MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raaka: రాకా.. ఏ భాషకు చెందిన పదం? అల్లు అర్జున్ సినిమాకు ఈ పేరే ఎందుకు పెట్టారు?

Raaka: రాకా.. ఏ భాషకు చెందిన పదం? అల్లు అర్జున్ సినిమాకు ఈ పేరే ఎందుకు పెట్టారు?

Raaka: అల్లు అర్జున్ కొత్త సినిమా రాకా. ఈ సినిమా పేరు వింటేనే చాలా వింతంగా అనిపిస్తుంది. రాకా పేరుకు అర్థాన్ని తెలుసుకునేందుకు ఎంతో మంది ప్రయత్నించారు. రాకా అంటే నిండు పున్నమి అర్థం. రాక్షస గుణం ఉన్న వ్యక్తి అని చెప్పడానికి రాకా అనే పదాన్ని వాడతారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 09 2026, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాకా ఏ భాషకు చెందిన పదం?
Image Credit : Sun Pictures

రాకా ఏ భాషకు చెందిన పదం?

అల్లు అర్జున్ కొత్త సినిమా రాకా. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న సినిమా ఇది. రాకా అనే టైటిల్ ఎంతో మందికి ఆసక్తి కలిగిస్తుంది. ఆ పేరు చుట్టూ అల్లుకున్న కథ ఎలా ఉంటుందో అనే ఆత్రుత కూడా ఎంతో మందికి ఉంది. రాకా పేరు ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రాకా అనేది సంస్కృత పదం. దీనికర్థం నిండు పౌర్ణమి అని అర్థం. చంద్రుని నిండు వెలుగులో ప్రకృతి శక్తులు ఎలాగైతే ప్రభావితం అవుతాయో, ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర కూడా పౌర్ణమి రాత్రులలో ఒక విలక్షణమైన శక్తిగా మారుతుందని సమాచారం. ఇదొక ఫిక్షన్, సోషియో-ఫాంటసీ డ్రామాగా అట్లీ తీస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు బన్నీ. రాకా దాదాపు 900 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో రాకా కూడా ఒకటిగా నిలవబోతోంది.

24
అల్లు అర్జున్ తోడేలా?
Image Credit : Sun pictures

అల్లు అర్జున్ తోడేలా?

ఈ సినిమా కథ గురించి ఇండస్ట్రీలో ఎన్నో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇందులో ఒక తోడేలు మనిషి తరహా పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒక అతీంద్రియ శక్తులున్న యోధుడిలా కనిపించబోతున్నాడని సమాచారం. విడుదలైన పోస్టర్‌లో బన్నీ లుక్ చాలా రఫ్ గా, కళ్ళలో ఒక విధమైన ఫీలింగ్ కనిపిస్తోంది. పౌర్ణమి నాడే అల్లు అర్జున్ పాత్రలోని తోడేలు రూపం బయటపడుతుందని, అందుకే ఈ చిత్రానికి 'రాకా' అనే పేరు పెట్టారని తెలుస్తోంది. హిందీ కామిక్స్‌లో ‘రాకా’ అనే పాత్ర బాగా ఫేమస్. అట్లీ తన సినిమాల్లో హీరోలను అత్యంత శక్తివంతంగా, ఎమోషనల్ గా చూపిస్తారనే పేరుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది మంచి పాత్రగా నిలిచిపోయే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కోసం బాధతో తలబాదుకున్న వల్లి, సేనాపతే చేయించాడని తెలిసిపోతుందా?
Related image2
Anesthesia: నొప్పి లేని ఆపరేషన్.. మత్తునిచ్చే అనస్థీషియా పుట్టుక వెనుక ఉన్న అసలు కథ
34
హీరోయిన్ గా దీపికా పడుకునే
Image Credit : Sun Pictures

హీరోయిన్ గా దీపికా పడుకునే

అట్లీ రాకా కోసం ఫేమస్ నటులను ఎంపిక చేశారు. అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తోంది. దీంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై ఒక మ్యాజిక్ సృష్టించడం ఖాయ. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పనిచేస్తున్నాడు. అట్లీ బన్నీతో కలిసి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధపడుతున్నారు. కేవలం తెలుగు, తమిళ భాషలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పదికి పైగా భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

44
విడుదల ఎప్పుడు?
Image Credit : Sun Pictures

విడుదల ఎప్పుడు?

‘రాకా’ సినిమా అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా. పౌర్ణమి వెలుగులో దాగున్న రహస్యం ఏమిటి? రాకాగా బన్నీ చేసే విధ్వంసం ఎలా ఉండబోతోంది? చూసేందుకు వారు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి 2027 లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సోషల్ మీడియాలో రాకా ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: పాపం అఖిల్ కి చుక్కలు చూపిస్తున్న రాంచరణ్..మళ్ళీ దెబ్బ తప్పదా ?
Recommended image2
Weight Loss: ఆ సమస్య వల్లే బరువు తగ్గిపోయా, బోల్డ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్.. పాపులారిటీ కోసం కాదు
Recommended image3
Jaya Bachchan: రూ.120 కోట్లతో 78 ఏళ్ళ వయసులో సీనియర్ హీరోయిన్ జల్సా..ఫోటోలు చూశారా
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కోసం బాధతో తలబాదుకున్న వల్లి, సేనాపతే చేయించాడని తెలిసిపోతుందా?
Recommended image2
Anesthesia: నొప్పి లేని ఆపరేషన్.. మత్తునిచ్చే అనస్థీషియా పుట్టుక వెనుక ఉన్న అసలు కథ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved