Zodiac signs: ఈ రాశుల వారు వెండి ధరించడం అస్సలు మంచిది కాదు.. ఏమవుతుందంటే.?
Zodiac signs: వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సిల్వర్ రింగ్స్, బ్రేస్‌లైట్స్‌ను ధరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని రాశుల వారికి వెండి మంచిది కాదని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవంటే..

జ్యోతిషంలో వెండికి ఉన్న ప్రాధాన్యం
జ్యోతిషశాస్త్రం ప్రకారం లోహాలకు ప్రత్యేక శక్తి ఉంటుందని విశ్వసిస్తారు. ప్రతి లోహం ఒక గ్రహ ప్రభావంతో ముడిపడి ఉంటుంది. ఆ ప్రభావానికి అనుగుణంగా లోహాన్ని ధరిస్తే జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయని పండితుల అభిప్రాయం. ఈ కోవలో వెండికి ప్రత్యేక స్థానం ఉంది. వెండి చంద్ర గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే మానసిక ప్రశాంతత కోరుకునే వారు వెండిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
వెండి ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
వెండి చంద్రుడు ప్రభావాన్ని బలపరుస్తుందని జ్యోతిషం చెబుతుంది. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, నిద్రకు సంబంధించిన గ్రహం. అందుకే వెండి బ్రాస్లెట్ ధరిస్తే ఆందోళన తగ్గడం, మనసు ప్రశాంతంగా ఉండటం, భావోద్వేగ సమతుల్యత పెరగడం వంటి ఫలితాలు కనిపిస్తాయని నమ్మకం ఉంది. కొందరు శుక్ర గ్రహ ప్రభావం కూడా వెండితో మెరుగవుతుందని చెబుతారు.
ఏ రాశులవారికి వెండి శుభఫలితాలు ఇస్తుంది?
కర్కాటకం, వృశ్చికం, మీనం రాశులవారికి వెండి అనుకూలంగా ఉంటుందని జ్యోతిషశాస్త్రం సూచిస్తుంది. ఇవి నీటి తత్వానికి చెందిన రాశులు. వెండి కూడా అదే తత్వంతో సంబంధం కలిగి ఉందని భావిస్తారు. అందువల్ల ఈ రాశులవారు వెండి బ్రాస్లెట్ ధరిస్తే మానసిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని చెబుతారు.
ఈ రాశులవారు వెండి ధరించేటప్పుడు జాగ్రత్త
మేషం, సింహం, ధనుస్సు రాశులవారికి వెండి అంతగా అనుకూలం కాదని జ్యోతిష్యులు హెచ్చరిస్తారు. ఈ రాశులు అగ్ని తత్వానికి చెందినవి. వెండి ధరించడం వల్ల వీరిలో మానసిక అస్థిరత, ఆర్థిక ఇబ్బందులు, శారీరక అలసట వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నమ్మకం.
ఎప్పుడు, ఏ చేతికి వెండి బ్రాస్లెట్ ధరించాలి?
సోమవారం, శుక్రవారం రోజులు వెండి ధరించడానికి శుభదినాలుగా పరిగణిస్తారు. పురుషులు సాధారణంగా కుడి చేతికి వెండి బ్రాస్లెట్ ధరించడం, మహిళలు ఎడమ చేతికి ధరించడం మంచిదని జ్యోతిషశాస్త్రం సూచిస్తుంది. ప్రతి వ్యక్తి జాతకం భిన్నంగా ఉండటంతో వెండి ఆభరణాలు ధరించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. సరైన రాశికి సరైన లోహం అనుకూల ఫలితాలను ఇస్తుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమచారం ఆధారంగా అందించమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

