- Home
- Astrology
- Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు చిన్నప్పుడు కష్టాలు పడినా.. పెద్దయ్యాక డబ్బులో మునిగి తేలుతారు
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు చిన్నప్పుడు కష్టాలు పడినా.. పెద్దయ్యాక డబ్బులో మునిగి తేలుతారు
Birth Date: న్యూమరాలజీ ప్రకారం.. మనం పుట్టిన తేదీ ఆధారంగా మన ఆర్థిక పరిస్థితి కూడా తెలుసుకోవచ్చు. కొందరు చిన్నతనంలో డబ్బులేక కష్టాలు పడినా.. వారు ఎదుగుతున్న కొద్దీ.. డబ్బు సంపాదించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు

Birth Date
న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మన వ్యక్తిత్వం మాత్రమే కాదు.. మనం పుట్టిన తేదీ ఆధారంగా ఆర్థిక పరిస్థితి, కష్ట నష్టాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ సంఖ్యా శాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారు మొదట కష్టాలు పడినా తర్వాత సుఖపడతారు. అంటే.. వారి జీవితంలో మొదటి భాగం( చిన్నతనంలో) లో చాలా కష్టాలు, సవాళ్లు ఎదురౌతాయి. ముఖ్యంగా డబ్బు సమస్యలు ఎదుర్కుంటారు. కానీ, అవే కష్టాలు వారిని రాటు దేల్చి, మధ్య వయసు నుండి వారు ఊహించని స్థాయిలో ఆర్థిక ఎదుగుదలను చూసేలా చేస్తాయి. మరి.. ఏ తేదీల్లో పుట్టిన వారు పేదరికం నుంచి కోటీశ్వరులు అయ్యే జాబితాలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం...
నెంబర్ 8...
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. వీరిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ నెంబర్ కి కష్టానికీ, ప్రతి ఫలానికీ విడదీయలేని సంబంధం ఉంటుంది.
చిన్నతనం : ఈ తేదీల్లో పుట్టిన వారికి బాల్యం అంత సులభంగా, వారు కోరుకున్నట్లు, సంతోషంగా ఉండదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు లేదా కఠినమైన క్రమశిక్షణ మధ్య పెరుగుతారు. వీరు ఏది కావాలన్నా.. ఇతరుల కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
పెద్దయ్యాక: 35 ఏళ్ల తర్వాత వీరి అదృష్టం మారుతుంది. శని ఇచ్చే సంపద చాలా స్థిరంగా ఉంటుంది. వీరు పట్టుదలతో పని చేసి సామ్రాజ్యాలను నిర్మిస్తారు. ప్రపంచంలోని చాలా మంది బిలియనీర్లు ఈ సంఖ్యకు చెందినవారే.
నెంబర్ 4...
ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారిలో విప్లవాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.
చిన్నతనం: బాల్యంలో వీరు తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. సమాజం లేదా కుటుంబం వీరిని సరిగ్గా అర్థం చేసుకోదు. అకస్మాత్తుగా వచ్చే ఆపదలు వీరిని ఇబ్బంది పెడతాయి.
పెద్దయ్యాక: వీరి తెలివితేటలు వయసుతో పాటు పెరుగుతాయి. సాంకేతికత, వ్యాపారం లేదా షేర్ మార్కెట్ వంటి రంగాలలో వీరు అకస్మాత్తుగా ధనవంతులవుతారు. వీరి ఎదుగుదల అందరికీ షాక్ కలిగిస్తుంది.
నెంబర్ 9...
ఏ నెలలో అయినా 9,18, 27 తేదీల్లో జన్మించినవారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. ఈ నెంబర్ పోరాట పటిమకు సంకేతం.ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా లైఫ్ లో మంచి స్థాయికి వెళ్లేందుకు చాలా కష్టపడతారు.
చిన్నతనం: వీరికి చిన్నతనంలో ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబంలో గొడవలు ఉండవచ్చు. వీరు చాలా కోపంగా, మొండిగా ఉండటం వల్ల అనేక సమస్యలు కొనితెచ్చుకుంటారు.
పెద్దయ్యాక: ఈ మొండితనమే వారిని విజేతలుగా మారుస్తుంది. ఏ రంగంలో ఉన్నా సరే, అగ్రస్థానానికి చేరుకోవాలనే వీరి కసి వీరిని ధనవంతులను చేస్తుంది. రియల్ ఎస్టేట్, రక్షణ లేదా సొంత వ్యాపారాల్లో విపరీతంగా సంపాదిస్తారు.
నెంబర్ 1( 1,10, 19, 28)
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. వీరిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో జన్మించిన వారికి సూర్యుడు అధిపతి.
చిన్నతనం: వీరు అహంకారం లేదా ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితులను ఎదుర్కొంటారు. చిన్నప్పుడే పెద్ద బాధ్యతలు వీరిపై పడవచ్చు.
పెద్దయ్యాక: సూర్యుడిలా ప్రకాశిస్తారు. వీరు చేసే పనుల్లో లీడర్‌గా ఎదుగుతారు. వీరి సంపాదన గౌరవప్రదంగా, భారీగా ఉంటుంది.

