Lucky Zodiac signs: ఈ రాశి అమ్మాయిలకు అదృష్టం ఎక్కువ, ఈ అమ్మాయిలను అస్సలు వదులుకోవద్దు
లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే.. మనం కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల అమ్మాయిలకు చాలా ఎక్కువగానే ఉంది.

అదృష్టం మొత్తం వీరిదే..
జోతిష్య శాస్త్రంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నవారికి కాస్త అదృష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలకు అయితే.. ఈ అదృష్ట శాతం మరింత ఎక్కువగా ఉంటుందట. వీరు అదృష్టవంతులు అవ్వడమే కాదు.. వారి జీవిత భాగస్వాములను సైతం అదృష్టవంతులు చేయగలరు. మరి, ఆ ప్రత్యేకమైన రాశులేంటో చూద్దామా…
మేష రాశి...
మేష రాశి వారికి శుక్రుడు ధన స్థానంలో ఉంటాడు. అందుకే , ఈ రాశికి చెందిన అమ్మాయిలకు ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలు షేర్లు, పెట్టుబడుల ద్వారా మాత్రమే కాకుండా జీతభత్యాల ద్వారా కూడా ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూసే అవకాశం ఉంది. స్వల్ప ప్రయత్నంతో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వీరి సొంత ఆదాయంతో ఇంటిని కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో మంచి పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది.
వృషభ రాశి..
వృషభ రాశి అధిపతి శుక్రుడు ఈ రాశిలో సంచారం ప్రారంభించగానే ఈ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. దీనివల్ల వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వారి జీవనశైలి పూర్తిగా మారుతుంది. వారి కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. గృహిణులు సంతాన యోగం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వారి వృత్తి , ఉద్యోగాలలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు స్వగ్రామంలోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
కర్కాటక రాశి..
కర్కాటకం: ఈ రాశి వారికి లాభ స్థాన అధిపతి శుక్రుడు లాభ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి ఈ రాశి స్త్రీలు ఆర్థికంగానే కాకుండా వృత్తిపరంగా కూడా వేగంగా పురోగతి సాధిస్తారు. వైద్యులు, న్యాయవాదులు వంటి వృత్తులలో ఉన్నవారు చాలా బిజీగా ఉంటారు. విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు. గృహిణుల కుటుంబ , వైవాహిక జీవితం సంతోషంగా , సజావుగా సాగుతుంది. వారు ధనవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తారు లేదా వివాహం చేసుకుంటారు. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది.
సింహ రాశి..
శుక్రుడు ఈ రాశి పదవ స్థానంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి మాలవ్య మహాపురుష యోగం ఉంది. దీనివల్ల రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా ఉన్నాయి. వారు ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. వారు రాజకీయ ప్రభావాన్ని పొందుతారు. వారి వృత్తి , వ్యాపారంలో ఆశించిన పురోగతితో పాటు వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. వారు ఉన్నత కుటుంబంలో వివాహం చేసుకుంటారు. వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వారికి స్వగ్రామంలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.
వృశ్చిక రాశి..
వృశ్చికం: ఏడవ స్థాన అధిపతి శుక్రుడు ఏడవ స్థానంలో సంచరించడం వల్ల ఈ రాశికి మాలవ్య మహాపురుష యోగం ఉంది. దీనివల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాముఖ్యత , ప్రభావం పెరుగుతాయి. ప్రమోషన్ అవకాశం ఉంటుంది. వృత్తి జీవితంలో రికార్డులు సృష్టించగలరు. ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. నిరుద్యోగ స్త్రీలకు తక్కువ శ్రమతో మంచి ఉద్యోగం లభిస్తుంది. వారు ధనవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకునే అవకాశం ఉంది.
కుంభ రాశి..
ఈ రాశి నాల్గవ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల దిగ్బల రాజయోగంతో పాటు మాలవ్య మహాపురుష యోగం కూడా ఏర్పడుతుంది. ఇది అధికార యోగాన్ని తెస్తుంది. ప్రాముఖ్యత, ప్రభావం కూడా పెరుగుతాయి. వృత్తి జీవితంలో ఆదాయం అపారంగా పెరుగుతుంది. ఈ రాశి స్త్రీలు కోరుకున్న కంపెనీలో కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. వారు ఉద్యోగ సంబంధిత పోటీ పరీక్షలు , ఇంటర్వ్యూలలో మంచి విజయం సాధిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందే అవకాశం ఉంది.