Birth Date: ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా రొమాంటిక్..!
కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారికి మాత్రం ఎలాంటి కష్టం లేకుండానే.. ఇలాంటి సీన్స్ వారి నిజ జీవితంలో జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

రొమాంటిక్ లైఫ్..
సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చూడటానికి ఎంత బాగుంటాయో కదా..? బయట వర్షం, బ్యాగ్రౌండ్ లో వయోలిన్ మ్యూజిక్ తో వచ్చే రొమాంటిక్ సీన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇలాంటివి చూసి.. తమ జీవితంలో కూడా ఎప్పటికైనా ఇలాంటి ఒక్కటైనా రొమాంటిక్ సీన్ రాకపోతుందా అని ఎదురుచూసే వారు చాలా మంది ఉంటారు. అచ్చంగా సినిమాల్లో సీన్స్ చూసి కాపీ కొట్టాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు. అయితే.. కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారికి మాత్రం ఎలాంటి కష్టం లేకుండానే.. ఇలాంటి సీన్స్ వారి నిజ జీవితంలో జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమాలకు ఏమాత్రం తీసి పోని రొమాంటిక్ లైఫ్ ని వారు ఎక్స్ పీరియన్స్ చేస్తారు.
ఏ తేదీల్లో జన్మించినవారు..
కేవలం రొమాంటిక్ లైఫ్ మాత్రమే కాదు.. లవ్ ప్రపోజల్ కూడా వీరు సినిమాల్లో చూపించినట్లుగానే పొందే అవకాశం ఉంది. మరి, న్యూమరాలజీ ప్రకారం.. ఎలాంటి తేదీల్లో పుట్టిన వారు జీవితంలో చాలా రొమాంటిక్ గా ఉంటారో తెలుసుకుందామా...
ఏ నెలలో అయినా 2, 6,9,11, 15, 18, 20, 24, 27, 29 తేదీల్లో జన్మించిన వారు ప్రేమ విషయంలో చాలా అదృష్టవంతులు. ప్రేమకీ వీరికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. వీరు జీవితంలో ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారు. ప్రేమించిన వారిని గుండెల్లో మోస్తారు. వీరి లవ్ స్టోరీలు మనకు ఒక సినిమా కథకు ఏ మాత్రం తీసిపోనివిధంగా ఉంటాయి.
చంద్రుడు పాలించే తేదీలు (2, 11, 20, 29)
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారిని చంద్రుడు పరిపాలిస్తాడు. ఈ తేదీలు కలల ప్రపంచానికి చిహ్నాలు. ఈ తేదీల్లో జన్మించినవారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ప్రేమలో మునిగిపోతారు. వారికి సాధారణ ప్రేమకథలు సరిపోవు. సినిమా కథను పోలినట్లుగానే వీరి ప్రేమ కథ ఉండాలని ఆరాటపడతారు.
శుక్రుడు పాలించే తేదీలు (6, 15, 24)
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారిని శుక్రుడు పాలిస్తాడు. వారికి ప్రేమ అంటే అందం, రొమాన్స్, మాధుర్యం.వీరు సహజంగానే చూడటానికి చాలా అందంగా ఉంటారు. చాలా రొమాంటిక్ కూడా. కేవలం ఒక్క చిరు నవ్వుతో, కంటి చూపుతో కూడా ఎవరినైనా ప్రేమలో పడేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు ఒక రిలేషన్ లోకి అడుగుపెడితే..దాని పట్ల చాలా నిబద్ధతతో ఉంటారు.
కుజుడు పాలించే తేదీలు (9, 18, 27)
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారిని కుజుడు పాలిస్తాడు. వారి ప్రేమ ప్రయాణం ఒక రొమాంటిక్ థ్రిల్లర్‌లా ఉంటుంది. ఎమోషన్లు తీవ్రంగా ఉంటాయి, కానీ నిజాయితీగా ఉంటాయి. వారు ప్రేమలో పూర్తిగా మునిగిపోతారు. కొన్నిసార్లు ఆ ప్రేమలో నష్టాలు కూడా ఉంటాయి, కానీ వారు దానిని తట్టుకోగల శక్తిని కూడా పొందుతారు. ఎలాగైనా తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటారు. తమ ప్రేమను గెలిపించుకుంటారు.
ఈ సృష్టిలో ప్రేమలో చాలా మంది పడతారు. కానీ, పైన చెప్పిన తేదీల వారు మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ తేదీల్లో జన్మించినవారికి ప్రేమ అనేది ఒక సాధారణ అనుభూతి కాదు.. వారికి అదే జీవితం. వారి జీవితంలోని ప్రతీ ప్రేమ సన్నివేశం ఒక సినిమాలో భాగంలా ఉంటుంది. అలా చూడటం వల్లనే వారు ప్రేమను ఎంతగా విలువ ఇస్తారో, ఎంతగా జీవిస్తారో అర్థమవుతుంది!