Honda Activa 7G: సిటీ అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్ హోండా ఆక్టివా 7G: ఫీచర్స్ ఎంత బాగున్నాయో
Honda Activa 7G: మహిళలకు ఫస్ట్ అండ్ బెస్ట్ సెలెక్షన్ గా హోండా యాక్టివా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు కొత్త హోండా యాక్టివా 7జీ మార్కెట్ లోకి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. హోండా కంపెనీ కూడా సిటీ అమ్మాయిలను ఆకట్టుకొనే విధంగా 7జీ సిద్ధం చేసిందని సమాచారం. మరి హోండా యాక్టివా 7జీ ఫీచర్స్, మార్కెట్ లోకి ఎప్పుడొస్తుంది? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం రండి.

2000 సంవత్సరంలో హోండా ఆక్టివా భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇది ఒక ద్విచక్ర వాహనంగా మాత్రమే కాకుండా మధ్య తరగతి ప్రజల బెస్ట్ వెహికల్ గా మారిపోయింది. బైక్ నడపలేని వారి ఫస్ట్ చాయిస్ కూడా హోండా యాక్టివానే. ఎందుకంటే నడపానికి చాలా ఈజీగా ఉండే ఈ వెహికల్ ఎవరైనా నడపచ్చు.
ఇప్పుడు హోండా యాక్టివా 7జీ మార్కెట్ లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఆటోమొబైల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోటీ కంపెనీల పోటీని తట్టుకొనేలా హోండా కంపెనీ 7జీ స్కూటర్ ని సిద్ధం చేస్తోంది.
హోండా యాక్టివా 7జీ డిజైన్
యాక్టివా 7G కూడా దాని పాత బెస్ట్ డిజైన్ లోనే ఉంది. అందరికీ నచ్చిన దాని పాత రూపాన్ని మార్చకుండా లేటెస్ట్ అప్డేషన్ పొందింది. యాక్టివా 7జీలో LED హెడ్‌ల్యాంప్ క్లస్టర్ అమర్చారు. ఇది పాత దాని కన్నా రెట్టింపు కాంతిని అందిస్తుంది. క్రోమ్, సైడ్ ప్రొఫైల్, క్లీన్, అన్‌క్లట్టర్డ్ లైన్ వంటి ప్రత్యేక డిజైన్ ని కలిగి ఉంది.
సీట్ డిజైన్ స్లిమ్ గా ఉంటుంది. బూట్ స్పేస్ చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఎత్తుపల్లాల్లో రైడర్‌లు తమ పాదాలను నేలపై ఉంచడానికి వీలుగా ఈ డిజైన్ ఉంది.
కలర్ విషయానికొస్తే యూత్ ను కూడా అట్రాక్ట్ చేసే విధంగా శక్తివంతమైన మెటాలిక్ ఫినిషెస్‌ను కలిగి ఉంది.
రోజువారీ ప్రయాణాల కోసం పవర్‌హౌస్ పనితీరు
ఆక్టివా 7G 110cc సింగిల్-సిలిండర్ ఇంజిన్, ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో పనిచేస్తుంది. ఈ పవర్‌ప్లాంట్ దాదాపు 7.7 హార్స్‌పవర్, 8.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణ అవసరాలకు అనుగుణంగా ఈజీగా డ్రైవ్ చేయడానికి దీన్ని తయారు చేశారు.
స్మార్ట్ పవర్ టెక్నాలజీ
ఇంజిన్ మెరుగైన స్మార్ట్ పవర్ (eSP) టెక్నాలజీని కలిగి ఉంది. ఇది బేరింగ్ డిజైన్, పిస్టన్ కూలింగ్ సిస్టమ్ వంటి భాగాల ద్వారా ఇంజిన్ పై ఎక్కువ ప్రెషర్ పడకుండా చూస్తుంది.
గేర్ వేయాల్సిన అవసరం లేని కారణంగా వేరియోమాటిక్ ట్రాన్స్‌మిషన్ అవసరమైన వేగాన్ని వెంటనే అందుకొనేలా చేస్తుంది. ఇది యాక్టివాను కొత్త రైడర్‌లకు చాలా సౌకర్యంగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా, స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో సౌకర్యవంతంగా డ్రైవ్ చేయొచ్చు.
మైలేజ్ ఎంతంటే..
ప్రామాణిక పరీక్షల్లో ఇంధన సామర్థ్యం లీటరుకు దాదాపు 60 కిలోమీటర్లు ఇచ్చిందని హోండా కంపెనీ ప్రకటించింది. కాని వినియోగదారుల అభిప్రాయం ప్రకారం రోడ్ల పరిస్థితిని బట్టి దాదాపు లీటరు 45 నుంచి 55 కి.మీ. మధ్య మైలేజ్ వస్తుందని సమాచారం. త్వరలోనే మార్కెట్ లోకి యాక్టివా 7జీ వస్తుందని తెలుస్తోంది.