Zodiac signs: ఈ రాశుల వారిని ప్రేమించినా తిప్పలు తప్పవు..!
ఈ రాశి వారి ఆలోచనలు, అభిప్రాయాలు, వ్యక్తిత్వం అందరికీ సూట్ అవ్వదు. వీరి మనసు అర్థం చేసుకోలేక వీరిని ప్రేమించిన వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

వీరితో ప్రేమ కష్టమే..
ప్రేమ జీవితంలో చాలా గొప్పది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడటం చాలా సహజం. కొందరి ప్రేమ.. భవిష్యత్తులో పెళ్లిగా మారి, జీవితం ఆనందంగా సాగుతుంది. మరి కొందరి జీవితం మాత్రం పెళ్లి దాకా వెళ్లదు. ప్రేమ అనేది పోరాటం, కోపం, ఏడుపు, బాధ, మొండితనం, స్నేహం మొదలైన అనేక విషయాల మిశ్రమంగా ఉండే అందమైన అనుభవం. కానీ, ప్రేమ సంబంధాలు అందరికీ అంత సులభం కాదు. ముఖ్యంగా జోతిష్య శాస్త్రం ప్రకారం కొందరిని ప్రేమిస్తే.. కచ్చితంగా తిప్పలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఈ రాశి వారి ఆలోచనలు, అభిప్రాయాలు, వ్యక్తిత్వం అందరికీ సూట్ అవ్వదు. వీరి మనసు అర్థం చేసుకోలేక వీరిని ప్రేమించిన వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ప్రేమలో ఎక్కువగా విఫలమయ్యే రాశులేంటో చూద్దామా...
మేషం: సంబంధాలలో శక్తిని కోరుకునే రాశి
మేషం వ్యక్తులు ధైర్యవంతులు, నాయకత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే, ప్రేమ సంబంధంలో, వారి ఆధిపత్యం, కోపం తరచుగా సమస్యలను సృష్టిస్తాయి. వారు తమ ప్రేమికుడి అభిప్రాయాలను వినిపించుకోరు.తాము చెప్పిందే జరగాలి అనే పంతంతో వీరు ఎక్కువగా ఉంటారు. వీరికి నచ్చినట్లు మాత్రమే ప్రవర్తించడం వల్ల వీరికి అందరితో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ప్రేమించిన వారికి దూరం అవుతారు.
కర్కాటక రాశి.. అత్యంత భావోద్వేగ రాశిచక్రం..
కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరు ప్రతి బంధంలోనూ చాలా భద్రత కోరుకుంటారు. వీరు ఎవరికి ప్రేమించినా చాలా గుడ్డిగా నమ్మేస్తారు. చిన్న గొడవ అయినా దానిని చాలా మనసుకు తీసుకుంటారు. చిన్న మాటకే ప్రపంచాన్ని కోల్పోయినట్లుగా ఫీలౌతారు. వారి అసూయ, అనుమానం సంబంధాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
తుల: అనిశ్చిత రాశి
తులారాశి వారు ఆలోచనలు ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి. ప్రేమ జీవితంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ జాప్యం చూపిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ సంకోచపడుతూ ఉంటారు. అసమర్థత కూడా ఎక్కువ. ఈ ప్రవర్తన వారి ప్రేమికులను చికాకుపెడుతుంది. అలాగే, వారు తమ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇష్టపడరు కాబట్టి, సంబంధాలు సరిగ్గా అభివృద్ధి చెందవు.
వృశ్చికం: తీవ్రమైన అసూయ ఉన్న రాశి
వృశ్చిక రాశివారు కూడా చాలా ఎమోషనల్ గా ఉంటారు. కానీ వీరికి అసూయ చాలా ఎక్కువ. అనుమానాస్పదంగా ఉంటారు. వారు తమ ప్రేమికుడి ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు, దీని వలన సంబంధాలపై నమ్మకం కోల్పోతారు. ఫలితంగా, వారి ప్రేమ సంబంధాలు ఎక్కువ కాలం ఉండవు.
కుంభరాశి: భావోద్వేగాలను చూపించని రాశి
కుంభరాశి వ్యక్తులు ఒంటరిగా ఉంటారు. వారు భావోద్వేగాలను వ్యక్తపరచరు. తమకు ఏం కావాలో, ఏ విషయాన్ని నోరు తెరిచి చెప్పరు. ఇలా ఏదీ చెప్పకపోవడం ఎదుటి వారికి కోపం, విసుగు, చిరాకు తెప్పిస్తుంది. దీని వల్ల బంధం బలహీనపడుతుంది.
ఈ రాశుల వారు తమ లక్షణాల కారణంగా ప్రేమ సంబంధాలలో సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి, మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే, మీరు మంచి సంబంధాలను పెంచుకోవచ్చు. ప్రేమ అంటే అర్థం చేసుకోవడం అనే విషయం తెలిస్తే.. ఏ బంధం అయినా నిలపడుతుంది.