- Home
- Astrology
- Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే, వయసు పెరుగుతున్న కొద్దీ యవ్వనంగా మారతారు..!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే, వయసు పెరుగుతున్న కొద్దీ యవ్వనంగా మారతారు..!
అంటే వీరు వైన్ లాంటివారు. అంటే... వైన్ ఎంత పాతదైతే..దాని విలువ అంత ఎక్కువ పెరిగినట్లు..వీరు కూడా వయసు పెరుగుతుంటే యవ్వనంగా మారిపోతారు.న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారిలో ఇలాంటి లక్షణాలు ఉంటాయట.

Birth Date
వయసు పెరుగుతుంటే ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలోకి అడుగుపెడతారు.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.కానీ కొందరిని మీరు చూసే ఉంటారు.. వయసు పెరుగుతున్నా వారిలో చురుకుదనం, చిలిపితనం తగ్గవు. ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. వారికి వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. వారి వయసు పెరుగుతున్నా.. ఆ వృద్ధాప్యం ముఖంలో కనపడదు. తాము ముసలివాళ్లం అయిపోయాం అని ఓ మూల కూర్చోరు. ఎప్పుడు చురుకుగా చలాకీగా ఉంటారు. వారి ముఖంలోనూ యవ్వనం కొట్టొస్తూ కనపడుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే.. వారి శరీరం కన్నా. వారి మనసు యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది. వారి ఏజ్ ఎంత పెరిగినా.. వారు మాత్రం వృద్ధాప్యంలోకి అడుగుపెట్టరు. వీరు ఒక వయసును ఒక ప్రయాణంగా చూస్తారు. ప్రతి దశలో కొత్త విషయాలను నేర్చుకుంటూ, మరింత ముందు చూపుతో జీవితంలో ముందుకు వెళతారు.
అంటే వీరు వైన్ లాంటివారు. అంటే... వైన్ ఎంత పాతదైతే..దాని విలువ అంత ఎక్కువ పెరిగినట్లు..వీరు కూడా వయసు పెరుగుతుంటే యవ్వనంగా మారిపోతారు.న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారిలో ఇలాంటి లక్షణాలు ఉంటాయట. మరీ ముఖ్యంగా నాలుగు తేదీల్లో పుట్టిన వ్యక్తులు కాలానుగుణంగా మెరుగయ్యే లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి వయసుతో పాటు కొత్త శక్తి, కొత్త ఉత్తేజం పెరుగుతాయి. వారి వ్యక్తిత్వం చాలా పరిపక్వంగా, గంభీరంగా మారుతుంది. మరి, ఆ ప్రత్యేకమైన స్పెషల్ తేదీలేంటో తెలుసుకుందామా...
నెంబర్ 3..సృజనాత్మకత ఎక్కువ..
ఏ నెలలో అయినా 3వ తేదీలో జన్మించిన వారు నిత్య యవ్వనంగా ఉంటారు. ఈ తేదీలో జన్మించిన వారు ఎప్పుడూ చాలా ఉల్లాసంగా ఉంటారు. వీరికి సృజనాత్మకత కూడా చాలా ఎక్కువ. వీరు కాస్త ఎమోషనల్ గా ఉంటారు. కానీ, చాలా మంచి మనసుతో ఉంటారు. వారి వ్యక్తిత్వం, మాట అన్నీ చాలా అద్భుతంగా అందరికీ వ్యక్తపరచగలరు. వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ముందుంటారు.చాలా ఉత్సాహంగా ముందుకు వెళతారు. నీరసంగా ఉండరు. తమ చుట్టూ ఉన్న వారిని కూడా ఎప్పుడూ తమ మాటలు, చేతలతో అందరినీ నవ్వుతూ, ఉత్సాహంగా ఉండేలా చూస్తారు. అందుకే, వీరికి ఎవరైనా బాగా నచ్చేస్తారు.
వీరు వయసు పెరిగే కొద్దీ తమ వ్యక్తిత్వాన్నీ అందంగా, ఆనందంగా మార్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో , స్థిరమైన అభిప్రాయాలతో ముందుకు వెళతారు. వాళ్లు ఉన్న చోట ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. తమకన్నా చిన్న వయసు వారిని కూడా ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా చేస్తారు. వారి ముఖంలో అసలు.. వృద్ధాప్య ఛాయలే కనిపించవు. 60 ఏళ్లు దాటినా.. 20 ఏళ్ల వారిలా పరిగెడుతూ, చురుకుగా అన్ని పనులు చేస్తారు. వీరు అందరిలోనూ ఇదే జోష్ నింపుతారు. వీరు మాటలు కూడా చాలా బాగా మాట్లాడగలరు. ఆ మాటలతో మరింత ఆకట్టుకునేలా వీరి ఉపన్యాసాలు సాగుతాయి.
నెంబర్ 8.. శక్తివంతమైన నాయకత్వం, పరిణితి..
