MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 24.5.2026 నుంచి 30.5.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

4 Min read
Author : Kavitha G
Published : May 24 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Asianet News

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఈ వారం మేష రాశివారికి సొంత ఆలోచనలు కలిసివస్తాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు తమ ప్రతిభను చూపించేందుకు ఇది సరైన సమయం. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా పెద్దల మాట వినడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో నిజాయతీ అవసరం. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి ఈ వారం ధన లాభ సూచనలు బలంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది. కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి శుభవార్తలు రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ వారం కొత్త పరిచయాలు, ఆర్థిక పురోగతి కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఈ వారం మిథున రాశివారు చాలా చురుకుగా ఉంటారు. మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు బలంగా ఉన్నాయి. మీడియా, ఐటీ, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. స్నేహితుల సహకారం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల భావాలను గౌరవించాలి. ప్రేమ సంబంధాల్లో స్పష్టత అవసరం. అనవసర అనుమానాలను దూరం పెట్టడం మంచిది. విద్యార్థులు ఫోకస్ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారిని ఈ వారం భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. దాంపత్య జీవితం బలపడుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ.. ఖర్చులు నియంత్రించడం మంచిది. ఆస్తి సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారికి శుభ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి ఈ వారం నాయకత్వ లక్షణాలు మరింత వెలుగులోకి వస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. రాజకీయ, పరిపాలనా రంగాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. అయితే స్నేహితులతో అపార్థాలు రావచ్చు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను స్పష్టంగా చెప్పడం మంచిది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. స్నేహితుల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అయితే ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు రావచ్చు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ సంబంధాల్లో పరస్పర నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కానీ పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలు కురిపించే అవకాశం ఉంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారికి ఈ వారం వృత్తి జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకోవచ్చు. ఉద్యోగాలలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. అయితే పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వివాహ యత్నాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నా చివరికి లాభం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు. ఆస్తి సంబంధిత విషయాల్లో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఈ వారం అదృష్టం కలిసివస్తుంది. విదేశీ అవకాశాలు, ఉన్నత విద్య, ధన లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం. ప్రేమలో ఉన్నవారికి వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ వారం విద్య, సంపదలో మంచి ఫలితాలు ఉంటాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ వారం ఆత్మపరిశీలన అవసరం. ఉద్యోగాలలో వివాదాలు అయ్యే అవకాశం ఉంది. సహోద్యోగులతో సఖ్యతగా ఉండటం మంచిది. ఆర్థికంగా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించడం మంచిది. కుటుంబంలో పెద్దల సలహా ఉపయోగపడుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమలో చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారు ఈ వారం క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం దక్కుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారులకు లాభదాయక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వివాహ యత్నాల్లో పురోగతి ఉంటుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనాలు చేసుకుంటారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి ఈ వారం కొత్త ఆలోచనలు విజయానికి దారి తీస్తాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ శాంతి కోసం కాస్త సహనం అవసరం. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత రావచ్చు. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయటా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఈ వారం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, ధన లాభం కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. ఈ వారం మీరు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు కొత్త మార్గాలను తెరుస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • SA vs AUS
Live
SASA
(127.1 ov)425/9
AUSAUS
(73.0 ov) 99 & 204/4
Day 5 - Session 1
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎవ్వరిమీద ఆధారపడరు.. వారి నిర్ణయమే ఫైనల్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Related Stories
Recommended image1
Lucky Wallpapers: మీ మొబైల్‌లో ఈ వాల్‌పేపర్ ఉంటే అదృష్టం మీ వెంటే!
Recommended image2
Salt Remedies: ఉప్పును ఈ ప్లేసులో పెడితే ఇంట్లో సంపద, సంతోషం రెట్టింపు కావడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved