Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు పరమ పిసినారులు, పిల్లికి బిచ్చం కూడా పెట్టరు..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం మనుషుల స్వభావం వారు పుట్టిన తేదీపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారు డబ్బు విషయంలో పరమ పిసినారులు. ఆ తేదీలేంటో చూద్దాం...

నెంబర్ 4 ( 4, 13, 22, 31)
ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారంతా రాహువుకు అధిపతి. వీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు అనవసరమైన ఖర్చు అంటే వీరికి అస్సలు నచ్చదు. ప్రతి పైసాకు లెక్క చూసి ఖర్చు చూస్తారు. వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే పది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినా.. అది అవసరమా కాదా అని పదిసార్లు ఆలోచిస్తారు. బయటకి వీరు పిసినారిగా కనిపించినా, వారి దృష్టిలో అది క్రమ శిక్షణగా భావిస్తారు.
నెంబర్ 8 (8,17, 26)..
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి శని అధిపతి. వీరు తాము కష్టపడిన సంపాదనను సింపుల్ గా ఖర్చు చేయరు. రూపాయి ఖర్చు చేయడానికి కూడా వంద సార్లు ఆలోచిస్తారు. వీరు ప్రతి విషయంలోనూ చాలా పొదుపుగా ఉంటారు. ఎదుటి వ్యక్తి ఎంత అడిగినా కూడా.. తమకు ప్రయోజనం లేనిదే ఒక్క రూపాయి కూడా బయటకు తీయరు. అందుకే.. అందరూ వీరిని చాలా పిసినారులు అని పిలుస్తుంటారు.
సంఖ్య 7 (7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు)
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి కేతువు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారు తొందరగా తమ మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టరు.అంటే వీరు Introverts. వీరికి విలాసాల మీద పెద్దగా మోజు ఉండదు. తమ అవసరాలకు మించి ఎవరికీ ఏమీ ఇవ్వడానికి ఇష్టపడరు. అపరిచితులకు లేదా సహాయం అడిగేవారికి డబ్బు ఇచ్చే విషయంలో వీరు చాలా వెనకాడుతుంటారు.

