MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Suzuki e-Access : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ.20,000 తగ్గింపా..!

Suzuki e-Access : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ.20,000 తగ్గింపా..!

Suzuki e-Access : జపాన్ కంపెనీ సుజుకిి ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి ఇ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకువచ్చింది. అయితే ఈ స్కూటర్ ను ఇప్పుడు ఏకంగా రూ.20,000 తగ్గింపు ధరకే కస్టమర్లకు అందిస్తోంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 26 2026, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీ తగ్గింపు ధరకే సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్...
Image Credit : Google

భారీ తగ్గింపు ధరకే సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్...

సుజుకి తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇ-యాక్సెస్ (E-Access) కొనే కస్టమర్లకు రూ.19,800 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఈ ఆఫర్లలో ఫైనాన్స్ స్కీమ్‌లు, లాయల్టీ బోనస్, ఎక్స్‌టెండెడ్ వారంటీలు ఉన్నాయి. ప్రారంభ ధర ఎక్కువగా ఉందని కొనడానికి వెనకాడుతున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.

25
సుజుకి ఇ యాక్సెస్ అసలు ధర ఎంత?
Image Credit : SUZUKI

సుజుకి ఇ యాక్సెస్ అసలు ధర ఎంత?

Suzuki E-Access ఎక్స్-షోరూమ్ ధర రూ.1.88 లక్షలు. ఈ ధర ప్రీమియం విభాగంలో ఉంది. 'మేడ్ ఇన్ ఇండియా'లో భాగంగా తయారైన ఈ మోడల్‌ను దేశీయ, ఎగుమతి మార్కెట్ల కోసం డెవలప్ చేశారు. దీన్ని తొలిసారిగా 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు.

Related Articles

Related image1
Electric scooter: ఒక్క స్మార్ట్ ఫోన్ కొనే బదులు.. ఇలాంటి 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనొచ్చు.
Related image2
Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
35
ఇ యాక్సెస్ ఫీచర్లు
Image Credit : Google

ఇ యాక్సెస్ ఫీచర్లు

ఈ స్కూటర్‌లో 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని ఉపయోగించారు. ఇది ఎక్కువ కాలం మన్నుతుందని, అధిక స్థిరత్వం కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కి.మీల రేంజ్, గంటకు 71 కి.మీ వేగం అందిస్తుంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 4.1 kW పవర్, 15 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎకో రైడ్‌తో సహా మూడు రైడ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

45
కేవలం గంటలోనే ఛార్జింగ్
Image Credit : Google

కేవలం గంటలోనే ఛార్జింగ్

సాధారణ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు... ఫుల్ ఛార్జ్‌కు 6 గంటల 42 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో కేవలం 1 గంట 12 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ అవుతుంది. ధర కాస్త ఎక్కువైనా, అదనపు ఆఫర్ల వల్ల E-Access నమ్మకమైన, దీర్ఘకాలిక పెట్టుబడిగా మారుతుంది.

55
ఇ యాక్సెస్ కొనుగోలుపై స్పెషల్ ఆఫర్
Image Credit : Google

ఇ యాక్సెస్ కొనుగోలుపై స్పెషల్ ఆఫర్

సుజుకి ఇతర కంపెనీలతో కలిసి ప్రత్యేక లోన్ స్కీమ్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ లోన్ స్కీమ్స్ ద్వారా రూ.9,800 వరకు ఆదా చేసుకోవచ్చు. వడ్డీ రేటు 5.99 శాతం నుంచి మొదలవుతుంది. ఇప్పటికే సుజుకి వాహనం ఉన్నవారు E-Access కొంటే రూ.10,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. అంటే మొత్తంగా 19,800 ఆదా అవుతుంది. కొత్త కస్టమర్లకు ₹7,000 వెల్‌కమ్ ఆఫర్ ఇస్తున్నారు. అదనంగా రూ.4,000 విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీని ఉచితంగా అందిస్తున్నారు. ఇది 7 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు వర్తిస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
భారత దేశం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sunroof Cars: ఇక స‌న్‌రూఫ్ కారు కొన‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు.. త‌క్కువ ధ‌ర‌లో ఉన్న టాప్ 5 కార్లు ఇవే
Recommended image2
BMW ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image3
Safest Cars : ఫ్యామిలీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. బెస్ట్ కార్లు ఇవే
Related Stories
Recommended image1
Electric scooter: ఒక్క స్మార్ట్ ఫోన్ కొనే బదులు.. ఇలాంటి 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనొచ్చు.
Recommended image2
Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved