MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Grahana Dosham: ఏప్రిల్ 13 నుంచి ఈ 4 రాశులకు కష్టాలు, చంద్ర రాహు కలయికతో గ్రహణ దోషం

Grahana Dosham: ఏప్రిల్ 13 నుంచి ఈ 4 రాశులకు కష్టాలు, చంద్ర రాహు కలయికతో గ్రహణ దోషం

Grahana Dosham: జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం చంద్రుడు, రాహువు కలయిక ఏమాత్రం మంచిది కాదు. ఇది గ్రహణ దోషానికి కారణమవుతుంది. దీని వల్ల 4 రాశుల వారికి కొన్ని రోజులు కష్టాలు తప్పవు. ఆ రాశులు ఇవే.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 12 2026, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

గ్రహణ దోషం వల్ల కన్యారాశి వారికి కొన్ని రోజుల పాటూ కష్టకాలం నడిచే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రోజుల పాటూ కొత్త పనులు ఏవీ మొదలుపెట్టకూడదు. మళ్లీ మంచిరోజులు మొదలయ్యే వరకు వేచి ఉండాలి.  మాటతీరు జాగ్రత్తగా ఉంచుకోండి. కోపం వచ్చినా మౌనం పాటించడం మంచిది. అనవసర వాదనలకు దూరంగా ఉంటే గొడవలు రాకుండా ఉంటాయి. ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి ఏదైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో గొడవలు రావచ్చు. యోగా లేదా ధ్యానం చేస్తే మంచిది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

24
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి అధిపతి కుజుడు. కుజుడికి చంద్రుడు స్నేహం ఉన్నప్పటకిీ ఈ గ్రహణ దోషం వల్ల ఆర్థికంగా అడ్డంకులు ఏర్పడతాయి. ఈ కాలంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి పనులు చేయకండి. డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండానే శత్రువులు పెరిగిపోతారు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. కులదైవాన్ని పూజించండి.  పేదలకు అన్నదానం చేస్తే దోష ప్రభావం తగ్గుతుంది.

Related Articles

Related image1
Raaka: రాకా.. ఈ పదం ఏ భాషకు చెందినది? అల్లు అర్జున్ సినిమాకు ఈ పేరే ఎందుకు పెట్టారు?
Related image2
Fluffy omelette: ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫ్ఫీగా మరింత టేస్టీగా రావాలంటే ఈ చిన్న చిట్కా వాడండి
34
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. రాహువు ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. అనవసరమైన మానసిక గందరగోళం ఏర్పడుతుంది. ఇక పనిచేసే చోట సహోద్యోగులతో గొడవలు జరిగే అవకాశం ఉంది.  తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.  సంయమనంగా ఉండాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కీలకమైన పెట్టుబడులను ఈ సమయంలో వాయిదా వేయడం ఉత్తమం.

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి ఇది మంచి కాలం కాదు.   ప్రస్తుతం రాహువు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. కాబట్టి  ఈ గ్రహణ దోషం మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు ఉండటం వల్ల సమస్యలు రావచ్చు. ఈ సమయంలో అనవసరమైన భయం, నిద్రలేమి, భవిష్యత్తుపై ఆందోళన వంటివి పెరిగిపోతాయి.ఆలోచనలు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఏప్రిల్ 13 తర్వాత ఉద్యోగం మారడం లేదా కొత్త ఆస్తులు కొనడం వంటి విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం 4 రాశులవారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!
Recommended image2
AI Horoscope: ఈ రోజు ఓ రాశివారు ఖరీదైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related Stories
Recommended image1
Raaka: రాకా.. ఈ పదం ఏ భాషకు చెందినది? అల్లు అర్జున్ సినిమాకు ఈ పేరే ఎందుకు పెట్టారు?
Recommended image2
Fluffy omelette: ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫ్ఫీగా మరింత టేస్టీగా రావాలంటే ఈ చిన్న చిట్కా వాడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved