Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు కృష్ణుడి లాంటి భర్త దొరుకుతాడు..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్త విషయంలో చాలా అదృష్టవంతులు. వారికి విపరీతంగా ప్రేమించేలా, శ్రద్ధ చూపించే కృష్ణుడిలాంటి భాగస్వామి దొరికే అవకాశం ఉంది.

నెంబర్ 2..
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 2 కి కిందకు చెందుతారు. ఈ సంఖ్యకు చంద్రుడు అధిపతి. చంద్రుడు మనస్సుకు, ప్రేమకు కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా సున్నితమైన మనుసు కలిగి ఉంటారు. అంతేకాకుండా.. చాలా ఎమోషనల్ గా కూడా ఉంటారు. వీరి స్వభావానికి తగ్గట్లుగానే.. వీరిని అర్థం చేసుకునేలా , కృష్ణుడిలా అత్యంత ప్రేమగా చూసుకునే భర్త లభిస్తాడు. వీరి వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
నెంబర్ 6..
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించినవారంతా నెంబర్ 6కు చెందిన వారే. ఈ నెంబర్ 6కి శుక్రుడు అధిపతి. శుక్ర గ్రహం ప్రేమ, ఆకర్షణ, విలాసాలకు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సహజంగానే ఆకర్షణ శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి జీవితంలోకి వచ్చే అబ్బాయి చాలా రొమాంటిక్ గా ఉండటమే కాకుండా.. తన భార్యను ఒక రాణిలా చూసుకుంటాడు. వీరికి అందమైన, ప్రేమమయమైన సంసార జీవితం లభిస్తుంది. వీరి భర్త కృష్ణుడిలా ప్రేమ చూపిస్తారు.. అంతే సరదాగా చిలిపి పనులు కూడా చేస్తారు.
నెంబర్ 1..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కి చెందిన వారే. ఈ తేదీల్లో పుట్టిన వారిని సూర్యుడు పాలిస్తాడు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి లభించే భాగస్వామి వీరిని గౌరవించడమే కాకుండా, వీరి ప్రతి నిర్ణయంలో తోడుగా నిలుస్తారు. కృష్ణుడు అర్జునుడికి మార్గనిర్దేశం చేసినట్లుగా. వీరి భర్త వీరికి రక్షణగా, మార్గదర్శిగా ఉంటారు.
నెంబర్7..
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. నెంబర్ 7కు అధిపతి కేతువు. ఇది ఆధ్యాత్మికత, లోతైన బంధాలకు సంకేతం. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు కేవలం భౌతికమైన ప్రేమ మాత్రమే కాకుండా, సోల్ మేట్ లాంటి భర్త దొరుకుతాడు. వీరి మధ్య బంధం చాలా పవిత్రంగా, రాధా-కృష్టల ప్రేమలా సాగుతుంది.

