MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Guru gamanam: గురు సంచారంతో ఈ 4 రాశుల వారికి తిప్పలు తప్పవు, అయితే కొన్ని రోజులే

Guru gamanam: గురు సంచారంతో ఈ 4 రాశుల వారికి తిప్పలు తప్పవు, అయితే కొన్ని రోజులే

Guru gamanam: జీవితాన్ని మార్చే 9 గ్రహాల్లో బృహస్పతి ఎంతో ముఖ్యమైన గ్రహం. గురు గ్రహం జూన్ 2 న కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల 4 రాశుల వారికి కష్టకాలం మొదలవుతుంది. కొన్ని రోజుల పాటూ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 24 2026, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : stockPhoto

మేష రాశి

గురు గ్రహం సంచారం వల్ల మేష రాశి కొన్ని రోజుల పాటూ కష్టాలు తప్పవు. వీరి నాల్గవ ఇంట్లోకి గురువు ప్రవేశిస్తాడు. దీనివల్ల మీ కుటుంబంలో అనవసరమైన మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి మరమ్మతులు చేయించాల్సి వస్తుంది.  లేదా వాహనాల కోసం అనవసర ఖర్చు పెట్టాల్సి రావచ్చు.ఆరోగ్యానికి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో ఇష్టంలేని బదిలీలు జరగవచ్చు.  లేదా పనిభారం పెరగవచ్చు.  తొందరపడి ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోవద్దు. ఓపికగా ఉండాలి. 

పరిహారం: ప్రతి గురువారం దక్షిణామూర్తికి పసుపు రంగు పువ్వులతో పూజ చేసి, శనగల మాల సమర్పిస్తే జరిగే నష్టాలు కొంతవరకు తగ్గుతాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
మిథున రాశి
Image Credit : Asianet News

మిథున రాశి

బృహస్పతి మిథున రాశి వారి రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ ఇల్లు ధన, వాక్కు స్థానం.  దీనివల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితిలో మార్పులు రావచ్చు. చేతికి డబ్బు వచ్చినా, దాన్ని పొదుపు చేయలేరు. విపరీతంగా ఖర్చు పెడతారు. ఓపికగా ఉండాలి.  కోపంలో మాట్లాడే మాటలు కుటుంబంలో గొడవలను తీసుకొస్తాయి. విలాస వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయకూడదు. ఆర్థిక విషయాల్లో  చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు అప్పు ఇవ్వడం వంటివి చేయవద్దు. 

పరిహారం: ప్రతి గురువారం ఆవుకు అరటిపండు లేదా అవిసి ఆకులు తినిపిస్తే మంచిది. ధన కొరత తీరి, సంపద పెరుగుతుంది.

Related Articles

Related image1
Pudina plant: పుదీనా మొక్కకు ఈ పొడి కలిపిన నీటిని వేశారంటే పచ్చని ఆకులతో నిండిపోతుంది
Related image2
Lemon pickle: నూనె వాడకుండా నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టేయండి, రెసిపీ ఇదిగో
34
తులా రాశి
Image Credit : Asianet News

తులా రాశి

గురు గ్రహం తులా రాశి వారికి పదవ ఇంట్లోకి అడుగుపెడతారు. ఇది వారి జీవన స్థానం.  దీనివల్ల ఈ రాశివారు వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆకస్మిక మలుపులు, లేదా ఇబ్బందులు రావచ్చు. పనిభారం పెరగడం వల్ల మానసిక ఒత్తిడి, టెన్షన్ పెరుగుతాయి. పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలు మీ ఉద్యోగానికే ముప్పు తెచ్చిపెట్టొచ్చు. తొందరపడి ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేయడం లేదా కొత్త వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. 

పరిహారం: గురువారాల్లో శివాలయానికి వెళ్లి నవగ్రహ పూజ చేయడంతో పాటు, వృద్ధులకు లేదా నిరాశ్రయులకు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

44
కుంభ రాశి
Image Credit : Google

కుంభ రాశి

బృహస్పతి కుంభ రాశి వారి ఆరవ ఇంట్లోకి అడుగుపెడతాడు. ఈ ఇల్లు రుణ, రోగ, శత్రు స్థానం.  ఈ సంచారం వల్ల మీకు ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి. అనవసరంగా వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రాశి వారికి శత్రువుల నుంచి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. కోర్టు కేసులు లేదా చట్టపరమైన సమస్యలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి. చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. 

పరిహారం: గురువారాల్లో బృహస్పతికి నెయ్యి దీపం వెలిగించి, 'ఓం గురవే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి జరుగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు!
Recommended image3
Cocroach : కలలో బొద్దింక కనిపిస్తే మంచిదా, చెడ్డదా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Pudina plant: పుదీనా మొక్కకు ఈ పొడి కలిపిన నీటిని వేశారంటే పచ్చని ఆకులతో నిండిపోతుంది
Recommended image2
Lemon pickle: నూనె వాడకుండా నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టేయండి, రెసిపీ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved