- Home
- Astrology
- Zodiac signs:ఈ రాశుల వారికి లైఫ్ లో సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది, జీరో నుంచి హీరోలు అవుతారు..!
Zodiac signs:ఈ రాశుల వారికి లైఫ్ లో సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది, జీరో నుంచి హీరోలు అవుతారు..!
Zodiac signs: జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం సహజం. అయితే, తగిలిన ఎదురు దెబ్బల నుంచి కోలుకోవడం అందరి వల్లా కాదు. అయితే, జీవితంలో మొత్తం కోల్పోయినా కూడా.. తిరిగి నిలపడే శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది.

జీరో నుంచి హీరోలు అవ్వగలరు..!
1.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశిని పురాణాల్లో ఫీనిక్స్ పక్షితో పోలుస్తారు. ఫీనిక్స్ పక్షి తన బూడిద నుండే తిరిగి జన్మించినట్లుగా, వృశ్చిక రాశివారు ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, పడిపోయినా తిరిగి మళ్లీ లేస్తారు.
ఎందుకంటే... ఈ రాశివారికి పట్టుదల చాలా ఎక్కువ. ఏదైనా కోల్పోయినప్పుడు కుంగిపోకుండా, అది ఎందుకు జరిగిందో విశ్లేషించుకొని మరింత శక్తివంతంగా తిరిగి వస్తారు. జీవితం వీరికి కెరీర్ లేదా వ్యక్తిగత విషయాల్లో సెకండ్ ఛాన్స్ లభిస్తుంది. వారు దానిని సద్వినియోగం చేసుకుంటారు.
2.మకర రాశి...
మకర రాశికి అధిపతి శని దేవుడు. శని పరీక్షలు పెడతాడు. కానీ, కష్టపడే తత్వం ఉన్నవారికి అద్భుతమైన రెండో అవకాశాన్ని కూడా ఇస్తాడు.
ఎందుకంటే, వీరు చిన్న వయసులో లేదా ఏదైనా పనిని ప్రారంభించిన కొత్తలో చాలా కష్టాలు అనుభవిస్తారు. కానీ వీరి వయసు 30 ఏళ్లు దాటిన తర్వాత వీరి జీవితం మలుపు తిరుగుతుంది. ఒకసారి ఓడిపోయినా, తమ తప్పుల నుండి పాఠాలు నేర్చుకని.. మలిదశలో అద్భుతమైన విజయం సాధిస్తారు.
3.మీన రాశి..
మీన రాశివారు చాలా సున్నిత మనస్కులు. కానీ వీరికి దైవబలం, అంతర్లీనంగా ఉండే సహనం చాలా ఎక్కువ.
ఎందుకంటే... వీరు తరచుగా మోసపోవడం లేదా భావోద్వేగ పరంగా దెబ్బతినడం జరుగుతుంది. అయితే, గ్రహాల అనుకూలత వల్ల వీరికి అనుకోని విధంగా సహాయం అందుతుంది. కోల్పోయిన ప్రేమను లేదా గౌరవాన్ని తిరిగి పొందే అవకాశం వీరికి జీవితంలో ఏదో ఒక రూపంలో కల్పిస్తుంది. వచ్చిన అవకాశాన్ని కూడా వీరు బాగా సద్వినియోగం చేసుకుంటారు.
4.కన్య రాశి....
కన్య రాశివారు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా విశ్లేషిస్తారు. ఈ రాశివారికి కూడా లైఫ్ లో సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది.
ఎందుకంటే... వీరు ఒకసారి విఫలమైతే, ఆ వైఫల్యానికి గల కారణాలను సరిదిద్దుకోవడంలో సిద్ధహస్తులు. అందుకే, వీరికి సెకండ్ ఛాన్స్ దొరికినప్పుడు దానిని వంద శాతం సద్వినియోగం చేసుకుంటారు. రెండో ప్రయత్నంలో వీరు సాధించే విజయం మొదటి దానికంటే చాలా పెద్దదిగా ఉంటుంది.