ఏ నెలలో అయినా 8వ తేదీలో జన్మించిన వారు కూడా వయసు పెరుగుతుంటే మరింత యవ్వనంగా మారతారు. అంటే.. యవ్వనం శరీరానికి కాదు.. మనసుకు. కాస్త కూడా నీరసంగా, డల్ గా ఉంటారు. ఏ సమయంలో చూసినా వీరు చాలా చురుకుగానే కనపడతారు. వారు చలాకీగా ఉండటమే కాదు.. తమ చుట్టూ ఉన్నవారిలోనూ ఉత్సాహం నింపుతారు. వీరు వయసుతో సంబంధం లేకుండా తమ లక్ష్యాల కోసం అవిరామంగా కృషి చేస్తూనే ఉంటారు. నిరంతరం నిత్య విద్యార్థిలా ఉంటూ.. ఎదగాలనే కంకణం కట్టుకొని ఉంటారు. ఏజ్ వారికి ఒక నెంబర్ మాత్రమే. వయసు వీరిని ఏ విషయంలోనూ ఆపదు. ఇంకా చెప్పాలంటే.. ఏజ్ పెరుగుతుంటే వీరు.. తమ నాయకత్వ లక్షణాలను కూడా మెరుగుపరుచుకుంటూ ఉంటారు. తాము ముందుండి.. మరి కొందరిని నడిపిస్తూ ఉంటారు.
వారి జీవితం అనుభవాలతో, జ్ఞానంతో నిండిన ఓ గ్రంథంలా ఉంటుంది. వారు ఇచ్చే సలహాలు, చూపించే దారులు వారి చుట్టూ ఉన్నవారిని దారిచూపే దీపస్తంభాల్లా ఉంటాయి. వారు యవ్వనాన్ని దాటిన తరువాత కూడా, వారి చిరునవ్వు, సంకల్పం వారిని శాశ్వతంగా ఆకర్షణీయులుగా నిలిపేస్తుంది. అందుకే, ఈ తేదీల్లో పుట్టిన వారు పక్కన ఉంటే, ఎవరికైనా ఉత్సాహం వచ్చేస్తుంది. సంతోషంతో ముందుకు సాగుతారు. ఎక్కడా ఏ విషయంలోనూ వెనకడుగు వేయరు. యువతరానికి మంచి మార్గదర్శకంగా నిలుస్తారు. పది మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. వీరిని చూస్తే.. ఇతరులకు కూడా ఉత్సాహం పొంగుకొస్తూ ఉంటుంది.
నెంబర్ 12.. సహజ నాయకులు, విశ్వాస పూరిత మార్గదర్శకులు..
ఏ నెలలో అయినా 12వ తేదీలో జన్మించిన వారు సహజ నాయకులు అవ్వగలరు. వీరిలో సహజంగానే అంటే పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మంచి, నాయకులు అవ్వగల సత్తా వీరిలో ఉంటుంది. అంతేకాదు.. వీరు ఇతరుల పట్ల చాలా సానుభూతితో వ్యవహరిస్తారు. చాలా సహనం కూడా ఎక్కువ. తమ గురించి మాత్రమే కాదు.. ఇతరుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి కొంచెం కూడా సెల్ఫిష్ నెస్ ఉండదు. వీరి చుట్టూ చాలా పాజిటివిటీ ఉంటుంది. తమ చుట్టూ ఉన్న పాజిటివిటీని.. ఇతరులకు కూడా పంచుతుంటారు. వీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే.. దానిని పూర్తి చేయడంలో అస్సలు వెనకడుగు వేయరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు నడుస్తారు.
వారు వయస్సుతో పాటు మరింత మెచ్యూర్‌గా మారుతారు. వారి ఆత్మవిశ్వాసం, భావోద్వేగ అవగాహన వారి వృద్ధాప్యాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. వారు ఇతరులకు మానసికంగా గొప్ప బలాన్ని ఇస్తారు. వారి చుట్టూ ఉండే వారు వారి మౌనంలోనే మార్గదర్శనం చూస్తారు. ప్రతి పుట్టినరోజు వారి ఎదుగుదలకు ప్రతీకగా మారుతుంది.
నెంబర్ 26.. స్థిరత్వం..
ఏ నెలలో అయినా 26వ తేదీలో జన్మించిన వారు కూడా చాలా చురుకుగా ఉంటారు.వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. వారు ఎంత కష్టపడినా జీవితంలో పెద్దగా గుర్తింపు సాధించలేరు. కానీ, కాలక్రమంలో వారి సహజం, ధైర్యం, అంతర్భావ అనుభవాలు వారికి విలువను తీసుకువస్తాయి. వారు ఎంతో నిగూఢమైన, సున్నితమూన భావాలను కలిగి ఉంటారు.నిజానికి, ఈ తేదీలో పుట్టిన వారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ.. వీరి గొప్పతనాన్ని తొందరగా ఎవరూ గుర్తించరు.వారు మాట్లాడే తీరులో, చూసే చూపులో ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. వయస్సు పెరిగిన కొద్దీ వారు మరింత ఆత్మవిశ్లేషణతో జీవితం వైపు చూస్తారు. వారి లక్ష్యాలు, జీవితంపై దృష్టి మరింత స్పష్టంగా మారుతుంది. ఈ దశలోనే వారు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు.
ఫైనల్ గా...
ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారు తమ వయస్సును పరిమితిగా చూడరు. ప్రతి సంవత్సరం వారిని మరింత శక్తివంతంగా, లోతుగా మారుస్తుంది. వారు వృద్ధాప్యాన్ని శాపంగా కాక, జీవన యాత్రలో మరో మైలురాయిగా స్వీకరిస్తారు.వారు తమదైన శైలిలో జీవితం మీద ప్రభావాన్ని చూపుతారు. చలింపులు లేని స్థిరతతో, స్ఫూర్తినిచ్చే యవ్వనంతో, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు.