MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఉద్యోగాలు మారుతూనే ఉంటారు...ఒకే చోట పనిచేయలేరు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఉద్యోగాలు మారుతూనే ఉంటారు...ఒకే చోట పనిచేయలేరు..!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి స్వభావం, ఆలోచనా తీరు, కెరీర్ పై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారు ఒకే సంస్థలో ఎక్కువ కాలం పనిచేయలేరు. ఉద్యోగాలు మారుతూనే ఉంటారు. ఆ తేదీలేంటో చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 20 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
  నెంబర్ 5..
Image Credit : Twitter

నెంబర్ 5..

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై బుధ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఈ నెంబర్ 5 అనేది మార్పుకు సంకేతం. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువ కాలం ఒకే చోట ఉద్యోగం చేయలేరు.

నిజానికి ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగా చాలా తెలివైనవారు. కానీ, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఒకే రకమైన పని పదే పదే చేయడం నచ్చదు. పనిలో కొత్తదనం లేకపోయినా లేదా స్వేచ్ఛ తక్కువగా ఉన్నా వెంటనే ఆ ఉద్యోగం వదిలేసి.. కొత్త దాని కోసం వెతుకుతారు. వీరు.. అడ్వెంచర్, ట్రావెలింగ్ లాంటి ఉద్యోగాల్లో అయితే ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెంబర్ 3..
Image Credit : stockPhoto

నెంబర్ 3..

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు చెందిన వారే. ఈ తేదీల్లో పుట్టిన వారికి కూడా తెలివితేటలు చాలా ఎక్కువ. కానీ.. పదే పదే ఉద్యోగం మారుతూ ఉంటారు. తమ తెలివితేటలకు తగిన గుర్తింపు లేదా ఎదుగుదల లేదని అనిపిస్తే.. ఏ మాత్రం ఆలోచించకుండా రాజీనామా చేస్తారు. వీరికి ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలనే తపన ఉంటుంది. నేర్చుకోవడానికి ఏమీ లేదనిపిస్తే.. బోర్ ఫీల్ అవుతారు. వీరు క్రియేటివిటీ ఉన్న ఉద్యోగాలు లేదా.. టీచింగ్ లాంటి ఫీల్డ్ ఎంచుకుంటే మాత్రమే.. ఉద్యోగం మారరు.

35
నెంబర్ 2..
Image Credit : stockPhoto

నెంబర్ 2..

ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 2 కి చెందిన వారే. వీరికి చంద్రుడు అధిపతి. చంద్రుడు ఏవిధంగా తిథులను బట్టి మారుతుంటాడో.. వీరి మనసు కూడా అలా మారుతూనే ఉంటుంది. వీరు చాలా సున్నిత మనస్కులు. ఆఫీసులో చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా లేదా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. మానసిక ప్రశాంతత కోసం ఉద్యోగం వదిలేస్తారు. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ ఆ సమయంలో వారి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటాయి.

45
నెంబర్ 7
Image Credit : Asianet News

నెంబర్ 7

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. సంఖ్య 7 కి అధిపతి కేతువు. వీరు కొంచెం లోతైన ఆలోచనాపరులు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.వీరు చేసే పనిలో ఆత్మసంతృప్తిని వెతుకుతారు. డబ్బు కంటే కూడా 'పనిలో తృప్తి' వీరికి ముఖ్యం. ఒకవేళ ఆ పని తమ ఆశయాలకు విరుద్ధంగా ఉందనిపిస్తే వెంటనే ఆ ఉద్యోగాన్ని వదిలేసుకుంటారు.

55
నెంబర్ 6..
Image Credit : stockPhoto

నెంబర్ 6..

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. నెంబర్ 6కి శుక్రుడు అధిపతి. వీరు సాధారణంగా విలాసవంతమైన జీవితాన్ని, అందాన్ని, సౌకర్యాలను కోరుకుంటారు.

వీరు చాలా సెన్సిటివ్. ఆఫీసులో గొడవలు ఉన్నా లేదా వాతావరణం అస్తవ్యస్తంగా ఉన్నా వీరు అక్కడ ఉండలేరు. అందమైన, ప్రశాంతమైన ఆఫీసు సెటప్ వీరికి చాలా ముఖ్యం. వీరు చేసే పనికి తగిన గుర్తింపు లేదా ప్రశంసలు లభించకపోతే, తమను తక్కువ చేస్తున్నారని భావించి వెంటనే వేరే చోటికి వెళ్లిపోతారు.

అంతేకాదు..వీరు పుట్టుకతోనే కళాకారులు. ఏదైనా పనిలో సృజనాత్మకత (Creativity) లేకపోతే వీరికి త్వరగా బోర్ కొడుతుంది. వీరు ఎక్కువగా ఫ్యాషన్, మీడియా, హోటల్ మేనేజ్‌మెంట్ లేదా జువెలరీ వంటి గ్లామర్, క్రియేటివ్ రంగాల్లో ఉంటే స్థిరంగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు.. సానుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ ఉగాది గోల్డెన్ ఇయర్ .. ఊహించని ప్రయోజనాలు
Recommended image2
Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ మూడు రాశుల కెరీర్ లో అద్భుతమైన మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved