MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Jasmine: భార్యకు భర్త మల్లెపూలు ఎందుకు కొనివ్వాలి..? ఇస్తే జరిగే మ్యాజిక్ ఇదే

Jasmine: భార్యకు భర్త మల్లెపూలు ఎందుకు కొనివ్వాలి..? ఇస్తే జరిగే మ్యాజిక్ ఇదే

 Jasmine: ఆడవారికి మల్లెపూలు అంటే ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అందులోనూ ఆ పూలు భర్త తెచ్చి ఇస్తే.. భార్య మరింత ఎక్కువ సంతోషిస్తుంది. అసలు.. భర్త భార్యకు మల్లెపూలు ఎందుకు కొనివ్వాలి? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 06 2026, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Jasmine
Image Credit : Gemini AI

Jasmine

చాలా మంది భర్తలు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు భార్య కోసం ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే.. విలువైన వస్తువులు తీసుకొని వెళ్లకపోయినా మూరెడు మల్లెపూలు మాత్రం కచ్చితంగా తీసుకువెళ్లి.. భార్యకు ఇవ్వాలని జోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇలా చేయడం వల్ల భార్య సంతోషం పెరుగుతుందే లేదో కానీ.. భర్త సంపద మాత్రం పెరుగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దీని వెనక బలమైన జోతిష్య కారణాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మల్లెపూలు- శుక్ర గ్రహం...
Image Credit : chatgpt

మల్లెపూలు- శుక్ర గ్రహం...

జోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని లక్ష్మీ దేవి స్వరూపంగా, ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. శుక్రుడికి సుగంధ ద్రవ్యాలు, తెల్లని పూలు, ముఖ్యంగా మంచి వాసన ఇచ్చే మల్లెపూలు అంటే అత్యంత ప్రీతి. జాతక చక్రంలో భార్యకు కారకుడు కూడా శుక్రుడే. అంటే, భార్య సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో శుక్రుడి అనుగ్రహం పొందినట్లే..

33
భార్యకు మల్లెపూలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు...
Image Credit : Asianet News

భార్యకు మల్లెపూలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు...

1.ఆదాయం, వ్యాపార వృద్ధి:

పురుషుడి జాతకంలో ఆర్థిక స్థితి బాగుండాలన్నా, చేసే వ్యాపారంలో లాభాలు రావాలన్నా శుక్రుడి బలం అవసరం. భర్త తన సంపాదన నుంచి కొంత భాగం వెచ్చించి భార్యకు మల్లెపూలు కొనివ్వడదం వల్ల, ఆ సుగంధం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది పరోక్షంగా భర్త ఆదాయ మార్గాలను మెరుగుపరుస్తుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

2.మానసిక ప్రశాంతత..

మల్లెపూల వాసనకు ఒత్తిడి తగ్గించే గుణం ఉంటుంది. రోజంతా ఆఫీసు పనులతో అలసిపోయి వచ్చిన భర్త, ఇంటికి రాగానే భార్య తలలోని మల్లెపూల పరిమిళాన్ని ఆస్వాదించడం వల్ల ఇద్దరిలోనూ మానసిక ప్రశాంతత లభిస్తంుది. దీని వల్ల ఇంట్లో గొడవలు తగ్గి, లక్ష్మీ దేవి నివాసం ఉంటుంది.

3. దారిద్య్రం దూరం:

శాస్త్రాల ప్రకారం, ఏ ఇంట్లో అయితే భార్యకు గౌరవం లభిస్తుందో... ఏ ఇల్లయితే సుగంధ భరితంగా ఉంటుందో అక్కడ దరిద్రం దరిచేరదు. మల్లెపూలు కొనివ్వడం అనేది భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడమే కాకుండా, గ్రహ గతులను అనుకూలంగా మార్చుకునే ఒక సులభమైన పరిహారం.

ఫైనల్ గా చెప్పేది ఏంటంటే...

కేవలం మూరెడు మల్లెపూలు కొంటే ఆదాయం వచ్చేస్తుందా అని తర్కించేకంటే, ఆ చిన్న పని వల్ల భార్య ముఖంలో కలిగే చిరునవ్వు, ఆ సుగంధం వల్ల ఇంట్లో ఏర్పడే ప్రశాంతత.. భర్త మరింత ఉత్సాహంగా పని చేయడానికి దోహదపడతాయి. అదే క్రమంగా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. కాబట్టి, నేటి నుంచే మీ భార్య కోసం ఆ మల్లెపూల మాయాజాలాన్ని ఇంటికి తీసుకువెళ్లండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Jasmine: రాత్రికి రాత్రే మల్లెపూలు పూయాలంటే ఈ ట్రిక్ ఒక్కటి చాలు
Recommended image2
Jasmine: రాత్రిపూట మల్లెపూలు ఎందుకు పెట్టుకోవాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved