర్ఎస్ (Honda CB350RS) : రూ.18,857 వరకు తగ్గింపు
15. హోండా సిబి350 (Honda CB350) : రూ.18,887 వరకు తగ్గింపు
ఈ హోండా బైక్స్ ధరలు పెరుగుతాయా?
అయితే జిఎస్టి మార్పులతో హోడా కంపెనీకి చెందిన 350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల వాహనాల ధరలు తగ్గుతున్నాయి… కానీ ఇదే సమయంలో 350cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల ప్రీమియమ్ వాహనాల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. 350cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యంగల ప్రీమియం టూవీలర్స్ పై జిఎస్టిని 31శాతం నుండి 40 శాతానికి పెంచారు. ఈ క్రమంలోనే హోండా కంపెనీకి చెందిన కొన్ని వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది... దీనిపై హోండా నుండి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.