MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఊహించని వ్యక్తుల నుంచి డబ్బు సహాయం అందుతుంది!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఊహించని వ్యక్తుల నుంచి డబ్బు సహాయం అందుతుంది!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 25.05.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : May 25 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు. బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.

Related Articles

Related image1
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related image2
Salt Remedies: ఉప్పును ఈ ప్లేసులో పెడితే ఇంట్లో సంపద, సంతోషం రెట్టింపు కావడం పక్కా!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వాదనకు దిగడం మంచిది కాదు. ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఇంటా బయటా విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పని భారం తగ్గుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్పదు. దీర్ఘకాలిక రుణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల తీసుకోకపోవడం మంచిది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి డబ్బు సహాయం అందిస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల కొంత చికాకు పెరుగుతుంది. పని ఒత్తిడి వల్ల తలనొప్పి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Numerology: చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు కొనే అదృష్టం ఈ 4 తేదీల్లో పుట్టిన వారిదే
Recommended image3
Ketu Sanchar: దుష్ట గ్రహ నక్షత్ర మార్పు.. జూన్ నెలాఖరు తర్వాత ఈ 4 రాశుల తలరాతే మారిపోతుంది
Related Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image2
Salt Remedies: ఉప్పును ఈ ప్లేసులో పెడితే ఇంట్లో సంపద, సంతోషం రెట్టింపు కావడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved